Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

'రంగస్థలం' మళ్లీ మొదలైంది

ramcharan movie shooting start

రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'రంగస్థలం'. టైటిల్‌తోనే సగం కొట్టేశాడు చరణ్‌. పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. దీనికి ఇంతకన్నా మంచి టైటిల్‌ ఇంకేముంటుంది. విలక్షణ చిత్రాలకు విభిన్నమైన లవ్‌ స్టోరీని జోడించి, ప్రేక్షకుల మదిని దోచే డైరెక్టర్‌ సుకుమార్‌. ఆయన డైరెక్షన్‌లో తెరకెక్కుతోందంటేనే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందులోనూ చరణ్‌ తన ఫస్ట్‌లుక్‌తోనే ఆల్రెడీ మార్కులు కొట్టేశాడు. ఇక సినిమాలో మరింత విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నాడు. ఇదో ప్రయోగాత్మక చిత్రం. 'ధృవ' సినిమాతో ప్రయోగం చేసి సక్సెస్‌ అందుకున్నాడు చరణ్‌. ఈ సినిమాతో మరో ప్రయోగం చేయనున్నాడు.

ఈ సినిమా షూటింగ్‌ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని పల్లెటూరి వాతావరణంలో జరుగుతోంది. గత షెడ్యూల్‌ సమ్మర్‌ కారణంగా కొంచెం గ్యాప్‌ తీసుకున్నారు. ఇప్పుడు వాతావరణం చల్లబడడంతో షూటింగ్‌ మొదలైంది. తొలకరి చినుకులు పడుతున్న వేళ గోదావరి లలు, పచ్చని పైర్లు, కొబ్బరి తోటలు ఇలా ఒక్కటేమిటి కోస్తా అందాల్ని వర్ణించేది. అందుకే ఆ అందాలనే చరణ్‌ కూడా ఎంజాయ్‌ చేస్తున్నాడుఅ. చరణ్‌తో పాటు తన భార్య ఉపాసన కూడా అక్కడే ఉంటూ ఈ ఆహ్లాదమైన వాతావరణాన్ని ఎంజాయ్‌ చేస్తోంది. అక్కడి ఈ అనుకూల వాతావరణానికి ఉపాసన పులకించి పోతోందట. ఈ సినిమాలో ముద్దుగుమ్మ సమంత హీరోయిన్‌గా నటిస్తోంది

మరిన్ని సినిమా కబుర్లు
bunny new flim start