Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cinechuraka

ఈ సంచికలో >> సినిమా >>

వన్‌ అండ్‌ ఓన్లీ 'బాహుబలి'

one and only bahubali

2017 ప్రథమార్థం ముగిసింది. ఎలాంటి వివాదం లేకుండా, ఈ అర్థబాగంలో అతి పెద్ద హిట్‌ సినిమా ఏంటంటే 'బాహుబలి' పేరే చెబుతారు. ఎందుకంటే ఆ సినిమా సాధించిన విజయం అలాంటిది. 'బాహుబలి ది కంక్లూజన్‌' ఓ తెలుగు సినిమా మాత్రమే కాదు, అంతకు మించి. తెలుగు సినిమాకి సంబంధించి గత రికార్డుల్ని కొల్లగొట్టిన 'బాహుబలి', బాలీవుడ్‌ రికార్డుల్నీ కొల్లగొట్టేసింది. ఇండియాలోనే నెంబర్‌ వన్‌ సినిమా 'బాహుబలి'. ఇప్పట్లో ఈ సినిమాని కొట్టే సినిమా ఇంకోటి రాకపోవచ్చు అనేంతలా 'బాహుబలి' సంచలన విజయాన్ని అందుకుంది. 'బాహుబలి' విజయం గురించి కాస్సేపు పక్కన పెడితే, ఈ ఏడాదికి అద్భుతమైన స్వాగతం పలికిన తెలుగు సినిమా 'ఖైదీ నెంబర్‌ 150'. దాదాపు తొమ్మిదేళ్ళ విరామం తర్వాత చిరంజీవి హీరోగా రూపొందిన ఈ 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా చిరంజీవి స్టార్‌డమ్‌ని ఇంకోసారి చాటిచెప్పింది. ఓ సాదా సీదా కమర్షియల్‌ సినిమా, కేవలం చిరంజీవి ఇమేజ్‌తో అలవోకగా 100 కోట్ల మైలు రాయిని దాటేసింది.

తెలుగు సినిమా స్టామినాని చాటి చెప్పిన చిత్రంగా 'ఖైదీ నెంబర్‌ 150' రికార్డులకెక్కింది. ఇంకో వైపున చారిత్రక కథాంశాన్ని లిమిటెడ్‌ బడ్జెట్‌లో, లిమిటెడ్‌ టైమ్‌లో రూపొందించిన 'గౌతమి పుత్ర శాతకర్ణి' కూడా 'ఖైదీ'తోపాటుగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. 'శతమానం భవతి' చిన్న సినిమాగా విడుదలై, పెద్ద సినిమాల నడుమ సక్సెస్‌ చవిచూడటం అభినందనీయం. ఏదేమైనా ఫస్టాఫ్‌ అదిరిపోయింది. కొన్ని డిజాస్టర్స్‌ కూడా ఉన్నా, ఓవరాల్‌గా ఫస్టాఫ్‌ సూపర్బ్‌. సెకెండాఫ్‌లో రానున్న సినిమాలూ తెలుగు సినిమా ఖ్యాతిని మరింతగా పెంచుతాయని ఆశిద్దాం.

మరిన్ని సినిమా కబుర్లు
bharat