Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
uyyalavada is indian movie

ఈ సంచికలో >> సినిమా >>

రాజమౌళి నెక్స్ట్‌ ఏంటి?

what  next rajamouli

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సినిమా 'బాహుబలి'. తెలుగు సినిమా ఖ్యాతిని దేశ దేశాల చాటి చెప్పిన చిత్రమిది. ఇలాంటి గొప్ప చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్‌ ది గ్రేట్‌ రాజమౌళి. తన తదుపరి చిత్రం ఏంటని చెప్పట్లేదు. ప్రస్తుతం ఆయన 'బాహుబలి' సినిమా సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే రాజమౌళి సై అనాలే కానీ ఆయనతో సినిమా చేయడానికి భాషతో సంబంధం లేకుండా పలువురు ప్రముఖ నటీనటులు రెడీగా ఉన్నారు. టాలీవుడ్‌, బాలీవుడ్‌ అనే తేడా లేకుండా ఆయనతో సినిమా చేసేందుకు ఆశక్తి చూపుతున్నారు. అయితే రాజమౌళి మాత్రం తన ఛాయిస్‌ ఏంటనీ తెలియడం లేదు.

రాజమౌళి మాత్రం 'బాహుబలి' సక్సెస్‌ మూడ్‌ నుండి బయటికి రాలేదు. మరో పక్క విజయేంద్రప్రసాద్‌ స్టోరీలతో రెడీగా ఉన్నారు. రాజమౌళిదే ఆలస్యం. అయితే ఇంత హైప్‌ క్రియేట్‌ అయ్యాక రాజమౌళి చేయబోయే నెక్స్ట్‌ మూవీ రేంజ్‌ కూడా అలాగే ఉండాలి. అందుకే రాజమౌళి ఆచి తూచి ఆడుగులెయ్యాలి. అందుకోసం కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటాడా? రాజమౌళి లేక ఏదో ఒక చిన్న సినిమా తీసి రిలాక్స్‌ అవుతాడా అనేది తెలియ రావడం లేదు. 'బాహుబలి' సినిమా కోసం గత ఐదేళ్లుగా తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు రాజమౌళి. అందుకే కొంచెం గ్యాప్‌ తీసుకున్నాకే తన తదుపరి సినిమా కోసం ఆలోచిస్తాడనీ ఆయన సహచరుల నుండి అందిన సమాచారమ్‌. ఏది ఏమైనా ఈ సారి రాజమౌళి నుండి రాబోయే సినిమా 1000 కోట్లు కాదు, రెండు మూడు కోట్లు పైనే వసూళ్లు సాధిస్తుందని అశించడం వింతేమీ కాదనిపిస్తోంది. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam