Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nagachaitanya planning superb

ఈ సంచికలో >> సినిమా >>

డేరింగ్‌ అండ్‌ కాన్ఫిడెంట్‌ భ్రమరాంబ

rakul preeth singh so strong minded

టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఓ పక్క సినిమాలతోనూ, మరో పక్క బిజినెస్‌తోనూ ఫుల్‌ బిజీగా గడిపేస్తూ ఉంటుంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. మెంటల్‌గా ఈ ముద్దుగుమ్మ చాలా స్ట్రాంగ్‌ మైండెడ్‌. సో ఎలాంటి గాసిప్స్‌నీ పట్టించుకోదు. ఒకవేళ ఎవరికైనా సమాధానం చెప్పాల్సి వస్తే, చాలా ఘాటుగా సమాధానమిస్తూ ఉంటుంది. సొసైటీలో జరిగే ప్రతీ అంశం పైనా రకుల్‌కి అవగాహన ఉంది. అందుకే సొసైటీలో ఏ అంశం తన దాకా వచ్చినా వెంటనే అందుకు అనుకూలంగా స్పందిస్తూ ఉంటుంది ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌సింగ్‌. టాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా చెలామణీ అవుతోంది.

అయినా కానీ ఈ నెంబర్స్‌ మీద తనకి పెద్దగా నమ్మకాలు లేవంటోంది రకుల్‌. నెంబర్‌ అనేది సినిమా ఫలితాన్ని బట్టి ఉంటుంది. ఫలితం తారుమారైతే నెంబర్‌ కూడా తారుమారే. అందుకే నెంబర్‌ ట్యాగ్‌ని అస్సలు పట్టించుకోనంటోంది. తమిళ, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేస్తోందిప్పుడు రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ఇకపోతే కొత్తగా వస్తోన్న హీరోయిన్ల గురించి ఆమె ఆభిప్రాయమేంటని అడిగితే ఒకప్పుడు తాను కూడా కొత్తగా వచ్చిన అమ్మాయినే కదా అంటోంది. అలాగే పోటీ అనేది ఉండాలి. అప్పుడే మజా ఉంటుంది అని సమాధానమిచ్చింది. కొత్త కథలు, కొత్త హీరోయిన్లు, కొత్త పోటీ ఉంటేనే నటిగా రాటుదేలచ్చనీ రకుల్‌ చెబుతోంది. అలాగే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే అభ్యంతరాలు గానీ, రెమ్యునరేషన్‌ లెక్కలు గానీ తాను పట్టించుకోననీ ఖచ్చితంగా చెబుతోంది ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. 

మరిన్ని సినిమా కబుర్లు
what is trilling lacchi