Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
indian movie sairaa narasimha reddy

ఈ సంచికలో >> సినిమా >>

పూరి - బాలయ్య 'పైసావసూల్‌' స్పెషల్‌ అదే

puri balayya paisa vasool special

ఓ అభిమాని, తన అభిమాన హీరో సినిమాకి దర్శకత్వం వహిస్తే ఎలా ఉంటుంది? అది 'పైసా వసూల్‌'లా ఉంటుందట. ఇంకెందుకు ఆలస్యం? సెప్టెంబర్‌ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది కదా! ఆ సినిమా సాధించే సంచలన విజయమెలా ఉంటుందో వేచి చూసేద్దాం. కానీ అభిమానులే ఆ ఉత్కంఠని భరించలేకపోతున్నారు. ఈ స్వీట్‌పెయిన్‌ కష్టమే అయినా ఇష్టంగా చేసుకోక తప్పడంలేదని చెబుతున్నారు. బాలకృష్ణ మీద తనకున్న అభిమానాన్ని 'పైసావసూల్‌' సినిమా ప్రారంభోత్సవంలోనే చెప్పిన పూరి జగన్నాథ్‌, సినిమాలో బాలయ్య పాత్రను అదే అభిమానంతో తీర్చిదిద్దాడు. కరడుగట్టిన వీరాభిమానిలా మారిపోయిన పూరి జగన్నాథ్‌, బాలయ్యలోని అసలు సిసలు మాస్‌ యాంగిల్‌ని 'పైసావసూల్‌'తో చూపించాడని నిస్సందేహంగా చెప్పవచ్చు.

ట్రైలర్‌, టీజర్‌ (స్టంపర్‌ అని పేరు పెట్టాడు టీజర్‌కి పూరి జగన్నాథ్‌) అభిమానుల్లో అంచనాల్ని పెంచేశాయి. పాటలైతే కెవ్వు కేక అనాల్సిందే. మాస్‌ అప్పీల్‌తో కొన్ని పాటలు, క్లాస్‌ టచ్‌తో ఇంకొన్ని పాటలు ఇలా భలేగా మిక్స్‌ చేయడంలో పూరి సక్సెస్‌ అయ్యాడు. యాక్షన్‌లో బాలయ్య తనకు తానే సాటి అని ఇంకోసారి నిరూపించుకోబోతున్నాడు. వయసు ప్రభావం తన డాన్సుల మీద పడబోదని ఇప్పటికే ఎన్నో సినిమాలతో చూపించిన బాలయ్య, ఈసారీ డాన్సుల్లో చెలరేగిపోవడం గమనించదగ్గ అంశం. లేటెస్ట్‌గా విడుదలైన కొత్త పాట తాలూకు ప్రోమో అయితే, స్వర్గీయ ఎన్టీయార్‌ని గుర్తుకు తెస్తోంది. ఇంత అభిమానమా బాలయ్యఅ ంటే పూరికి? అదే ఈ సినిమా ప్రత్యేకత. 

మరిన్ని సినిమా కబుర్లు
jai lavvakusha dubbing start