Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
AHAM - The unseen journey of RGV || Telugu Shortfilm 2017 || A film by Satya

ఈ సంచికలో >> శీర్షికలు >>

సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

sirasri  question

.1. అర్జునుడిని పక్షపాతంతో చూసిందని ద్రౌపదికి, జ్ఞానగర్వంతో బతికాడని సహదేవుడికి, సౌందర్యగర్వంతో తనలోతాను మురిస్పోయాడని నకులుడికి, ప్రగల్భాలు పలికాడని అర్జునుడికి, తిండిపోతు అని భీముడికి స్వర్గం ద్వారాలు తెరుచుకోలేదు. మహాభారతంలోని మహాప్రస్థానపర్వంలో వారంతా దారిలోనే కుప్పకూలి మరణించారు. ధర్మరాజు ఒక్కడికే స్వర్గద్వారాలు తెరుకున్నాయి. జూదం ఆడి నానా కష్టాలు తీసుకొచ్చిన ధర్మారాజు కి బొందితో స్వర్గానికి వెళ్లడానికి స్వర్గానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, మిగిలిన పాండవులకి ఇవ్వకపోవడం అన్యాయం. ఒకవేళ న్యాయం అయితే జూదం ఆడడం ధర్మమే. 

 
2. ధర్మరాజు మహాజ్ఞాని. కష్టాలు ధర్మరాజు జూదం ఆడడం వల్ల రాలేదు. శకుని మాయాజూదం వల్ల సంభవించాయి. ఒకవేళ ధర్మరాజు జూదం ఆడకపోయినట్లైతే మరో మార్గంలో ప్రమాదం తీసుకువచ్చేవారు కౌరవలు. అప్పటికే లక్క ఇల్లు దహనం నుంచి తప్పించుకున్నారు పాండవులు. ఇదంతా ధర్మరాజుకు తెలుసు. నిత్యం తన తమ్ములని, ద్రౌపదని ఎటునుంచి వస్తాయో తెలియని ప్రమాదాల నుంచి  కాపాడుకునే కన్నా జూదం ఆడి ఓడి రాజ్యాన్ని వదిలేస్తే నయం అనుకున్నాడు. తర్వాత ఏది ధర్మమో, అధర్మమో ఎంచి తన బావ రూపంలో ఉన్న దైవమే నిర్ణయించి చేయవలసింది చేస్తాడని నమ్మాడు. అదే జరిగింది. కనుక జూదం ఎప్పటికీ ప్రమాదమే. సరదాగా ఆడవచ్చును కానీ, పందేలు పెట్టి ఆడవద్దు అని ధర్మరాజు ఉదాహరణగా లోకానికి చూపించాడు. రాజుగా తనవారిని రక్షించే పనిలో జూదం ఆడడం, తర్వాత అంతా దైవానికి వదిలేయడం అనే కారణాలవల్ల ధర్మరాజుకి పాపం అంటలేదు. అందుకే అతనికొక్కడికే స్వర్గం దారులు తెరుచుకున్నాయి. 
 
పై రెండిట్లో ఏది కరెక్ట్?
మరిన్ని శీర్షికలు
uttarakhand tourism