Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
prize-for-best-comment

ఈ సంచికలో >> శీర్షికలు >>

21-07-2017 నుండి 27-07-2017 వరకు వారఫలాలు - శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తంమీద ప్రయాణాలు చేసేవిషయంలో బాగాఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. కుటుంబంలో మీ అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలిపే ప్రయత్నం చేయుట మంచిది. సర్దుబాటు విధానం ఉండుట ఉత్తమం. నలుగురిఆలోచనలు అలాగే అభిప్రాయలను తెలుసుకొనే ప్రయత్నం చేయుట మంచిది. మాటలను ఇతరులకు ఇబ్బంది కలిగేలా వాడకండి ఆచితూచి వ్యవహరించుట మంచిది. మాటలు జాగ్రత్తగా మాట్లాడుట అతిఉత్సహమ్ చూపకపోవడం అనేది సూచన. పెద్దల నుండి వచ్చిన సమాచారం ప్రకారం నడుచుకోండి సొంతఆలోచనలకు దూరంగా ఉండుట ఉత్తమం. వ్యాపారపరమైన విషయాల్లో సొంత ఆలోచనలకన్నా అనుభవజ్ఞుల  ప్రాధాన్యం ఇవ్వడం వలన తప్పక అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి.

 

 వృషభ రాశి : ఈవారం మొత్తంమీద అనారోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే నూతన ఇబ్బందులు కలుగుతాయి, సమయానికి భోజనం చేయుట మంచిది. ఆలోచనలు అదుపులో ఉంచుకొనుట అనేది సూచన . మీయొక్కమాటతీరు మార్చుకోవడం వలన వివాదాలు తగ్గుతాయి. నూతన పరిచయాలకు ప్రాధాన్యం ఇస్తారు ,పెద్దలతో కలిసి చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది. మీలోఅసంతృప్తి పెరుగుటకు అవకాశం ఉంది తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. కుటుంభంలో చిన్న చిన్న మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది.  వ్యాపారస్థులకు పెద్దల సూచనలు పాటించుట చేత లబ్దిని పొందుతారు. అనుకోకుండా ఖర్చులు కూడా పెరుగుటకు అవకాశం ఉంది , ఈ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు.


మిథున రాశి : ఈవారం మొత్తంమీద ప్రయాణాలకు ప్రాధాన్యం ఇస్తారు,స్వల్పదూరప్రయాణాలు చేయుట యందు మక్కువను కలిగి ఉంటారు. దైవసంభందమైన విషయలకు ప్రాధాన్యత ఇస్తారు. మీలో నూతన సంఘర్షణలు మొదలుఅవుటకు అవకాశం ఉంది, తలపెట్టిన ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చుటకు అవకాశం ఉంది.  చిన్న చిన్న విషయాల మూలాన ఇబ్బందులు తప్పకపోవచ్చును. భోజనం విషయంలో సంతృప్తి ఉంటుంది,విందులలో పాల్గొంటారు.  వ్యాపారస్థులకు ఖర్చులు పెరుగుతాయి వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. ఉద్యోగంలో అధికారుల అభిప్రాయాల మేర ముందుకు వెళ్ళండి. చిననాటి మిత్రులను కలుస్తారు వారితో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం కలదు. 

 


కర్కాటక రాశి : ఈవారం మొత్తంమీద ప్రయాణాలు ఆశించిన మేర ఫలితాలను ఇవ్వకపోవచ్చును. వాహనాల విషయంలో నిదానంగా వ్యవహరించుట సూచన, వీటి మూలాన అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. ఒకవార్త మీలోనూతన ఆలోచనలను కలుగజేస్తుంది వాటికి సమయం ఇవ్వుట అనేది మంచిది. అధికారులకు అనుగుణంగా నడుచుకోండి ఉద్యోగంలో మాత్రం నలుగురిని కలుపుకొని వెళ్ళుట సూచన. తలపెట్టిన పనులకు సంభందించిన విషయాల్లో చివరలో పొందుతారు. ఉత్సాహంతో పనులను చేపడుతారు. మిత్రులతో కలిసి నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారస్థులకు కొత్త కొత్త ఆలోచనలు ఉండే అవకాశం ఉంది. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి, ప్రయత్నం పెంచుట చేయండి. సింహ రాశి :ఈవారం మొత్తంమీద కుటుంబంలో తీసుకొనే నిర్ణయం చక్కటి మార్పులకు శ్రీకారం చుడుతుంది. మాటపట్టింపులకు పోకండి నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన కొత్త విషయాలను తెలుసుకొనే అవకాశం ఉంది. మాటతీరును మార్చుకోవడం వలన మేలుజరుగుతుంది, నిదానం అలాగే సర్దుబాటు అవసరం. బంధుమిత్రులతో సమయాన్ని గడుపుతారు ఆలోచనలను వారితో పంచుకొనే అవకాశం ఉంది. ధనమునకు సంబంధించిన విషయాల్లో బాగానే ఉంటుంది, వ్యాపారస్థులకు కలిసివచే కాలం పెట్టుబడులు అనుకూలిస్తాయి కాకపోతే అందరిని కనిపెట్టుకొని ఉండుట మంచిది. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాల వలన వ్యాపారంలో లబ్దిని పొందుటకు అవకాశం కలదు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. 
 

 

కన్యా రాశి : ఈవారం మొత్తంమీద ఆరంభంలో అధికమైన ఉత్సహం ఉంటుంది, చివరి వరకు అదే కొనసాగించే ప్రయత్నం అవసరం. తలపెట్టిన పనులను మిత్రుల సహకారంతో విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. మీయొక్క ఆలోచనలను సాధ్యమైనంత మేర తగ్గించుకోవడం వలన మేలుజరుగుతుంది. విందులలో పాల్గొనే అవకాశం ఉంది నచ్చినవారితో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. పెద్దలసూచనలు పాటించుట మంచిది. ఆచారవ్యవహారాల పట్ల మక్కువను ప్రదర్శిస్తారు.  వ్యాపారస్థులకు వేచిచూసే దోరణి అవసరం అలాగే అనుభవజ్ఞుల సూచనలు పాటించుట ఉత్తమం. మిత్రులతో కలిసి ముఖ్యమైన పనులను చెపట్టు దిశగా ముందుకు వెళ్తారు.

తులా రాశి : ఈవారం మొత్తంమీద ఆరోగ్యంపై ద్రుష్టి సారించుట అవసరం. మీ ఆలోచనలే మీ శత్రువు అని గ్రహించే సరికే కొంత నస్టపోతారు. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. గతంలో ఉన్న పరిచయాలకు మల్లి ప్రాధాన్యం ఇస్తారు. చాలావరకు కోపాన్ని తగ్గించుకోవడం వలన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో మీయొక్క అనుభవం మీకు చాలాఉపయోగపడుతుంది నలుగురికి సహపడే అవకాశం ఉంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు అవసరం, నష్టపోయే అవకాశం ఉంది. విందులలో పాల్గొనే అవకాశం ఉంది సమయాన్ని వాటికి ఇచ్చే ఆస్కారం ఉంది. ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది. అధికమైన ఆలోచనలు కలిగి కొంత అసహనాన్ని పొందుటకు అవకాశం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు చేస్తారు.

  

వృశ్చిక రాశి : ఈవారం మొత్తంమీద వ్యాపారపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. పెద్దలతో కలిసి చేపట్టిన చర్చలు ఒక కొలిక్కి రావడానికి కొంత సమయం పడుతుంది సర్దుబాటు విధానం చాలావరకు మేలుచేస్తుంది. ప్రయాణాల మూలాన అలసి పోయే అవకాశం ఉంది వీలయితే వాయిదా వేయుట మంచిది. ఉద్యోగులకు పనివిషయంలో అశ్రద్ధ ఏర్పడే అవకాశం ఉంది దానిమూలన నష్టపోయే ప్రమాదం కలదు జాగ్రత్త. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయకండి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, మరింత శ్రద్ద చూపుట ద్వారా ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. నూతన పరిచయాలకు అవకాశం కలదు. గతంలో మీకు రావాల్సిన ధనమ్ చివరి నిమిషంలో చేతికి అందుతుంది. మంచిది.

 

ధనస్సు రాశి : ఈవారం మొత్తంమీద పెద్దలతో సమయాన్ని గడుపుతారు. చిన్న చిన్న సందేహాలను తీరుచుకుపోవడానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. కుటుంబ పరమైన విషయాల్లో స్పష్టమైన ఆలోచనలు ఉండుట చేత లబ్దిని పొందుతారు, దూరదృష్టి అవసరం. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుట ద్వార మంచి గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. విదేశీప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యతిరేకవర్గం నుండి వచ్చు ఇబ్బందులు దైర్యంగా ఎదుర్కొనే అవకాశం ఉంది. అధికారుల నుండి నూతన సమాచరం సేకరిస్తారు,కాకపోతే సమయపాలన లేకపోతే ఇబ్బందులు తప్పవు. వ్యాపారస్థులకు ధనమునకు సంభందించిన విషయాల్లో లాభం ఉంటుంది.

మకర రాశి : ఈవారం మొత్తంమీద అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా నైనా పూర్తిచేసే అవకాశం ఉంది. అనవసరమైన విషయాల్లో తలదూర్చకండి వివాదాలకు దూరంగా ఉండుట సూచన. కుటుంబంలో మీరుతీసుకొనే నిర్ణయాలు నూతన మార్పులకు అవకాశం ఇస్తాయి. పూజాదికార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది వాటికి సమయం ఇస్తారు. స్త్రీలకు సంభందించిన వ్యవహరాల్లో నిదానంగా వ్యవహరించుట మంచిది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందకపోవచ్చును. ఒకప్పుడు మీకు సహాయం చేసిన వారికి సహాయం చేసే అవకాశం వస్తుంది. చిననాటి మధుర జ్ఞాపకాలు మల్లి మల్లి గుర్తుకు వచ్చే అవకాశం ఉంది, కాకపోతే ఉహలో ఉండుట మంచిదికాదు.

 

   కుంభ రాశి : ఈవారం మొత్తంమీద మిత్రులనుండి మీరు ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఆత్మీయులను తిరిగి కలిసే ప్రయత్నం పెద్దగా కలిసి రాకపోవచ్చును. కుటుంభంలో అనుకోని ఖర్చులు కలిగినను లాభం ఉంటుంది. విలువైన వస్తువులను నస్టపోయే ఆస్కారం ఉంది, జాగ్రత్త. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడే ఆస్కారం ఉంది. విందులలో పాల్గొనే అవకాశం ఉంది వాటికి సమయం ఇస్తారు మరు . ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి కొంత శ్రమను పెంచు ప్రయత్నం చేయుట అన్నివిధాల మంచిది. ప్రయత్నాలలో బాగుంటుంది నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారస్థులకు నూతన ఆలోచనలు కలిగిఉండి ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది.

 

మీన రాశి : ఈవారం మొత్తంమీద పెద్దలతో చర్చలు చేయుటకు ఆస్కారం ఉంది. తలపెట్టిన పనుల విషయంలో ఊహించని ఫలితాలు పొందుటకు అవకాశం కలదు. గతంలో చేపట్టిన పనులు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ వద్దు,సమయానికి భోజనం,అలాగే విశ్రాంతి అవసరం. బంధుమిత్రుల నుండి ఊహించని సమాచరం పొందుతారు.ప్రయాణాల మూలాన ఇబ్బందులు తప్పక పోవచ్చును. సమయాన్ని వృధాచేయక సరిగా ఉపయోగిచుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం. తొందరపాటు నిర్ణయాలు వద్దు నేల విడిచి సాము చేయకండి. దూరప్రదేశంలో ఉన్న వ్యక్తుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. ఊహాజనితమైన విషయాలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం వలన మేలుజరుగుతుంది.

 

మరిన్ని శీర్షికలు