Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

sirasri question
1. అహింసా పరమో ధర్మః అని నినదించిన ఈ దేశంలో, శాకాహారి అయిన గాంధీజీ జాతిపిత అయిన ఈ దేశంలో, అహింసావాది అయిన బుధ్ధుడు నడిచిన ఈ దేశంలో అందరూ శాకాహారులుగా ఉండడమే సమంజసం. లేకపోతే దేశాన్ని, జాతిపితను అవమానించినట్టే. జంతుబలులు ఒక దురాచారంగా ఈ దేశంలో పుట్టాయే తప్ప అది భారతీయత కాదు. ఆవు ఒక్కటే కాదు జంతువు ఏదైనా నరకడం ఆపాల్సిందే. మొక్కల్లో కూడా ప్రాణం ఉంది కదా అంటే...అది వేరు. రక్తం, మాంసం, హాహాకారాలు ఉండవు కాబట్టి వాటి ప్రాణం తీస్తున్నామని చిన్నపిల్లాడికి కూడా అనిపించదు. కనుక పర్వాలేదు.

2. అహింసా పరమో ధర్మః అన్న ఈ దేశంలోనే స్వధర్మం వదలొద్దని భగవద్గీతలో చెప్పబడింది. మరి చర్మకారుల స్వధర్మం హింసతో కూడుకున్నదే. మనుషులపట్ల హింస గురించే గీతలో తప్పుగా చెప్పబడలేదు. ఇక జంతువుల పట్ల హింసగురించి అసలే లేదు. ఉంటే అంతపెద్ద అక్షౌహిణీ శైన్యంలో గుర్రాలు, ఏనుగులు చనిపోవడాన్ని కృష్ణుడు సమర్ధించడుగా! కనుక, ఎక్కువ ఆలోచించి ఓవర్ సెన్సిటివ్ అయిపోకుండా మనిషి కూడా జంతుకుటుంబానికి చెందినవాడే కాబట్టి "ఒక జంతువు మీద మరో జంతువు బ్రతకడం ప్రకృతి సహజం" అనే ఫుడ్ సైకిల్ సిధ్ధాంతాన్ని నమ్మి మాంసాహారం తింటే తప్పేమీ లేదు.

పై రెండిట్లో ఏది కరెక్ట్?
మరిన్ని శీర్షికలు
naku 100 karanalunnaayi short flim