Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

యాక్షన్‌ బాట పట్టిన అక్కినేని నాగచైతన్య

nagachaitanya commit action movies

ప్రస్తుతం 'యుద్ధం శరణం' సినిమాలో నటిస్తున్నాడు అక్కినేని హీరో నాగ చైతన్య. 'సవ్యసాచి' అనే మరో సినిమాకి కమిట్‌ అయ్యాడు మనోడు. ఈ రెండూ యాక్షన్‌ నేపథ్యంలో సాగే సినిమాలే. అయితే దేనికదే విభిన్నమైన చిత్రాలట. 'యుద్ధం శరణం' టీజర్‌ వచ్చేసింది. ఎట్రాక్ట్‌ చేస్తోంది కూడా. కుటుంబం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధం చేయడానికి తెగించే యువకుడిగా 'యుద్ధం శరణం' సినిమాలో నాగచైతన్య కన్పిస్తాడు. ఇందులో శ్రీకాంత్‌ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసినదే. 'సవ్యసాచి' విషయానికొస్తే ఇదొక డిఫరెంట్‌ యాక్షన్‌ మూవీ అట. ఫస్ట్‌ లుక్‌తోనే ఆ విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. రెండు చేతుల్లోనూ రెండు శూలాలు పట్టుకుని ఉన్నాడు .

నాగచైతన్య. సవ్యసాచి అంటే రెండు చేతులతోనూ ఒకేలా ఏ ఆయుధాన్ని అయినా సంధించగలిగేవాడని అర్థం. కండ బలం, బుద్ధి బలం ఉన్న యువకుడి పాత్రలో నటుడిగా నాగచైతన్య చెలరేగిపోవడం ఈ సినిమాలో చూడబోతున్నామని ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ ద్వారా తెలియవస్తోంది. విలక్షణ చిత్రాల దర్శకుడు చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో చందు మొండేటితో 'ప్రేమమ్‌' సినిమాలో నటించాడు నాగ చైతన్య. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది. అలాగే ఈ సినిమాపైనా అంచనాలున్నాయి. చైతూ కెరీర్‌ అసేల సూపర్‌ స్పీడుగా ఉంది. ఈ సినిమాతోనూ ఆ స్పీడు కొనసాగించేలానే ఉన్నాడు చైతూ. మరో పక్క అతి త్వరలోనే సమంతతో పెళ్లి పీటలెక్కడానికి రెడీగా ఉన్నాడు నాగ చైతన్య.

మరిన్ని సినిమా కబుర్లు
mega star 151st movie shootiing start