Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sweety is so clarity

ఈ సంచికలో >> సినిమా >>

ఆ చిన్న సినిమాకి పెద్దల అండ

big celebrities support

ప్రస్తుతం చిన్న సినిమాలకి పబ్లిసిటీతో పాటు ప్రముఖుల సపోర్ట్‌ కూడా బాగా లభిస్తోంది. ఒకప్పుడు చిన్న సినిమాలను అస్సలు లెక్క చేసేవారు కాదు. కానీ చిన్న సినిమాలు కూడా విజయం సాధిస్తేనే సినీ పరిశ్రమ పూర్తిగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. ప్రస్తుత తరుణంలో చిన్న సినిమాలకు ఆదరణ బాగా లభిస్తోంది. నటీ నటులు, టెక్నీషియన్స్‌తో సంబంధం లేకుండా చిన్న సినిమాలను ఆదరిస్తున్నారు. అలాగే ప్రేక్షకలు కూడా చిన్న సినిమాలకు బ్రహ్మరధం పడుతున్నారు. ఆ రకంగా విజయం సాధించిన సినిమాల్లో 'పెళ్లి చూపులు' సినిమా ఒకటి. ఆ తరహాలో ఇప్పుడు మరో సినిమా రాబోతోంది. అదే 'కాదలి'. ఈ సినిమాలో నటీనటులు గానీ, టెక్నీషియన్లు గానీ ఎవ్వరికీ తెలీదు. అంతా కొత్త వాళ్లే. కానీ ఈ సినిమాకి విడుదలకి ముందే బోలెడంత పబ్లిసిటీ వచ్చేస్తోంది.

తాజాగా ఈ సినిమా ఆడియో విడుదల వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడకకి ఏకంగా తెలంగాణా మినిస్టర్‌ కేటీఆర్‌ ముఖ్య అతిధిగా హాజరు కాగా, సినీ పరిశ్రమ నుండి మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హాజరై సినిమా విజయం సాధించాలని ఆశించారు. అలాగే ప్రముఖ నిర్మాత సురేష్‌ బాబు తన పూర్తి సపోర్ట్‌ని అందించారు. రామ్‌ చరణ్‌ సపోర్ట్‌తో ఈ సినిమాకి దక్కాల్సిన పబ్లిసిటీ దక్కింది. కొత్త దర్శకుడు పట్టాభి ఆర్‌ చిలుకూరి ఈ సినిమాని స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. కేటీర్‌కి మంచి స్నేహితుడు పట్టాభి. ఈ సినిమా విజయం సాధించాలని మనం కూడా కోరుకుందాం.

మరిన్ని సినిమా కబుర్లు
balayya so dare person