Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

11- 08 -2017 నుండి 17-08-2017 వరకు వారఫలాలు - శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తం మీద అధికారులతో తమ ఆలోచనలను పంచుకుంటారు. ఉద్యోగంలో చేపట్టిన పనులను పూర్తిచేయుటకు మిత్రులనుండి సహకారం ఆశిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో రావాల్సిన సహాయం అందుతుంది. నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది, పెద్ద పెద్ద పెట్టుబడుల విషయంలో మాత్రం ఏమాత్రం తొందరపాటు పనికిరాదు. మానసికపరమైన విషయాల్లో ఒత్తిడి ఉంటుంది. విదేశీప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో కాస్త ఆచితూచి వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. సాధ్యమైనంత వరకు చర్చలకు దూరంగా ఉండుట మంచిది. 
 

 వృషభ రాశి : ఈవారం మొత్తం మీద విదేశీ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. మిత్రులతో చర్చలకు అవకాశం కలదు, ఆశించిన విధంగా మిత్రులనుండి సహకారం లభిస్తుంది. అనుకున్న  దానికన్నా అధికంగా ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. సోదరులతో మీ ఆలోచనలను తెలియజేస్తారు. గతంలో చేపట్టిన పనులను పూర్తిచేయుటకు కాస్త శ్రమకు గురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులతో కలిసి పనిచేసే విషయంలో మీకంటూ ఒక స్పష్టత ఉండుట వలన లబ్దిని పొందుతారు. దూరప్రదేశంలో ఉన్న వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. 


మిథున రాశి : ఈవారం మొత్తం మీద చేపట్టు పనుల విషయంలో స్పష్టత అవసరం.  కాస్త కష్టపడుట వలన ఆశించిన మేర ఫలితాలు పొందుతారు. ఉద్యోగపరమైన విషయాల్లో మీ ఆలోచనలను అధికారులకు తెలియజేయుట మంచిది. వారి సూచనల మేర ముందుకు వెళ్ళుట మేలు. వాహనముల విషయంలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. జీవితభాగస్వామి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకొనుట సూచన,సర్దుబాటు విధానం మంచిది. ఆరోగ్యం విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. చేపట్టిన పనులను పూర్తిచేసేలా ప్రణాళిక కలిగి ఉండుట సూచన.

 


కర్కాటక రాశి : ఈవారం మొత్తం మీద మీ ఆలోచనలను పెద్దలతో పంచుకోవడం మంచిది. ఉద్యోగంలో పెద్దల నుండి సహకారం లభిస్తుంది. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం సూచన. సాధ్యమైనంత వరకు చర్చలకు దూరంగా ఉండుట సూచన. ఈవారంలో నచ్చిన వారిని కలుసుకుంటారు,వారితో సమయం గడుపుతారు. కుటుంబపరమైన విషయాల్లో మీ ఆలోచనలను అందరు ఆమోదించే అవకాశం ఉంది. 



 సింహ రాశి : ఈవారం మొత్తం మీద ముందుజాగ్రత్త కలిగి ఉండి ముందుకు వెళ్ళు ప్రయత్నం చేయండి. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండుట సూచన , లేకపోతే ఊహించని విధంగా మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది. ముఖ్యంగా మిత్రులతో మీ ఆలోచనలను స్పష్టగా పంచుకొనే ప్రయత్నం చేయుట మంచిది. ఉద్యోగపరమైన విషయాల్లో అసంతృప్తి మరింత పెరుగుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా వేయుట సూచన. ప్రణాళిక అవసరం. గతంలో ఆరంభించిన విదేశీ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. వ్యాపారపరమైన విషయంలో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. 


కన్యా రాశి : ఈవారం మొత్తం మీద ఆర్థికపరమైన విషయంలో నిదానంగా ముందుకు వెళ్ళండి. చేపట్టిన పనులను పూర్తిచేయుటలో మొదట్లో చూపిన ఉత్సహమను చివరకు నిలబెట్టుకునే విషయంలో స్పష్టత అవసరం. కుటుంబంలో మీ ఆలోచనలను సభ్యులకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు,చిన్న చిన్న విషయాల్లో అశ్రద్ధ వద్దు. సోదరులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. చర్చలకు సాధ్యమైనంత దూరంగా ఉండుట సూచన. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడుతాయి. 


తులా రాశి :  ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో లేక వృత్తిస్థానంలో నూతన ప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో కొంత సర్దుబాటు విధానం మంచిది. గతంలో చేసిన పనులకు గాను నలుగురిలో మంచి గుర్తింపును పొందుతారు. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. మిత్రులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. విదేశాల్లో ఉన్నబంధవుల నుండి కీలకమైన విషయాలు తెలుస్తాయి. కుటుంబపరమైన విషయాల్లో మీ ఆలోచనల వలన ఇబ్బందులు తెచ్చుకొనే ఆస్కారం ఉంది. ఆరోగ్యం మారింతగా ఇబ్బంది పెట్టె అవకాశం కలదు , జాగ్రత్త. 

 

వృశ్చిక రాశి : ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో పనిఒత్తిడి ఉంటుంది, తోటివారిని కలుపుకొని వెళ్ళుట సూచన. కొన్ని కొన్ని విషయాల్లో స్పస్టమైన ఆలోచన ఉండక పోవచ్చును, అనుభవజ్ఞుల అభిప్రాయాలూ తీసుకోండి. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసిన సంతృప్తి కలగకపోవచ్చును. కుటుంబపరమైన విషయాల్లో మౌనంగా ఉండుట సూచన. పెద్దలతో మీ ఆలోచనలను పంచుకుంటారు, వారి సూచనలు పరిగణలోకి తీసుకోండి. ప్రయాణాలు చేయుయటకు అవకాశం ఉంది, నూతన పరిచయాలు కలుగుతాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోండి.  

 

ధనస్సు రాశి : ఈవారం మొత్తం మీద ఉద్యోగపరంగా మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకొనే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న పెద్దలనుండి సహకారం లభిస్తుంది. ఆరోగ్యం కుదుట పడే ఆస్కారం కలదు. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. వారితో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. కుటుంబంలో మీ ఆలోచనలను సభ్యులు వ్యతిరేకించే ఆస్కారం కలదు, సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. సంతానం వలన నలుగురిలో మంచి గుర్తింపును పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోవడం మంచిది. 


మకర రాశి :  ఈవారం మొత్తం మీద మొదట్లో కొంత ఇబ్బందిని ఎదుర్కొన్న, రాను రాను దానిని అధిగమిస్తారు. పెద్దలతో మీ ఆలోచనలను పంచుకొనే ప్రయత్నం చేయుట మంచిది. స్పష్టమైన ఆలోచనలు మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తాయి. గతంలో చేసిన పనులకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. మిత్రులతో కలిసి చేసిన పనులు లబ్దిని ఇస్తాయి. రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా వస్తుంది, గట్టిగా ప్రయత్నం అవసరం. కుటుంబంలో పెద్దలనుండి సూచనలు వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. విదేశిప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. 


కుంభ రాశి :  ఈ వారం మొత్తం ఉద్యోగంలో కొంత సమయపాలన అవసరం, అధికారుల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్ళండి. సమయాన్ని వృధాచేయకుండా నూతన పనులపైన దృష్టిని పెట్టే ప్రయత్నం చేయుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో పెద్దలనుండి పూర్తిస్థాయిలో సహకారం అందుట అనేది ఊరట. ఇష్టమైన వ్యక్తులనుండి వచ్చే సమాచారం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. పెద్దలతో మీకున్న అనుభందం మరింత బలపడుతుంది. బంధువుల నుండి వచ్చిన సూచనల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడుతాయి.  


మీన రాశి :  ఈవారం మొత్తం మీద సామజిక పరమైన రంగాల పట్ల మక్కువను కలిగి ఉంటారు. చేపట్టిన పనులను మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. వాహనముల వలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది, నూతన వాహనాలు కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదా వేయుట మంచిది. మీ ఆలోచనలు మిమ్మల్ని మానసికంగా కృంగదీసే అవకాశం ఉంది , కావాయునా ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. సమయం ముఖ్యం అనే విషయాన్ని మరవకండి. వివాదాలకు దూరంగా ఉండండి. 

 

మరిన్ని శీర్షికలు
sarasadarahasam