Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Aditya Hrudayam

ఈ సంచికలో >> సినిమా >>

గీత రచయితలకు ఎత్తుతో సంబంధం లేదు

no height limitations for cine poets

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘బాహుబలి’. పేరుకు తగ్గట్టుగా సినిమాలో నటిస్తున్నవారంతా పొడుగ్గా, మంచి శరీర సౌష్టవంతో వున్నవారే. ప్రభాస్, రాణా మాత్రమే కాక, హీరోయిన్ అనుష్క కూడా మంచి హైట్. అలా పొడగరుల సినిమా అయిపోయిందిది.

నటీనటులేనా? లిరిక్ రైటర్స్ని కూడా పొడుగ్గా వుండేవారిని ఎంచుకుంటే బావుంటుందేమో అని ఓ సినిమా ఫంక్షన్లో లిరిసిస్టుల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. సహజమే ఇలాంటి చర్చలు సినీ జనం మధ్య. అందులో ఓ సీనియర్ లిరిసిస్ట్, జూనియర్ లిరిసిస్ట్తో, ఎంత ఎత్తున్నారన్నది కాదు ముఖ్యం, ఎంత ఎత్తుకు ఎదిగామన్నది ముఖ్యం అని అన్నారు సరదాగా. దాంతో, అక్కడున్న వాతావరణం అంతా నవ్వులు విరజిల్లింది. సీనియర్ పాటల రచయిత భాస్కరభట్ల అయితే, జూనియర్ పాటల రచయిత సిరాశ్రీ.

మరిన్ని సినిమా కబుర్లు
why shootings in europe