Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
krishnarjuna yuddam with grand father

ఈ సంచికలో >> సినిమా >>

హుస్సేన్ సాగర్ కోసం అమల

amala for hussain sagar

సినీ నటి అమల, ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున సతీమణి. ఒకప్పుడు గ్లామరస్ తారగా పలు సినిమాల్లో నటించిన అమల, సినిమా కెరీర్ పట్ల పెళ్ళయ్యాక పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. శేఖర్ కమ్ముల పట్టుపట్టడంతో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో అమల నటించింది.

సినిమా విషయాలు అలా ఉంచితే, అమల అంటే బ్లూ క్రాస్ పేరు గుర్తుకొస్తుంది. వీధి కుక్కలను అక్కున చేర్చుకోవడం వంటి కార్యక్రమాలతో ఆమె నిత్యం వార్తల్లో వుంటూ వస్తున్నారు. జీవ హింసకు వ్యతిరేకంగా ఆమె పోరాడుతున్నారు. అదొక్కటే కాదు, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ తరఫున ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు అమల.

హైద్రాబాద్ కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే హుస్సేన్ సాగర్ పరిరక్షణ కోసమూ అమల నడుం బిగించారు. హుస్సేన్ సాగర్ని పరిరక్షించుకుందాం అనే స్లోగన్తో అమల ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. ఒకప్పటి ఈ గ్లామర్ తార, సామాజిక బాధ్యతగా, సమాజానికి తనకు చేతనైనంత సేవ చేస్తుండడం ఎంతైనా అభినందనీయం.

మరిన్ని సినిమా కబుర్లు
heroine's simplicity