Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

09-06-2017 నుండి 15-06-2017 వరకు వారఫలాలు I - - శ్రీకాంత్

మేష రాశి :  ఈ వారం మొత్తంమీద సంతానపరమైన విషయాల్లో నూతన నిర్ణయాల వైపుగా అడుగులు వేస్తారు. పెద్దలతో చర్చలు చేయునపుడు అవతలివారి ఆలోచనలను ముందుగా తెలుసుకొని , ఆతర్వాత మీ ఆలోచనలను తెలియజేసే ప్రయత్నం చేయుట మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞులతో చేసిన చర్చలు ఒక కొలిక్కి వస్తాయి , నూతన పెట్టుబడులకు ఆస్కారం కలదు. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. విదేశాలలో ఉన్న బంధువులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో ఒకింత మంచిమార్పులు రావడం అనుకూలమైన విషయం.

 

 

 వృషభ రాశి : ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన లబ్దిని పొందుతారు, వారితో మీకున్న అనుభందం మరింత బలపడుతుంది. సాధ్యమైనంత వరకు చర్చలకు దూరంగా ఉండుట సూచన. మిత్రులతో కలిసి దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. స్వల్పఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే ఆస్కారం ఉంది. సోదరులతో చేపట్టిన చర్చలు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది, జాగ్రత్త. మీ మాటతీరు మూలాన కుటుంబసభ్యులను ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. నూతన వాహనములు కొనుగోలు చేయుటకు ఆస్కారం కలదు. 
 

.
మిథున రాశి : ఈవారం మొత్తంమీద ఇష్టమైన వ్యక్తుల నుండి వచ్చిన సూచనల విషయంలో మరొకసారి ఆలోచన చేయుట, దానికి తగిన విధంగా సిద్ధం అవడం మంచిది. సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పెద్దలనుండి ఉద్యోగంలో వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోండి. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. నూతన పెట్టుబడుల కోసం నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో పెద్దల అభిప్రాయాల మేర ముందుకు వెళ్ళండి. వారం చివరలో కొంతమేర పనిఒత్తిడి పెరుగుటకు ఆస్కారం కలదు.

 


కర్కాటక రాశి :  ఈవారం మొత్తంమీద మిశ్రమఫలితాలు పొందుతారు. చేపట్టే పనుల విషయంలో స్పష్టత అవసరం. గతంలో మీకు రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. సంతానపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలను తీసుకొనే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. ఖర్చుల విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించుట మంచిది. పెద్దలతో మీ ఆలోచనలను పంచుకుంటారు, ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి, సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. పెద్దలతో మనస్పర్థలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. దూరదృష్టితో ముందుకు వెళ్ళండి.

 



 సింహ రాశి :  ఈవారం మొత్తంమీద మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. ఆశించిన మేర సహకారం వారినుండి లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకండి. మీ మాటతీరును సరిచుకోవడం వలన ఇబ్బందులు తగ్గుటకు ఆస్కారం కలదు. సోదరులతో మీ ఆలోచనలను పంచుకుంటారు, వారికి అనుగుణంగా నడుచుకోవడం మంచిది. కుటుంబపరమైన విషయాల్లో నూతన సమస్యలు ఏర్పడే ఆస్కారం కలదు, మానసికంగా ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చర్చల వలన అనుకోని మనస్పర్థలు రావడానికి ఆస్కారం కలదు.  

 

కన్యా రాశి :  ఈవారం మొత్తంమీద కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాల దిశగా ముందుకు వెళ్ళుటకు ఆస్కారం ఉంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. వ్యాపారపరమైన విషయంలో ఆచితూచి వ్యవహరించుట మంచిది. అధికారులతో చర్చలు చేయుటకు అవకాశము ఉంది. సాధ్యమైనంత వరకు సర్దుబాటు విధానం మంచిది. గతంలో చేపట్టిన పనులకు సమాధానం చెప్పవలసి వస్తుంది. కావున పనులవిషయంలో సరైన అవగహన కలిగి ఉండుట మంచిది. సంతానం మూలాన అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనే కోరిక బలంగా ఉంటుంది.

 


తులా రాశి : ఈ వారం మొత్తంమీద నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త తడబాటు పొందుతారు. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో అనవసరమైన ఖర్చులను తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీస్కోవడం సూచన. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకోవడం మంచిది. కుటుంబపరమైన విషయాల్లో భాద్యతలు పెరుగుటుకు ఆస్కారం ఉంది, వాటికి కట్టుబడి ఉండుట సూచన. విదేశీప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు ఆస్కారం ఉంది.

 

   

వృశ్చిక రాశి : ఈ వారం మొత్తంమీద సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం సూచన. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. పెద్దలతో మీ ఆలోచనలను పంచుకుంటారు. వాహనములు కొనుగోలు చేయుటకు ఆస్కారం కలదు. విదేశీప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది, గట్టిగా ప్రయత్నం చేయుట ద్వారా మీ ఆకాంక్షలు నెరవేరే అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. వారితో కలిసి నూతన ప్రయత్నాలు చేపట్టుటకు ఆస్కారం ఉంది. ఖర్చులను తగ్గించుకోవడం మంచిది.

 

ధనస్సు రాశి :   ఈ వారం మొత్తంమీద ఇస్టమైన వ్యక్తులను కలుస్తారు, తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. కాకపోతే ప్రధాన సూచన శక్తికి మించిన పనులకు దూరంగా ఉండుట సూచన. పెద్దలతో మీకున్న పరిచయం మరింత బలపడే ఆస్కారం కలదు. మీ మాటతీరులో ఉన్న కఠినం కాస్త తగ్గుంచికొనే ప్రయత్నం చేయుట సూచన. ఉద్యోగాల్లో నూతన ప్రయాత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం కలదు. బంధువుల నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు.

 

 

మకర రాశి :   ఈవారం మొత్తంమీద చిన్న చిన్న పనులను ముందుగా పూర్తిచేసే ప్రయత్నం చేయుట మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. నూతన ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి. పెద్దలతో ఎటువంటి మనస్పర్థలు రాకుండా తగిన జాగ్రత్తలు తీనుకోవడం మంచిది. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు, అధికంగా ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న మిత్రులనుండి నూతన విషయాలు తెలుస్తాయి. స్త్రీ పరమైన విషయాల్లో ఏమాత్రం అశ్రద్ధ చూపిన ఇబ్బందులు పెరుగుటకు ఆస్కారం కలదు. సర్దుబాటు విధానం సర్వదా మంచిది.

 

   

కుంభ రాశి :  ఈ వారం మొత్తంమీద చేపట్టు పనుల విషయంలో స్పష్టత అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయాత్నాలు మొదలు పెడతారు, కాకపోతే మిశ్రమఫలితాలు పొందుతారు. వ్యాపార పరమైన విషయాల్లో మీ దృష్టిని ఏకాగ్రతం చేయడం వలన లబ్దిని పొందుటకు ఆస్కారం ఉంది. ఉద్యోగాల్లో లేక వృత్తిలో స్పష్టత ఉండుట వలన మేలుజరుగుతుంది. మీ మాటతీరు మూలాన ఆత్మేయులు ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం ఉంది, జాగ్రత్త. తల్లితరుపు బంధువుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. సంతానం విషయంలో అనుభవజ్ఞుల నుండి సూచనలు స్వీకరిస్తారు. మిత్రులనుండి నూతన విషయాలు తెలుస్థాయి.

 

మీన రాశి : ఈవారం మొత్తంమీద నూతన పరిచయాలకు ఆస్కారం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. నూతన పెట్టుబడుల కోసం గట్టిగా ప్రయత్నం చేయుట ద్వారా ఆశించిన మేర ఫలితాలు పొందుతారు. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. మిత్రులతో కలిసి నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. కుటుంబంలో సభ్యులనుండి వచ్చిన సూచనల గురుంచి ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయుట మంచిది. నూతన ప్రయత్నాలకు ప్రాధాన్యం ఇస్తారు.

మరిన్ని శీర్షికలు
uttarakhand