Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> వేగము

vegamu

“ నీకు తెల్సా ఉదయ్!మన కమల్ కొత్తబైక్  కొన్నాడు. కవసాకి నింజా 300ఆర్ మోడల్  296సిసి రెండు ఇంజ న్ల మోటార్బైక్ - దీని ధరెంతో తెల్సురా! రూ.3.5లక్షలు. అట! కొత్తమోడల్ అదిరి పోతున్నదంటే  నమ్ము.నిన్న సాయం  కాలం చూశాను.దాని రంగూ , హంగూ ! అబ్బ! ఏందుకులేరా చెప్పలేను." 

"మరింకేం!మనపాత బైకుతో, కమల్ కొత్త బైకుకు పోటీ పెట్టడ0! అతడికీ తన కొత్త బైక్కు లాంగ్ డ్రైవ్ తీసు కున్న ట్లూ ఉంటుంది. మనకూ ఆది వారం కాలక్షేపం ఐనట్లుంటుంది. ఏమంటావ్ దినూ!" 

" బాగాఉంది ,ఉండు ఫోన్ చేస్తాను కమల్ కు" అని తన మొబైల్ అందుకుని రింగ్ చేశాడు."రేయ్ కమల్!ఏరా! కొత్త ‘నింజా ‘మోజులో పాతప్రాణాలు  కంటికి  కనిపించడంలేదా!"అంటూ స్పీకర్ లో పెట్టాడు ఫోన్ని.

అటు నుండీ కమల్ " మరీ అంత దారుణంగామాట్లాడకురా! మీరిద్దరూ ఎప్పటికీ నాప్రాణాలే రా! "

"సరే సరే! మరినీ ప్రాణాలు పిలుస్తున్నాయ్! రారా!"

 "ఇప్పుడే లేచానురా!కాస్త టైమిస్తారా !" 

"అలాగేలే నీవు లేంది నీ ప్రాణాలు ఎక్కడికీ పోవని నీకు తెల్సుగా! ఈరోజు ఉదయ్ కి చాలా బోర్గా ఉందని ఒక ప్రోగ్రాం వేశాం!"

"ఏంటిరా అది!"కుతూహలంగా అడిగాడు కమల్. "నీకొత్త  ‘ కవసాకి నింజా ‘ కూ నీప్రాణాలతో రేస్!అంతే "తమాషాగా నవ్వాడు దినేష్.  


 " అబ్బ! నీధోరణే  అంత ,కాస్తంత వివరంగా చెప్పారా!" 

" ఓకే అలాగే! నీప్రాణాల పాత బైకులకూ నికొత్త ‘కవసాకి నింజా ’ కీ పోటీ ! అదేరా బైక్ రేసు!"  

"ఎప్పుడు, ఎక్కడికి ,ఎన్నిగంటలకు వివరాలు చెప్పరా!"  " మరే నీవు వస్తే అన్నీ నిర్ణయిద్దాం .పైగా నీ కొత్త నింజా కూ విందూ గట్రా ఇవ్వవా ఏంట్రా!"  

" ఓ ఎస్.ఒక్క గంటలో వచ్చేస్తాను. సరా! " 

"ఓకే. రా" అంటూ ఫోన్ ఆఫ్ చేసి " లేరా! ఉదయ్ తయారు కారా! వాడు ఒక్కగంటాలో వచ్చేస్తున్నాడు. నీకు తెల్సుగా వాడికి  టైమంటే  టైమే!" అంటూ బాత్ రూం కేసి కదిలాడు దినేష్. 

కమల్ ఫోన్ ఆఫ్ చేయగానే మళ్ళా మోగింది."హలో!" 

"హై కమల్ ! లేచావా ! మార్నింగ్!శుభోదయం ! " కిలకిలా నవ్వింది కిరణ్మై .  

" ఓకిరణ్! ఏంటి ఉదయాన్నే! నాకింత మహద్భాగ్యం!"మహదానందంగా అన్నాడు కమల్ . 

" నాదో ప్రెపోజల్! నీ కొత్త ' నింజా ' మీద లాంగ్ డ్రైవ్ కెళ్ళాల నుంది కమల్!అక్కడ నీకో సర్ప్రైజ్ న్యూస్" మరోమారు మనోహరంగా నవ్వింది కిరణ్మై. కమల్ వళ్ళంతా పులకరించింది  ఆనవ్వుతో  .

"ఏంటో ఆ  సర్ప్రైజ్ న్యూస్ ! నీ పెళ్ళి కానీ కుదర లేదు కదా!" భయం భయంగానే అడిగాడు. 

"ఛఛ్ఛా ! అది నీకు సర్ప్రజ్ ఎలా అవుతుంది.నీకు ఇష్టమైనదే! నీవు సంతోషించేదే లే !మరీఅడక్కు.ఒక్కఅర్ధ గంటలో మా ఇంటి దగ్గరి బస్టాప్ కిరా!" మరో కిలాకిలారావంతో ఫోన్ కట్ చేసే సింది కిరణ్మై. ఇహ కిరణ్మై మళ్ళారింగ్ చేసినా మాట్లాడదని కమల్ కు తెల్సు.’ఐతే ఎలావెళ్ళడం?ఒకర్నే చూజ్  చేసుకోవాలి. కిరణ్మై తోకల్సి తన ప్రాణస్నేహితుల వద్దకెళ్ళటం బావుంటుందా! ఇంత వరకూ వారి వద్ద దాచిన  ఒకే ఒక విషయం ఇదే! ఏం చేయాలీ! కానీ ముందు రెడీ అవుతూ ఆలోచిద్దాం’  అని గబగబాతయారై ,తన కొత్త ' నింజా!' తాళాలందుకున్నాడు కమల్. 

"ఏరా! బ్రేక్ ఫాస్ట్ తయారైంది. తినిబయల్దేరు." అంది అమ్మ అనూరాధ. 

" బాల్కనీ లో కూర్చుని న్యూస్ పేపర్ చూస్తున్న తండ్రి తాతారావ్ "ఏరా కొత్త బైక్కు పూజ చేయించను వెళు తున్నావా!" అని పలక రించాడు. ఇద్దరికీ ఒకే సమాధానం " ఇప్పుడే వస్తాగా!" అని బయల్దేరాడు కమల్.  హృదయం డోలాయమా నంగా ఉంది. అటు ప్రాణ స్నేహితులు,. ఇటు  గాళ్ ఫ్రేండ్  గుడ్ న్యూస్తో ' - బైక్ స్టార్ట్ చేసి బయల్దేరాడు. ఐదు నిముషాల్లో బస్టాప్ దగ్గ రున్నా డు. చిరునవ్వుతో హేండ్ కర్చీఫ్ ఊపుతూ ఎదు రైంది కిరణ్మై.  ఊతగా కమల్ భుజం పట్టుకుని నొక్కి ఒక్క గెంతుతో కమల్ వెనుక ఎక్కి కూర్చుంది కిరణ్మై. ఇద్దరి కిద్దరూ అందమైన వారే! ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్ ‘లా ఉన్నారు. టైట్సులో కిరణ్మై అందం కమల్ కి వెర్రె త్తి స్తున్న ట్లుంది. వెనకే వీపుకానుక్కూర్చుని నడుం చుట్టూ చెయ్యేసి ,తన ఎత్తైన గుండెలు వీపుకు తాకు తుండగా, ఆకొత్త స్పర్శ కమలను తెలీని అనుభుతికి గురి చేస్తుండగా ,బైక్ తన స్నేహితుల రూం ముందు ఆపాడు. 

"ఏయ్! ఇదేంటి ఎక్కడికి తెచ్చావ్!" అంది బెదురుగా బైక్ దిగకుండానే  కిరణ్మై .   

 " భయపడకు కిరణ్! ఇక్కడ నాస్నేహితులున్నారు. అంటూ స్టాండ్ వేసి "ఇప్పుడే వస్తానుండు" అంటూ లోపలి కెళ్ళాడు కమల్. 6.అడుగుల ఎత్తుకు తగిన లావుతో అందమైన,ఆకర్ష ణీయమైన కమల్ ను వెనుక నుండీ చూస్తూ హాయిగా ఊపిరి పీల్చుకుంది కిరణ్మై.

'నా ప్రెపోజల్  కమల్  అంగీకరిస్తే నా అంత  అదృష్టవతు రాలు మరి ఉండదు.'అనుకుంది.

కమల్  నడుస్తూ 'ఎంతో కాలంగా ఐ లవ్ యూ  ' చెప్దామనుకుంటూనే నాన్చు తున్నాను. నిన్ననే చెప్దామ ను కున్నా ధైర్యం చాల లేదు ,ఈ రోజు తప్పక చెప్పాలి. లేకపోతే  ఎవరితోనో తన పెళ్ళి కుదిరిందని కిరణ్మై . చెప్పేస్తే  నాగతేం కాను.ఈ  రోజు ఎలా గైనా చెప్పి తీరాలి.తను అంగీకరిస్తే నా  అంద అదృష్ట వతుడీ ప్రపం చంలో నే ఉండడు.'అనుకుంటూ స్నేహితుల రూంలో అడుగు పెట్టా డు. "ఒరే నా మరో ప్రాణం కిరణ్మై నాకొత్త బైక్ మీద ఉందిరా! మీ కింత వరకూ చెప్పనే లేదుగా! ఈ రోజు తన కెలా గైనా ' ఐలవ్ యూ ' చెప్పాల నుకుంటున్నాన్న్రా! “ 

" ఓరి నీ! గ్రంధం నడుపుతున్నా వన్నమాట! ఒరే నీవు చెప్పకున్నా నీ పోకడలన్నీ పసి కడుతూనే ఉన్నాం రానాన్నా! మీ రిద్దరూ  బ్యాచ్ మేట్స్, ఇద్దరికీ ఒకే మంచి కంపెనీ లో అధిక జీతంతో క్యాంపస్  ఇంటర్వ్యూలో జాబ్స్ వచ్చాయి.మరింకేం! ఈ లాంగ్ డ్రైవ్  ‘ లో నీ లవ్  ఎఫైర్ సక్సెస్ ‘ కావాలని కోరుకుంటున్నాం రా!.నీవు కొత్తా బండి కొన్నావని వినగానే అనుకున్నరా! ఏదో కధ ఉందనీ, అది చివరి దశకొస్తూందనీనీ. " అంటూ ఇద్దరూ షేక్ హ్యాండిచ్చి బయల్దేరారు. 

"ఎక్కడి కెళదాం ! చెప్పండి." అన్నాడు కమల్  నడుస్తూనే!

" ఒరే ముందుగా తాజ్ లో బ్రేక్  ఫాస్ట్ చేసి, మైసూర్ వెపు వెళదాం ,ఎవరు ముందుగా అరవై కిలీ మీటర్ల దూరం లో ఉన్న శివాల యం దగ్గరకెళ్ళి ,తిరిగి తాజ్ చేరుతారో వారిదే గెలుపు."అన్నాడు  ఉదయ్.  

" ఛ్ఛ ఛ్ఛా ! గాళ్ ఫ్రెండ్ తో అరవై కిలోమీటర్సేంటిరా! ఆదీ కొత్త నింజా మీద ముండువందల కిలో మీటర్స్!" అన్నాడు  కమల్.

"ఒరే వీడికి గాళ్  ఫ్రెండ్ వెనక కూర్చుని నేరుగా  స్వర్గానికి వెళ్ళాలని  ఉన్నట్లుందిరా! కానీ  మన మెందుకు వద్దనాలి." అన్నాడు  అనంత్.  సరే అనుకుని కిరణ్మైకి  వారిని పరిచయం చేసి, బయల్దేరారు అంతా టిఫిన్ ముంగించి. దినేష్, ఉదయ్ ల బైక్ ముందు వెళు తుండగా చిన్నగా మాట్లాడు కుంటూ జోకులేసు కుంటూ నవ్వుకుంటూ వెనగ్గా వెళు తున్నారు కమల్ ,కిరణ్మై.  "కిరణ్! గుడ్ న్యూసన్నావ్!"   తల కొంచెం పక్కకు త్రిప్పి అడిగాడు కమల్ . 

" నీవు నిన్న అన్నావ్ ! నాకో గుడ్ న్యూసని ముందు నీవు  చెప్పు." గోముగా అంది కిరణ్మై. "లేడీస్ ఫస్ట్ కదా! నీవేచెప్పు."

" ఈ మాటలతో మమ్మల్ని ములగ చెట్టెక్కించాలని మీ మగవారి ప్లాన్." డొక్కలో ఓపోటుపొడిచి వీపుమీద ఓముద్ది చ్చింది కిరణ్మై. 

కమల్ మనస్సు ఏదో మైకంలో మూలిగింది. ముందుపోతున్న స్నేహితులు  చేయి ఊపారు.

"కాదు కిరణ్! ముందు నీవే చెప్పు, నాకు సిగ్గేస్తుంది బాబూ!" ముద్దుగా అంది కిరణ్మై.  "అంత సిగ్గేసే మాటుంటే  చెప్పొద్దులే పోనీ.నేనూ చెప్పను."అన్నాడు బెట్టుగా కమల్. 

" ఫో నీ వెప్పుడూ ఇంతే! నన్ను ఇరికించి నవ్వుతుంటావు. సరే! కళ్ళు మూసుకో మరి,నా వైపు చూడకు." 

"కళ్ళెలా మూసుకోను బైక్ డ్రేవ్ చేస్తున్నానాయె! నీవై పెలాగూ చూడలేను , నీవు వెనుక నేను ముందూనూ. చెప్పేయ్ చెప్పె య్!"  వెనుక ఉన్న కిరణ్మైబుగ్గను ఒక్కచేత్తో తడుతూ అన్నాడు కమల్. పక్కనే వెళుతున్న జనాలు వారి వంక వింతగా  చూస్తున్నారు. కొందరైతే ప్రేమ జంటో, కొత్తగా పెళ్ళైన వారో, “ఐనా ఇంత ఇదేంటీ, బైక్ డ్రైవ్ చేస్తూ సరసాలా!" అనుకుంటున్న మాటలు కొన్నివారి చెవిన పడక పోలేదు కూడా.  

కమల్ భుజమ్మీద తన ముఖం  ఆనించి  " కమల్ ఐ లవ్ యూ." అంటూ ముద్దు పెట్టేసింది. కమల్ కు శరీరమంతా తేలిపోగా, ఎంత కాలంగానో తన మనస్సులో ఉన్న విషయం చెప్పలేక తటాపటా యిస్తున్నతన కంటే కిరణ్మై మేలనిపించి,  ఏ దేవతో వర మిచ్చినట్లూ మనస్సు తూలు తుండగా హాయిగా గుండె నిండా  ఊపిరి పీల్చుకుంటూ " ఐటూ" అనేశాడు  ప్రేమగా.  హుషారుగా  ఈల కూడా వేశాడు. దూరంగా ఉన్న స్నేహితుల బైకును కలిసి తనప్రేమ సఫలం ‘విషయం తెలపాలని వేగంగా బైక్ తోల సాగాడు . దగ్గరగావెళ్ళి 

" సక్సెస్  సక్సేస్ " అని అరిచి , " చూడరా ఇప్పుడీ ఆనందంలో ఎలా బైక్ తోలి, విజయం సాధిస్తానో !" అంటూ మరింత వేగంగా బైక్ తోలసాగాడు. 

ఆ వేగానికి  భయం గా కిరణ్మై, కమల్  వీపుకు అతుక్కుపోయి , తన ఎదనంతా ఆనించి ముందు నుంచీ చేతులు పోనిచ్చి గట్టిగా  ఆలిం గ నం చేసుకుంది. ఆ సుఖానికి కమల్ వేగం ఇంకా పెంచాడు. గాలిలో పోతు న్నట్లున్న ఆకొత్త నింజా  వేగానికి పక్కన వెళ్ళే వారంతా దూరంగా వెళ్ళ సాగారు. వెనుక నుంచీ దినేష్, ఉదయ్  అరుస్తున్నా, వేగ మింకా పెంచి దూసుకు పోసాగాడు కమల్. అంత వేగంగా బైక్ తోలు తున్న కమల్  ఒక్క మారు భయంగా తనను అంటుకు పోయిన వెనుక ఉన్న కిరణ్మై ని చూద్దామని తల వెనక్కు తిప్పాడు.  అంతే జరగ రానిది జరిగిపోయింది.డివైడర్నుకొట్టుకు న్న  బైక్ ఆ పోజిట్ సైడ్ కు ఎగిరి పడింది.ముక్కలు ముక్కలైంది  , బైక్ పార్ట్సన్నీ రోడ్డుమీదముక్కలు ముక్కలుగా వెదజల్ల బడ్డాయి  . ఆఇద్దరు ప్రేమికులూ గాల్లోకి  పైకి లేచి కొన్ని అడు గుల దూరంలో రోడ్డు మీదకు పడి, రోలర్స్ లా దొర్లి  వేగంగా వస్తున్న పెద్ద 12 చక్రాల ట్రక్ టైర్ల క్రింద కెళ్ళి పోయారు. ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసి పోయాయి. 

"ఇదండీ ఈకాలపు కుర్రకారు వేగం! ఎక్కడికో అంత వేగంగావెళ్ళాలని తపన. ఫలితం ఇది"అంటూ చుట్టూ చేరినవారు మాట్లాడు కోడం పై కెళ్ళిన ఆత్మలు వింటున్నాయ్! 'కాస్త వేగం తగ్గించాల్సింది - నీవు నా వైపు చూడకుండాల్సింది.అనుకుంటున్న వారి మాట లు ఎవ్వరికీ   వినబడలేదు.

మరిన్ని కథలు
edi baadhyata