Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sachin new look

ఈ సంచికలో >> సినిమా >>

ఇండియన్‌ మూవీ 'సైరా నరసింహారెడ్డి'

indian movie sairaa narasimha reddy

సైరా సైసైరా నరసింహారెడ్డీ అని బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్‌ విన్పిస్తోంటే, సినీ ప్రేక్షకులు ఓ వింత అనుభూతికి లోనుకాకుండా ఉంటారా? దేశభక్తితో ఉప్పొంగిపోకుండా ఉండగలరా? అందుకే 'సైరా నరసింహారెడ్డి' అనే టైటిల్‌ని చిరంజీవి కొత్త సినిమా కోసం ఖరారు చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌, కాస్ట్‌ ఆండ్‌ క్రూ ఇవన్నీ ఒకేరోజు తెరపైకొచ్చాయి. దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా మోషన్‌ పోస్టర్‌ని లాంఛ్‌ చేశారు.

ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న రామ్‌చరణ్‌, నిర్మాతగా తనకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ చిత్రం, తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా ఇండియన్‌ సినిమా చరిత్రలోనే ఎంతో ప్రత్యేకమైన సినిమా అవుతుందని అన్నాడు. 'బాహుబలి' తరహాలో 'సైరా' సినిమాని ప్రేక్షకులు ఆదరించనున్నారనడానికి సంకేతం, ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌కి వస్తున్న రెస్పాన్సే. నిర్మాతగా తొలి సినిమానే అయినా 'ఖైదీ నెంబర్‌ 150' మార్కెటింగ్‌ స్ట్రాటజీస్‌లో తనదైన ప్రత్యేకతను చాటిన రామ్‌చరణ్‌, నిర్మాతగా తన రెండో ప్రయత్నంతో మళ్ళీ తండ్రి చిరంజీవినే ప్రమోట్‌ చేయనుండడం గమనించదగ్గ అంశం. బాలీవుడ్‌ నుంచి అమితాబ్‌ బచ్చన్‌నీ, కన్నడ సినీ పరిశ్రమ నుంచి సుదీప్‌నీ, తమిళ సినీ పరిశ్రమ నుంచి విజయ్‌ సేతుపతినీ తీసుకురావడం ద్వారా ఈ సినిమాకి విపరీతమైన క్రేజ్‌ తీసుకొచ్చారు. రవివర్మన్‌ సినిమాటోగ్రఫీ, ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం ఇవన్నీ ఈ సినిమాకి అదనపు ఆకర్షణలు కానున్నాయనడం నిస్సందేహం. 

మరిన్ని సినిమా కబుర్లు
puri balayya paisa vasool special