Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
anu emmanuel got lucky chance

ఈ సంచికలో >> సినిమా >>

మరో రెండు: నీతో హిట్టు కోరి

nani so   busy

యంగ్‌ హీరోల్లో నాని డిఫరెంట్‌ స్టైల్‌. డిఫరెంట్‌ జోనర్స్‌ని ఎంచుకుంటాడు. అలాగే కథ ఎలాంటిదైనా కానీ తన యాక్టింగ్‌ స్టైల్‌తో కొత్త అందాన్ని తెచ్చేస్తుంటాడు నాని. అదీ నానిలోని స్పెషాలిటీ. చిన్న డైరెక్టర్‌, చిన్న ప్రొడ్యూసర్‌ ఎవరికైనా నానితో సినిమా అంటే చాలా కంఫర్ట్‌. 'భలే భలే మగాడివోయ్‌' సినిమా నుండీ నాని సక్సెస్‌కి బ్రేకులేయడం ఎవరి వల్లా కావడం లేదు. వరుస హిట్లే కాదు, వరుస హ్యాట్రిక్స్‌ని సొంతం చేసుకుంటున్నాడు నాని. ఇటీవలే 'నిన్ను కోరి' సినిమాతో లేటెస్ట్‌ హిట్‌ని తన ఖాతాలో వేసేసుకున్నాడు నాని. నానికి ఓవర్సీస్‌ మార్కెట్‌ చాలా స్ట్రాంగ్‌ గురూ. అక్కడ నాని సినిమాలకు కాసుల పండగే. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నివేదా థామస్‌ హీరోయిన్‌గా నటించగా, ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటించాడు.

ఇదిలా ఉండగా, నాని రెండు కొత్త సినిమాలకు రంగం సిద్ధం చేసేశాడు. వీటిలో ఒకటి ఆల్రెడీ నిర్మాణ దశలో ఉంది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి 'ఎమ్‌సిఎ - మిడిల్‌ క్లాస్‌ అబ్బాయ్‌' అనే టైటిల్‌ని పెట్టారు. ఈ టైటిల్‌ చాలా క్యాచీగా ఉంది. ఇది కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనరే. త్వరలో ప్రేక్షకుల ముంందుకు రానుంది. ఇంకో పక్క నాని మేర్లపాక గాంధీతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇదో క్రేజీ కాన్సెప్ట్‌ మూవీ అట. 'కృష్ణార్జున యుద్ధం' అనే క్లాసిక్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడనీ సమాచారమ్‌. అదండీ మనోడి సంగతి. అబ్బో! నాని ఫుల్‌ బిజీ బాబూ. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam