Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
short flims  smart ideas

ఈ సంచికలో >> యువతరం >>

ఈ-దొంగలు తెలివిగా దోచేస్తారు

youth adicted from smart phone

చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే, ఆకాశమే హద్దు అన్నట్లుగా చెలరేగిపోతోంది నేటి యువత. మార్కెట్‌లోకి కొత్త ఫీచర్లతో ఏ కొత్త మోడల్‌ ఫోన్‌ వస్తుందా? అని ఎదురుచూస్తున్నవారిలో ఎక్కువ శాతం యువతే కనిపిస్తుంటారు. యువత అనే కాదు, స్మార్ట్‌ మొబైల్‌కి దాదాపుగా ప్రతి ఒక్కరూ అడిక్ట్‌ అయిపోతున్నారు. పట్టణాలూ, పల్లెటూళ్ళూ అన్న తేడాల్లేకుండా స్మార్ట్‌ ఫోన్‌ ఎక్కడంటే అక్కడ కనిపించేస్తోంది. 4జి టెక్నాలజీ పుణ్యమా అని స్మార్ట్‌ ఫోన్‌ మరింత స్మార్ట్‌గా జనానికి చేరువైపోయింది. వీడియోలు షేర్‌ చేయడానికి నయా స్మార్ట్‌ ఫోన్‌లు ఎంతో ఉపయోగపడ్తున్నాయి. వీడియో కాలింగ్‌ ఇప్పుడు సర్వసాధారణం. అయితే ఇప్పుడు కొత్త దొంగలు తయారయ్యారు. వాళ్ళే ఈ-దొంగలు. మీ స్మార్ట్‌ ఫోన్‌లోకి మీకు తెలియకుండా చొరబడిపోతారు. సర్వం దోచేస్తారు. అదెలా? అనంటారా? అదే మరి, ఈ-దొంగల ప్రత్యేకత.

మీ ఫోన్‌కి ఓ మిస్డ్‌ కాల్‌ వస్తుంది, అదేంటోనని కాల్‌ చేసారా మీ పనైపోయినట్లే. మీ ఫోన్‌కి ఓ మెసేజ్‌ రావొచ్చు. అందులో ఓ లింక్‌ ఉండచ్చు. దాన్ని క్లిక్‌ చేస్తే అంతే సంగతులు. ఇలా ఒకటేంటి, చాలా రకాలుగా ఈ-దొంగలు మీ ఫోన్‌ని తమ వశం చేసుకుంటారు. పురాణాల్లో ఒకర్ని ఇంకొకరు వశం చేసుకోవడం అనే మాట గురించి కొద్దో గొప్పో మనకి తెలిసే ఉంటుంది. దాదాపు అలాంటిదే ఇది. ఒక్కసారి ఫోన్‌ ఈ-దొంగల వశమైతే, ఆ తర్వాత ఆ ఫోన్‌ ఆ దొంగలు చెప్పినట్లే నడుచుకుంటుంది. ఉన్నపళంగా మీ మొబైల్‌లో ఛార్జింగ్‌ అయిపోయిందంటే, కొంచెం అనుమానించాల్సిందే. మీ ఫోన్‌ స్లీప్‌ మోడ్‌లోనే ఉంటుంది, కానీ అది మీ ఫొటోల్ని తీసేస్తుంది. ఆ సంగతి మీకు మాత్రం తెలియదు. మీ ఫోన్‌లో ఆ ఫొటో ఉండదు, కానీ అది క్షణాల్లో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైపోతుంటుంది. ఇది ఈ-దొంగల ప్రత్యేకతకు సంబంధించి ఓ చిన్న ఉదాహరణ మాత్రమే. వ్యక్తిగత ఫొటోలు మీ ఫోన్‌లోంచి దొంగిలించబడితే ఆ తర్వాత ఏమౌతుందో తెలుసు కదా! 

ఇదొక్కటే కాదు, మీ ఫోన్‌లో డాటా మొత్తం ఈ-దొంగల చేతుల్లో పడుతుంది. ఇప్పుడంతా మొబైల్‌తోనే ట్రాన్సాక్షన్స్‌ జరుగుతున్నాయి. బ్యాంకు లావాదేవీలు ఇందులో ముఖ్యమైనవి. ఆ సమాచారం ఈ-దొంగలు చేజిక్కించుకుంటే జరిగే నష్టం ఊహలకే అందని విధంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మనం ఈ-దొంగల నుంచి ఎలా తప్పించుకోగలమన్నదే కదా మీ డౌట్‌! మీ ఫోన్‌ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండండి. ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే టెక్నీషియన్‌ దగ్గరకు తీసుకెళ్ళి మీ అనుమానాన్ని వ్యక్తపరచండి. వీలైనంతవరకు మీ మొబైల్‌ని అపరిచితులనబడే ఎవరి చేతికీ ఇవ్వొద్దు. అలాగే అనుమానిత లింక్స్‌ని క్లిక్‌ చేయొద్దు. అనుమానిత ఫోన్‌ కాల్స్‌కి తిరిగి రెస్పాండ్‌ అవ్వొద్దు. సెక్యూరిటీ అప్‌డేట్స్‌ తప్పనిసరి, అలాగే యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ కూడా.

మరిన్ని యువతరం