Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
dasari is no more

ఈ సంచికలో >> సినిమా >>

సూపర్‌ స్టార్‌ 'కాలా' మొదలెట్టేశాడోచ్‌

kalaa movie  shooting start

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కొత్త సినిమాకి 'కాలా - కరికాలన్‌' అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. కరికాలన్‌ అంటే యోధుడు, సమర్ధుడు అనే అర్ధాలున్నాయి. యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. ముంబయ్‌ మాఫియా నేపధ్యంలో తెరకెక్కుతోంది. 'కబాలి' డైరెక్టర్‌ పా రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి హీరో ధనుష్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తొలిసారిగా ధనుష్‌ నిర్మాణంలో రజనీకాంత్‌ నటిస్తున్న చిత్రమిది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. అంతే కాదు భారీ బడ్జెట్‌తో ఎక్కడా రాజీ పడుకుండా ఈ సినిమాని ధనుష్‌ రూపొందిస్తున్నారట. గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో అత్యంత పవర్‌ఫుల్‌గా రజనీ పాత్ర ఉండబోతోంది

ఈ సినిమాలో. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలయ్యింది. మంచి రెప్పాన్స్‌ అందుకుంటోంది. తాజాగా ఈ సినిమా సెట్స్‌ మీదికెళ్లింది. షూటింగ్‌ షెడ్యూల్‌ జోరుగా కొనసాగుతోంది. బాలీవుడ్‌ నటి హ్యూమా ఖురేషి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాదు ఈ మధ్యే రజనీ తన రాజకీయ రంగ ప్రవేశం గురించి నోరు విప్పారు. రాజకీయంగానూ ఈ సినిమా ప్రభావితం చూపనుందని అంచనా వేస్తున్నారు. టైటిల్‌ లోగో వచ్చాక సినిమాపై ఉన్న అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరో పక్క రజనీకాంత్‌ నటిస్తోన్న సినిమా 'రోబో 2.0' షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుంది. వచ్చే ఏడాది ప్రధమార్ధంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అమీజాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 

మరిన్ని సినిమా కబుర్లు
puja hegde act with allu arjun