Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

కిస్ (కీప్ ఇట్ సింపుల్ స్టుపిడ్) - చిత్ర సమీక్ష

Movie Review - KISS

చిత్రం: కిస్ (కీప్ ఇట్ సింపుల్ స్టుపిడ్)
తారాగణం: అడవి శేష్, ప్రియా బెనర్జీ, షఫీ, డా.చంద్ర అడివి, ఆనంద్ బచ్చు తదితరులు.
ఛాయాగ్రహణం: షేనీల్ డియో
సంగీతం: శ్రీచరణ్ పాకాల, పీట్ వండర్
నిర్మాణం: మై డ్రీమ్ సినిమా ప్రైవేట్ లిమిటెడ్
నిర్మాత: సాయికిరణ్ అడివి
దర్శకత్వం: అడవి శేష్
విడుదల తేదీ: 13 సెప్టెంబర్ 2013

క్లుప్తంగా చెప్పాలంటే:
అమెరికాలో వుండే తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయి ప్రియ (ప్రియా బెనర్జీ), లండన్ ఆక్స్ ఫర్ట్ యూనివర్సిటీలో పై చదువులు చదవాలనుకుంటుంది. అయితే ఆమె కోరికకు భిన్నంగా ఆమె తండ్రి తన స్నేహితుడి కొడుకుతో తన కుమార్తెకి పెళ్ళి చేయాలనుకుంటాడు. అయితే పెళ్ళికొడుకు రవి (భరత్ రెడ్డి) దుర్మార్గుడు. పెళ్ళికొడుకు గురించి తెలుసుకుని, అతనితో పెళ్ళి నచ్చక ఇంట్లోంచి పారిపోతుంది ప్రియ. ఆత్మహత్య చేసుకుందామనుకుంటుంది కూడా. అయితే ఆ టైమ్ లో సన్నీ (శేష్) పరిచమవుతాడామెకి. శేష్, ఆ అమ్మాయికి బతుకు మీద ఆశ ఎలా కల్పిస్తాడు? 20 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులు కూడా తమ కుమార్తె గురించి సరిగ్గా అర్థం చేసుకోలేనిది, కేవలం ఇరవై గంటల్లో ఆమెను పూర్తిగా అర్థం చేసుకుని, ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆమె మనసుని తెలుసుకుని, సరిగ్గా 20 గంటల్లో ఆమె మనసు సన్నీ మార్చగలిగాడు? ఇంతకీ సన్నీ ఎవరు? అన్నది తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే:
నటుడిగా అడవి శేష్ చాలా బాగా చేశాడు. ‘పంజా’ సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ వున్న క్యారెక్టర్ లో రాణించిన శేష్, ఈ సినిమాలో హీరోగా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. రొమాంటిక్ లుక్స్ తో ఆకట్టుకున్నాడు. అక్కడక్కడా నవ్వించగలిగాడు కూడా. నటుడిగా నిలదొక్కుకోవాలంటే కామెడీ పండించడం తప్పనిసరి. ఆ విభాగంలో సక్సెస్ అయ్యాడు శేష్. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ బాగున్నాయి. డాన్సులు తక్కువే. పాటలేమో క్లాస్ అప్పీల్ తో వున్నాయి. హీరోయిన్ విషయానికొస్తే, కొత్తమ్మాయి అయినా ప్రియా బెనర్జీ బాగానే చేసింది, చాలా అందంగా వుంది. మిగతా పాత్రలన్నీ ఫర్వాలేదుగానీ, ఇంకాస్త బెటర్ ఆప్షన్ని చూసుకోవాల్సింది.

వున్నంతవరకూ ఏ పాత్రా మైనస్ అన్పించదు. సినిమా అంతా అమెరికాలోనే తెరకెక్కించడంతో రిచ్ నెస్ వచ్చింది. దర్శకుడిగానూ అడవి శేష్ మంచి మార్కులేయించుకుంటాడు. టేకాఫ్ వరకూ కాస్తంత బోర్ గా వున్నా, కథ ముందుకు సాగే కొద్దీ ప్రేక్షకుల్ని సినిమాలో లీనమయ్యేలా చేయగలిగాడు దర్శకుడు. సంగీతం బావుంది. ఎడిటింగ్ ఓకే.

ఒక్క మాటలో చెప్పాలంటే: బాగుంది..చూసేయండి.

అంకెల్లో చెప్పాలంటే:2/5

మరిన్ని సినిమా కబుర్లు
Interview with Singer Revanth