Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
uttarakhand tourism

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపటి ఫణిబాబు

chamatkaram

మన ప్రజాజీవనంలో లంచాలనేవి ఒక భాగంగా మారిపోయాయి. అదేమిటో ఎవడైనా డబ్బులు తీసికోకుండా ఓ ఉపకారం చేశాడంటే, అదో విచిత్రంగా భావిస్తారు.కట్నం అక్కర్లేకుండా పెళ్ళి చేసికుంటానన్నట్టుగా .. దానితో ఆ పుచ్చుకునేవాళ్ళు కూడా ఒహో తీసికోవాలి కాబోసు అనుకుని, మొదటిసారి మొహమ్మాట పడ్డా, దానికి అలవాటు పడిపోతాడు. దానితో ఈ లంచాలు, కట్నాలూ   అనేవి institutionalise అయిపోయాయి. ఎవరైనా కట్నం వద్దన్నాడనుకోండి, అతనిలో ఏదో లోపం ఉండుంటుందనుకుంటారు. మన జీవితాలు అలా తగలడ్డాయి మరి.ఏం చేస్తాం?

ఏదో ఈ మధ్యన మన న్యాయవ్యవస్థ కూడా కొద్దిగా, నిద్రలేచి, అక్కడక్కడ కేసులు విచారిస్తున్నారు.కానీ లాభం ఏమిటీ? ఓ అయిదారు నెలలు జైల్లో పెట్టి, బెయిల్ ఇచ్చేసి వదిలేస్తారు. వాళ్ళ కేసులు ఉన్నాయా అంటే ఉన్నాయి, లేదూ అంటే లేవు.రావణ కాష్ఠం లా అవి ఉంటూనే ఉంటాయి. అధికారంలో ఉండే పార్టికి ఈ కేసులు ఓ తురపు ముక్క లాటివి.ఆ కేసులున్నవాళ్ళు ఎప్పుడైనా అల్లరి పెట్టడం ప్రారంభిస్తే, ఓ సారి వాళ్ళమీదుండే కేసులు ఓపెన్ చేస్తూంటారు. మన జనాభా అందరూ ఆహా.. ఓహో ..అనుకుంటూ చంకలు కొట్టుకుంటూంటారు. మన యువతైతే social networking sites లో హడావిడి చేసేస్తారు. ఎవడైనా కర్మకాలి వాటికి against గా మాట్టాడితే, వాణ్ణి ఓ traitor లా చూస్తారు.

రెండేళ్ళ క్రితం మా అన్నా హజారే గారు, దేశాన్ని బాగుచేసే మహత్తర ఉద్దేశ్యంతో ఓ ఆందోళన ప్రారంభించారు.దేశంలో ఎక్కడలేని రాజకీయనాయకులూ, అర్రే ఇదీబాగానే ఉందీ అనుకుంటూ, ఆయన వెనక్కాల బయలుదేరారు. ఓ ఏడాది పాటు, మీడియాలోనూ హడావిడి జరిగింది.ఇంక social networking sites లో జరిగిన హడావిడి గురించి అడక్కండి.ఒకటి రెండు సార్లు నిరాహార దీక్షలూ వగైరాలు నిర్వహించిన తరువాత, ఏదో కొద్దిగా చలనం కనిపించింది.ఇదీ బాగానే ఉందీ అనుకుని, periodical గా అన్నా టీం వాళ్ళు కూడా హెచ్చరికలు ఇవ్వడం ప్రారంభించారు- ఫలానా రోజుకి అదేదో చట్టం తేకపోతే మేము ఆమరణ నిరాహార దీక్ష చేస్తామూ అని. సరే అలాగే కానివ్వండి అన్నారు మ.రా.శ్రీ. ప్రభుత్వం వారు.చివరకేమయ్యిందీ, ఓ పదిరోజులపాటు మీడియా నిండా న్యూసులో ఉండి, చివరకి ఓ గ్లాసుడు నిమ్మరసం పుచ్చుకుని ఉద్వాపన చెప్పేశారు. ఆయన పేరుచెప్పుకుని కేజ్రీవాల్ ఓ పార్టీ మొదలెట్టి,. అధికార పార్టీవారిని, దేశరాజధానిలో తుడిచిపెట్టేశాడు..

అక్కడికేదో రాజకీయాల్లోకి వస్తే ఏదో పొడిచేసినట్టు. అలాగని అన్నా హజారే గారి intentions లను dilute చేయడం లేదు.నన్ను తప్పుగా అర్ధం చేసికోకండి..మన రాష్ట్రంలో పాపం జయప్రకాశ్హ్ నారాయణ గారు లోక్ సత్తా పార్టీ మొదలెట్టారు. ఆ పార్టీ నుండి ఎంతమంది అసెంబ్లీకి వచ్చారూ? ఒక్కరూ అదీ ఆయనే. అన్నన్ని కబుర్లు చెప్పేసిన మన రాష్ట్ర ప్రజలకి, లంచాలంటేనే ఇష్టమంటారా? Definetely not. కానీ ఈ ఎలెక్షన్లన్నవున్నాయే, వాటిదాకా వచ్చేసరికి పాతవన్నీ మర్చిపోయి ఆ particular moment లో చేతిలో పడ్డ డబ్బులూ, నోట్లో పడ్డ మందు మాత్రమే గుర్తుంటుంది. మనకి ఎలెక్షన్లలో ఓట్లు కదా లెఖ్ఖలోకొచ్చేది, ఉద్దేశ్యాలూ, పాలసీలూ ఎవడిక్కావాలండి బాబూ?

ఏదో పార్టీ పెట్టేశామూ అంటే సరిపోతుందా, దానికి ఎంత కథా కమామీషూ. 1977 లో జయప్రకాశ్ నారాయణ గారి ధర్మమా అని, దేశం దేశం అంతా అట్టుడికిపోయింది. జైల్లో ఉన్న ప్రతిపక్షాలవాళ్ళు అందరూ జనతా పార్టీ అన్నారు, వాళ్ళ నిర్వాకం ఎన్నిరోజులుట, రెండంటే రెండేళ్ళు ! ఆ పార్టీ నామో నిషానీ లేకుండా పోయింది, పార్టీలకేమి లోటు? కావలిసినన్నున్నాయి. కానీ వాటిలో ఎన్ని effective అని ప్రశ్న.

నాకు ఒక విషయం అర్ధం కాదు, మొన్నెప్పుడో ఓ అమ్మాయి ఇన్ఫోసిస్ బిల్డింగు లోంచి కిందకు దూకేసి ఆత్మహత్య చేసికుందిట. ఇది చాలా విచారకరమైన విషయమే. కాదనము. కానీ ఆ పోలీసులేమిటీ, నిన్న ఓ మీటింగు పెట్టి, అవేవో cc camera clips,sms, phone calls data అందరికీ ఇవ్వాల్సిన అవసరం ఏమిటిటా? అసలే మన మీడియా ఓ కోతి, వాళ్ళ చేతుల్లో ఇలాటివి అవసరమా. ప్రతీ దానికీ trial by media అంత అవసరమా? ఇంక ఆ పోలీసులెందుకూ, కోర్టులెందుకూ?

ఎందుకొచ్చిన గొడవల్లెండి. లంచాలూ ఉంటాయి, మనమూ ఉంటాము. ఎప్పుడూ ఉండే గొడవలే.ఆ మాత్రం లంచాలు లేకుండా వెళ్తాయేమిటీ రోజులూ? మనం తిట్టుకుంటునే ఇస్తూ ఉంటాము, తీసికునేవాళ్ళు పుచ్చుకుంటూనే ఉంటారు.

మూడేళ్ళ క్రితం కొత్తపార్టీ అధికారంలోకి వచ్చినతరవాత, అదేదో “ అఛ్ఛేదిన్ “ అన్నారు. నల్లధనం రూపుమాపేస్తానన్నారు.. ఇంకా ఏవేవో చెప్పారు..  వచ్చే రెండేళ్ళలో ఇంకా ఎన్నెన్ని వినాలో…

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
sarasadarahasam