Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

అమీ తుమీ చిత్ర సమీక్ష

ami tumi movie review

చిత్రం: అమీ తుమీ
తారాగణం: శ్రీనివాస్‌ అవసరాల, అడవి శేష్‌, ఈషా, అదితి మ్యాకల్‌, తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్‌
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: పి.జి. విందా
దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి
నిర్మాతలు: కె.సి.నరసింహారావు, వినయ్‌
నిర్మాణం: ఎ గ్రీన్‌ ట్రీ ప్రొడక్షన్స్‌
విడుదల తేదీ: 09 జూన్‌ 2017

క్లుప్తంగా చెప్పాలంటే

దీపిక (ఈషా), కొడుకు విజయ్‌ (అవసరాల శ్రీనివాస్‌) అన్నా చెల్లెళ్ళు. దీపిక, అనంత్‌ (అడవి శేష్‌)ని ప్రేమిస్తుంది. విజయ్‌, మాయ (అదితి)ని ప్రేమిస్తాడు. దీపిక, విజయ్‌ల తండ్రి జనార్ధన్‌ (తనికెళ్ళ భరణి) మాత్రం వారి ప్రేమని ఒప్పుకోడు. దీపికకి శ్రీ చిలిపి (వెన్నెల కిషోర్‌)తో పెళ్ళి చేయాలనుకుంటాడు జనార్ధన్‌. దాంతో దీపిక, ఇంట్లోంచి వెళ్ళిపోయి అనంత్‌ని పెళ్ళాడాలనుకుంటుంది. విజయ్‌ కూడా, తాను ప్రేమించిన మాయ కోసం ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకుంటాడు. ఇంతకీ, వారిద్దరూ తాము ప్రేమించిన వాళ్ళనే పెళ్ళాడారా? అనేది తెరపైనే చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే

శ్రీనివాస్‌ అవసరాల ఇప్పటికే నటుడిగా తానేంటో ప్రూవ్‌ చేసుకున్నాడు. కామెడీలో మంచి టైమింగ్‌ ఉన్న నటుడు శ్రీనివాస్‌ అవసరాల. ఇందులోనూ మంచి టైమింగ్‌తో అలరిస్తాడు. అడవి శేష్‌ కూడా అంతే. విలక్షణమైన పాత్రలకు ఈ తరం యంగ్‌ హీరోల్లో అడవి శేష్‌ బాగా సూటవుతున్నాడు. ఈ సినిమాలోనూ అడవి శేష్‌ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఈషా, అదితి హీరోయిన్లుగా బాగా చేశారు. నేచురల్‌ గ్లామర్‌తో ఆకట్టుకుంటారు. ఎవరికి వారు నటనలో రాణించడంతో దర్శకుడి పని తేలికయ్యిందని చెప్పవచ్చు. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగా చేశారు.

రెండు ప్రేమ జంటలు, పెద్దల తిరస్కారాలు ఇవన్నీ చాలా తెలుగు సినిమాల్లో చూసేసినవే. అయినా దర్శకుడు తనదైన ట్రీట్‌మెంట్‌తో సినిమాని ఎంటర్‌టైనింగ్‌గా మార్చేశాడు. కొత్త కొత్తగా ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం తెరపై కన్పించేలా చూసుకున్నాడు. మాటలు బాగున్నాయి. తెలంగాణ స్లాంగ్‌లో డైలాగ్‌లు సినిమాకి ప్రధాన ఆకర్షణ. సంగీతం బాగుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇంకా బాగుంది. పాటలు తెరపై చూడ్డానికి చాలా చాలా బాగున్నాయి. ఎడిటింగ్‌ బాగుంది. నిర్మాణపు విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్‌ అయ్యింది. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమాకి బాగా ప్లస్‌ అయ్యాయి.

'అష్టాచెమ్మా' సినిమాతో పోల్చి 'అమీ తుమీ' పబ్లిసిటీ చేసినప్పుడు ఆ స్థాయిలో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుందా? అని అందరూ అనుకున్నారు. వారందరి అంచనాలకు తగ్గట్టుగానే ఎంటర్‌టైనింగ్‌గా సినిమా తెరకెక్కింది. పైగా ఇంద్రగంటి సినిమాల్లో క్లీన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ తప్పనిసరి. కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాలో ఉంటుంది. ఫస్టాఫ్‌లో కొంత భాగం స్లో అనిపించినప్పటికీ ఓవరాల్‌గా అలరించే కామెడీతో సినిమా వేగం పుంజుకుంటుంది. సినిమా చూశాక, మంచి ఎంటర్‌టైనర్‌ ఫిలిం చూశామన్న భావన ఆడియన్స్‌లో కలుగుతుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే

అమీ తుమీ కామెడీ అదిరింది సుమీ

అంకెల్లో చెప్పాలంటే: 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
sweety is so clarity