Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nagachaitanya commit action movies

ఈ సంచికలో >> సినిమా >>

మెగా కబురు 'సింపుల్‌'గా చెప్పేశారే

mega star 151st movie shootiing start

మెగాస్టార్‌ చిరంజీవి 151వ సినిమా సౌండింగ్‌ ఏ రేంజ్‌లో ఉండాలి? సినిమా అనౌన్స్‌మెంట్‌ దగ్గర్నుంచి, టైటిల్‌ ప్రకటన, ప్రీ లుక్‌, ఫస్ట్‌ లుక్‌, టీజర్‌, ట్రైలర్‌ ఇలా ప్రతీదీ సెన్సేషనల్‌ న్యూస్‌లానే ఉండాలని అభిమానులు ఆశిస్తారు. రీ-ఎంట్రీలో 'ఖైదీ నెంబర్‌ 150' అంటూ హీరోగా 150వ సినిమా చిరంజీవి చేయడమే కాకుండా, సంచలన విజయాన్ని అందుకున్నారు. దాంతో 151 మీద సహజంగానే అభిమానుల ఎక్స్‌పెక్టేషన్స్‌ పీక్స్‌లోకి వెళ్ళిపోయాయి. అయితే నిర్మాత రామ్‌చరణ్‌ కాస్త కొత్తగా ఆలోచించాడు. మెగా మూవీకి ఆటోమేటిక్‌గా హైప్‌ వచ్చేస్తుంది కాబట్టి, లో ప్రొఫైల్‌లో జరగడమే మంచిదనుకున్నట్టున్నాడు. అందుకే సింపుల్‌గా సినిమా ప్రారంభోత్సవాన్ని చేసేశారు. ఆగస్ట్‌ 16న చిరంజీవి 151వ సినిమా ప్రారంభోత్సవం చాలా కామ్‌గా జరిగింది. దర్శకుడు సురేందర్‌రెడ్డి, రచయితలు పరుచూరి బ్రదర్స్‌, మెగా ఫ్యామిలీ సమక్షంలో సింపుల్‌గా ఈ వేడుకని పూర్తి చేశారు. ఆగస్ట్‌ 16న ప్రారంభమవుతుందనే 'న్యూస్‌' అప్పటిదాకా బయటకు రాకపోవడం ఆశ్చర్యకరం. అయితే ఆగస్ట్‌ 22న సినిమా టైటిల్‌ రిలీజ్‌ చేయబోతున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందనుంది. 2018 వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి తరం తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది. 'మహావీర' అనే టైటిల్‌ అనుకుంటున్నారు. 

మరిన్ని సినిమా కబుర్లు
hats off to balakrishna