Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

sirasri  question

1. సోషల్ మీడియా వల్ల అక్కర్లేని చెత్తలోంచి కావాల్సింది ఏరుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఆ కావాల్సింది కూడా ఏదో కాసేపు నవ్వుకోడానికే తప్ప జ్ఞానాన్ని పెంచేవి చాలా అరుదు. ఈ సోషల్ మీడియా వల్ల పుస్తకపఠనం పూర్తిగా పోయింది. సోషల్ మీడియాలో అవసరంలేని సమాచారం చదివి చదివి, వాదాలకి దిగి, మనసుని పాడుచేసుకుని చిరాగ్గా బతుకుతున్నవారు కూడా ఉన్నారు. కనుక సోషల్ మీడియా ఒక మహమ్మారి. దానినుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కావాలంటే ఒక్క వారం రోజులు ఈ చెత్త నుంచి దూరంగా ఉండండి. జీవితం ఎంత ప్రశాంతంగా మారుతుందో! 

2. సోషల్ మీడియా అనేది ఒక కరెంటు తీగ లాంటిది. దానిని వాడుకునే పద్ధతుల్లో జాగ్రత్తగా వాడుకుంటే మంచి ఫలితాలిస్తుంది. మన దేశ ప్రధాని గెలుపులో ఈ సోషల్ మీడియా పాత్ర ఎంతుందో చెప్పక్కర్లేదు. మనం ఎంచుకునే స్నేహితులు, మనం ఉండే గ్రూపులు, మన లక్ష్యాలు ఏమిటో జాగ్రత్తగా పరిగణించుకుంటే సోషల్ మీడియా లక్ష్య సాధనకి వాహనం అవుతుంది. సోషల్ మీడియా గ్రూపుల్లో అవధానాలు, పద్య రచన పోటీలు నిర్వహిస్తున్నవారు ఉన్నారు, కార్టూనిస్టుల  గ్రూపులున్నాయి...ఇలా సృజనకు సంబంధించిన ఎంతో వ్యవసాయం జరుగుతోందిక్కడ. కనుక సోషల్ మీడియా అనేది ప్రాచీనతను కాపాడుకోవడానికి ఆధునిక కాలానికి అందిన గొప్ప వరం.

పై రెండిట్లో ఏది కరెక్ట్?  

మరిన్ని శీర్షికలు
Aa Coffee Ishtam Ledu | Latest Telugu Short Film