Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
fida movie cross 44 crores

ఈ సంచికలో >> సినిమా >>

మెగా మేనల్లుడి ట్రిపుల్‌ ధమాకా

sai dharamtej tripul dhamakha

వరుసగా రెండు సినిమాలతో నిరాశపడ్డ మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ ఈసారి కథల ఎంపికలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడట. అలా ఆలోచించీ ఆలోచించీ ఎంపిక చేసుకున్న కథే 'జవాన్‌'. రచయిత బీవీఎస్‌ రవి దర్శకత్వంలో రూపొందుతున్న 'జవాన్‌' విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా ప్రోమోస్‌ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయి. ఇంకో వైపున సాయిధరమ్‌ తేజ వరుసగా రెండు సినిమాలకి కమిట్‌ అయ్యాడు. ఇందులో ఒకటి మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్స్‌కి పెట్టింది పేరైన వినాయక్‌ దర్శకత్వంలో కాగా, ఇంకొకటి కూల్‌ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీస్‌కి పెట్టింది పేరైన కరుణాకరన్‌ దర్శకత్వంలో చేస్తున్న సినిమా. జవాన్‌ డిఫరెంట్‌ సబ్జెక్ట్‌. సొసైటీకి మంచి మెసేజ్‌ ఇచ్చే కథ ఇది.

వినాయక్‌ సినిమాలెలా ఉంటాయో అందరికీ తెలుసు. చిరంజీవితో 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా తీసి బంపర్‌ హిట్‌ అందుకున్న వినాయక్‌ దర్శకత్వంలో సాయిధరమ్‌ తేజ హీరోగా సినిమా అంటే ఆ అంచనాలకు ఆకాశమే హద్దు. ఓ ప్రయోగం, ఓ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ తర్వాత కూల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ని కరుణాకరన్‌ దర్శకత్వంలో సాయిధరమ్‌తేజ ప్లాన్‌ చేశాడంటే, అతని ప్లానింగ్‌కి సెల్యూట్‌ చెయాల్సిందే. కరుణాకరన్‌, పవన్‌కళ్యాణ్‌ దర్శకత్వంలో 'తొలి ప్రేమ' సినిమా అప్పట్లో పెద్ద సంచలనం. ఆ స్థాయిలోనే సాయిధరమ్‌తో కరుణాకరన్‌ తెరకెక్కించబోయే సినిమా ఉంటుందట.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam