Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
rakul preeth singh so strong minded

ఈ సంచికలో >> సినిమా >>

థ్రిల్లింగ్‌ 'లచ్చి' సంగతేంటి?

what is trilling lacchi

బుల్లితెరపై 'వెన్నెల' ప్రోగ్రాంతో పాపులరైన యాంకర్‌ జయతి. బుల్లితెరపై హాటెస్ట్‌ యాంకర్‌గా జయతికి మంచి పేరుంది అప్పట్లో. తాజాగా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా తెరంగేట్రం చేస్తోంది. 'లచ్చి' అనే టైటిల్‌తో ఈ ముద్దుగుమ్మ వెండితెరని తన గ్లామర్‌తో నింపనుంది. ఈశ్వర్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి ఆమె నిర్మాత. ఇదో హారర్‌ జోనర్‌ మూవీ. ప్రస్తుతం చాలా హారర్‌ మూవీస్‌ వస్తున్నాయి. వాటిన్నింట్లోనూ ఈ సినిమా వెరీ వెరీ స్పెషల్‌ అట. గతంలోనూ ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో తళుక్కుమంది. 'పార్టీ' సినిమాలో ఓ ఐటెం సాంగ్‌తో ఆకట్టుకుంది. ఈ ముద్దుగుమ్మ ఆకట్టుకునే మాటకారి మాత్రమే కాదు,

మంచి డాన్సర్‌ కూడా. యాంకర్‌గా ఈ ముద్దుగుమ్మకి హీరోయిన్స్‌కి ఉన్నంత ఫాలోయింగ్‌ ఉండేది. డిఫరెంట్‌ డిక్షన్‌తో యాంకరింగ్‌లో కొత్తదనం చూపించింది. యూత్‌ని ఆ రకంగా తన యాంకరింగ్‌తో మాయ చేసింది ఈ ముద్దుగుమ్మ జయతి. ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉండబోతోందట. అందుకే కథపై నమ్మకంతోనే ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నానంటోంది జయతి. థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో పాటు, మనసుకు హత్తుకునే మరిన్ని అంశాలు ఈ సినిమాలో ఉండనున్నాయనీ, చెబుతోంది. సినిమా చూసి చాలా థ్రిల్‌ ఫీలవుతారనీ అంటోంది ముద్దుగుమ్మ జయతి. సెప్టెంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బుల్లితెర అభిమానంతో జయతి ఈ సినిమాతో సక్సెస్‌ అందుకుంటుందో లేదో చూడాలి మరి. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam