Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
bunny new flim start

ఈ సంచికలో >> సినిమా >>

టాయిలెట్‌' లాంటి సినిమాలు మనకెప్పుడు?

toilet movies...

మొన్న 'సుల్తాన్‌', నిన్న 'దంగల్‌' ఇప్పుడు 'టాయిలెట్‌' ఇలాంటి చిత్రాలు బాలీవుడ్‌లోనే ఎందుకు వస్తాయి. మనకెందుకు రావు. ఈ చిత్రాలు తెలుగులోకి అనువదిస్తే మంచి విజయాలు అందుకుంటున్నాయి. తెలుగు ప్రేక్షకుల మన్ననలు, ప్రశంసలు కూడా పొందుతున్నాయి. మరి అలాంటప్పుడు మన దర్శక, నిర్మాతలు ఎందుకు ఇలాంటి చిత్రాలను తెలుగులోనూ తెరకెక్కించే ఆలోచన చేయడం లేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన 'స్వచ్ఛ భారత్‌' కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ మరుగుదొడ్డి అనే పథకం ఉంది. అయితే అది ఎంతవరకూ అమలులో ఉంది. ఉన్న మరుగుదొడ్డిని ఎంతవరకూ ఇళ్లలో వాడుతున్నారు..

ఇలాంటి వాటిపై ఇంతవరకూ చాలా వాణిజ్య ప్రకటనలు వచ్చాయి. బాలీవుడ్‌ బ్యూటీ విద్యాబాలన్‌, బిగ్‌బీ అమితాబ్‌లు టాయిలెట్స్‌కి సంబంధించి పలు యాడ్స్‌లో నటించారు. అయితే బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ఏకంగా ఈ కాన్సెప్ట్‌పై సినిమానే తెరకెక్కించాడు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమా 'టాయిలెట్‌'. ఏక్‌ ప్రేమ కథ అనేది ఉప శీర్షిక. తన భార్య కోసం తాజ్‌మహల్‌ అయితే కట్టలేను కానీ, ఓ టాయిలెట్‌ అయితే కట్టలేనా..? అని అక్షయ్‌ కుమార్‌ చెబుతున్న డైలాగ్‌ అదిరిపోతోంది ఈ సినిమా టీజర్‌లో. కాన్సెప్ట్‌ బాగుంది, స్క్రీన్‌ప్లే వినోదాత్మకంగా ఉండబోతోంది. మరింకేం అంతకన్నా కావాల్సిందేముంది. ఒకే రీల్‌లో కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌, సామాజిక అంశంపై ప్రస్థావన. వెరసి సినిమా విజయం సాధించేందుకు తోడ్పడకుండా ఉంటుందా ఈ ఫార్ములా. ఆగష్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరిన్ని సినిమా కబుర్లు
paisa vasool comming soon