Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
no height limitations for cine poets

ఈ సంచికలో >> సినిమా >>

యూరప్ లో షూటింగ్ ఎందుకంటే

why shootings in europe

చిన్న చిన్న సినిమాలు సైతం యూరప్ టూర్స్ వేసేస్తున్నాయి షూటింగ్ నిమిత్తం. ఇదివరకు సింగపూర్, మలేషియాలకు జంప్ చేసే తెలుగు సినిమా, ఇప్పుడు యూరప్ పై కన్నేసింది. కారణమేంటి? అని అందరూ అనుకుంటున్నారు.

అసలు విషయం ఏంటంటే, ఇతర దేశాలతో పోల్చితే యూరోప్ లో షూటింగ్ కి చాలా వెసులుబాట్లు వుంటాయి. పెద్దగా నిబంధనలేవీ వుండవు యూరప్ లో. పైగా, కొన్ని ప్రాంతాల్లో సినిమా షూటింగులు చేసినందుకుగాను అక్కడి వారు ఎదురు డబ్బులు చెల్లిస్తారట. ఇదేదో బాగుందే. అందుకే మరి, ఛలో యూరప్ అని తెలుగు సినీ జనం జంపింగ్ జపాంగ్ అయిపోతున్నారు యూరోప్ కి.

ఏదో, ప్లయిట్ ఛార్జీలు జాగ్రత్త చేసుకుంటే నిర్మాతకీ టెన్షన్ తగ్గుతుంది. పైగా ఖరీదైన సినిమాగా తెరకెక్కుతుంది అతి తక్కువ ఖర్చుతో. లొకేషన్స్ అద్భుతం, సినిమా రిచ్నెస్కి ప్రేక్షకులు ఫిదా అయిపోతారు. అలా, ఈ మధ్య ఎక్కువగా తెలుగు సినిమాలు యూరోప్ లో చిత్రీకరించబడుతున్నాయి.

మరిన్ని సినిమా కబుర్లు
RGV found rakthi in bhakthi