Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sirasri  question

ఈ సంచికలో >> శీర్షికలు >>

భ్రమరాంబకి నచ్చేసాను లఘు చిత్ర సమీక్ష - రూపినేని ప్రతాప్

Bramarambaki Nachhesanu Telugu Short Film 2017 || Directed By Bala Raju

 చిత్రం: భ్రమరాంబకి నచ్చేసాను
నటీనటులు: దీపు, జాను, కోన కవిత, సుమంత్ వీరెళ్ళ, ఎఫ్.ఎం.బాబాయ్
సంగీతం: మధుపొన్నాస్
డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: శశాంక్ సూరాడ
నిర్మాత: సిస్లా ప్రొడక్షన్
దర్శకత్వం: బాలరాజు

కథ: "సుమంత్ వీరెళ్ళ" డైరక్టర్ కావాలనుకుని తన దగ్గర ఉన్నటువంటి కథని నిర్మాత అయిన ఎఫ్.ఎం బాబాయ్ కథ చెబుతాడు. ఆ కథ నచ్చాక ఒక మంచి లవ్ స్టోరీ తీసుకుని రా.. ప్రేమ పుట్టేది బస్ స్టాప్ లోనే ఏదైనా బస్ స్టాప్ కి వెళ్ళి అక్కడ వున్న వాళ్ళని పరిశీలించి ఒక మంచి లవ్ స్టోరీని రెడీ చెయ్యమని చెబుతాడు. దానికి సరే అని చెప్పి సుమంత్ వీరెళ్ళ కొన్ని రోజులు అయిన తరువాత మరల వచ్చి నిర్మాతకి ప్రేమ కథని వినిపిస్తాడు. దానికి మన నిర్మాత బాగా నచ్చి సరే చేద్దాం. పూర్తిగా డెవలప్ చెయ్యి అంటాడు. అసలు సుమంత్ వీరెళ్ళ బస్ స్టాప్ కి నిజం గా వెళ్ళి అక్కడ వున్న వాళ్ళను పరిశీలించి కథ చెప్పాడా,  లేక  తన ఊహల నుండి పుట్టిందా.. నిర్మాతకి చెప్పిన కథేంటి? అది ఎలా వుంది అని తెలుసుకోవాలంటే కింద కనపడే లింక్ మీద క్లిక్ చెయ్యండి.

విశ్లేషణ: ఓపెన్ చెయ్యగానే చాలా ఆసక్తికరంగా సాగే రివెంజ్జ్ మర్డర్ ను చూపించి ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తాడు. తరువాత చాలా సాఫ్ట్ గా ఒక లవ్ స్టోరీని చాలా సాదాసీదాగా ఒక కొత్త పాయింట్ ని తీసుకుని బోర్ కొట్టించకుండా చాలా బాగా తెరకెక్కించాడు. లీడ్ రోల్ చేసిన దీపు , జాను మరియు కవిత వాళ్ళ పరిధి మేరకు చాలా చేశారు. ఇకపోతే సుమంత్ వీరెళ్ళ చాలా సహజమైన నటనతో ఎఫ్.ఎం. బాబాయ్ బాగా చేశాడు.

ప్లస్ పాయింట్స్:

1. డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ
2. సంగీతం
3. కొన్ని సన్నివేశాలు     

మైనస్ పాయింట్స్:

1.కథ
2. కథనం.
3.హీరోయిన్
4. కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు

సాంకేతిక విభాగం: డైరక్టర్ బాల రాజు గారు తను అనుకున్న కథను తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. నటీనటుల నుండి నటన బాగా చేయిన్చుకోలేకపోయాడు. కథ మరియు కథనం మీద ఇంకొంచెం శ్రరద్ధ తీసుకుని వుంటే చాలా బాగుండేది. సినిమా లోని విజువల్స్ చాలా బాగా సాధారణం గా వున్నాయి.

సంగీతం వినసొంపుగా సన్నివేశాలకు తగినట్టు చాలా బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

చివరగా: ఎప్పుడు భ్రమరాంబ వెనుకల శివ గాడే కాదు బట్ ఫర్ ఏ చేంజ్ శివ (దీపుజాను) గాడి వెనుకల కూడా భ్రమరాంబ పడుతుంది.           

మరిన్ని శీర్షికలు
uttarakhand tourism