Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Forest Daal | Easy to Prepare Healthy and Tasty Daal

ఈ సంచికలో >> శీర్షికలు >>

మనశ్శాంతి - టి.శ్రీనివాస్

ఒకసారి బుధ్ధుడు తన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు.
ఇంతలో ఒక శిష్యుడిని పిలిచి, "నాయనా, దాహంగా ఉంది, ఆ కనబడే చెరువునుంచి కొన్ని నీళ్ళు తీసుకురా" అని చెప్పాడు.

అప్పుడే ఒక ఎద్దులబండి ఆ చెరువులోంచి వెళ్ళడం మూలంగా నీరు అంతా మురికిగా తయారయింది. శిష్యుడు ఆ నీరు తేరుకొనేంతవరకు అలాగే కూర్చున్నాడు. అరగంట సమయం గడిచింది. చూస్తే నీరు ఇంకా మురికిగానే ఉంది. మరో అరగంట సమయం వేచి చూసాడు. నీరు తేరుకున్నాయి.

ఆ పైన ఉన్న నీరు తీసుకెళ్ళి బుధ్ధుడికి ఇచ్చాడు శిష్యుడు.

అప్పుడు శిష్యుని అనుమానం " ఈ నీరు అంత మురికిగా ఉన్నా, ఎలా తేరుకుంది? నువ్వు కాసేపు దాని మానాన దాన్ని కదపకుండా ఉంచావు. అది నెమ్మదిగా మురికి కిందకుపోయి, స్వచ్చమైన నీరు పైకి తేరుకుంది. మన మనసు కూడా అంతే !!

ఒకసారి మనసులో ఆందోళన కలిగినపుడు దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా కొంతసేపు వదిలేయాలి. కొంతసేపు గడిచేటప్పటికి చింత అనే మురికి అంతా అడుగుకు వెళ్ళిపోయి, మనసు స్వచ్చంగా మారుతుంది.

నీ మనసు తేలిక అవ్వడానికి నువ్వు ఏ ప్రయత్నమూ చేయవలసిన పనిలేదు.

కొంతసేపు అలా వదిలేస్తే, దానంతట అదే సద్దుమణుగుతుంది. చక్కబడుతుంది.

మనశ్శాంతి పొందడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. మన ప్రయత్నం లేకుండానే జరిగిపోతుంది."

మీకు ఇష్టమైన వాళ్లను ఎప్పుడూ వదులుకోకండి !!

వారు తప్పులు చేసారు అనుకుంటే, ఒక్క క్షణం వారితో మీరు గడిపిన అద్భుతమైన, ఆనందకరమైన క్షణాల గురించి ఒక్కసారి తలుచుకోండి.

ఎందుకంటే, పరిపక్వత కన్నా, అభిమానం ముఖ్యం.

మిమ్మల్ని మీరు కౌగలించుకోలేరు.

మిమ్మల్ని మీరు ఓదార్చుకోలేరు.

అందుకోసం ఖచ్చితంగా ఒకరి సహాయం ఉండాలి.

జీవితం అంటే ఒకరి కోసం ఒకరు బ్రతకటమే.

మీకు ఇష్టమైన వారి కోసం, మిమ్మల్ని ప్రేమించేవారికోసం బ్రతకండి. స్నేహం, ప్రేమ, బంధుత్వాలు అనేవి డబ్బు భాష మాట్లాడేవారికి అర్థం కావు.

ఎందుకంటే కొన్ని పెట్టుబడులు మనకు కనిపించే లాభాలను ఇవ్వలేకపోవచ్చు, కాని మనలను సంపన్నుల్ని చేస్తాయి.

మరిన్ని శీర్షికలు