Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
uttarakhand tourism

ఈ సంచికలో >> శీర్షికలు >>

15-09-2017 నుండి21-09-2017 వరకు - - శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తం మీద ఆర్థికపరమైన గణాంకాల విషయంలో స్పస్టత తెచ్చుకొనే ప్రయత్నం మంచిది. సాధ్యమైనంత వరకు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండుట సూచన. పెద్దలతో ఆలోచనలను పంచుకుంటారు. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. ఒకింత ఆందోళనకు లోనయ్యే అవకాశం ఉంది. చేపట్టిన పనులను పూర్తిచేయుటకు సరైన సమయంలో సహకారం వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఉత్సాహానికి తగిన విధంగా కష్టపడుట ద్వారా ఊహించిన ఫలితాలను పొందుటకు అవకాశం ఉంది. వాహనముల మూలాన ఇబ్బందులు కలుగుతాయి జాగ్రత్త. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు.

 

 వృషభ రాశి : ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుటకు అవకాశం ఉంది. పెద్దలు మీ పై పెట్టిన భాద్యతలను చక్కగా నెరవేర్చే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు తప్పక పోవచ్చును. చేపట్టిన పనుల విషయంలో కాస్త స్పష్టమైన ఆలోచన కలిగి ఉండుట సూచన. ఆర్థికపరమైన విషయాల్లో తగిన విధంగా ఆలోచన కలిగి ఉండుట సూచన. వ్యాపారపరమైన విషయంలో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. మిత్రులతో మీ ఆలోచనలు పంచుకుంటారు.  .  


మిథున రాశి :  ఈవారం మొత్తం మీద కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. విదేశీప్రయాణాల కోసం ధనమును వెచ్చించే అవకాశం కలదు. చేపట్టిన పనులను మొదట్లో వేగంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఆరంభంలో ఉన్న వేగం తదుపరి ఉండక పోవచ్చును. నచ్చిన వ్యక్తులను కలుసుకునే ఆస్కారం కలదు, సమయాన్ని వారితో గడుపుతారు. ఉద్యోగపరమైన విషయాల్లో అధికారులతో మీ ఆలోచనలు పంచుకొనే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో శుభకార్యాల గురుంచి ప్రస్తావన వచ్చే అవకాశం కలదు.


కర్కాటక రాశి : ఈవారం మొత్తం మీద మిశ్రమ ఫలితాలు పొందుతారు. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. తల్లి తరుపు బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఉత్తమం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం సూచన. పెద్దలతో మీకున్న పరిచయం బలపడేలా మీ ప్రయత్నాలు ఉండేలా చూసుకోండి. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. ఉద్యోగంలో నలుగురిని కలుపుకొని వెళ్ళుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో కాస్త ఆచితూచి వ్యవహరించుట సూచన విదేశీప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది. మిత్రులతో మీ ఆలోచనలను పంచుకుంటారు.



 సింహ రాశి : ఈవారం మొత్తం మీద సోదరులతో చర్చలు చేయవల్సి వస్తే పూర్తిస్థాయి అవగాహనా కలిగి ఉండుట ద్వారా నష్టమును తగ్గించుకొనే అవకాశం ఉంది. సమయాన్ని సరదాగా గడుపుటకు ఇస్టపడుతారు. చిననాటి మిత్రులను కలుస్తారు, వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. కుటుంబసభ్యులనుండి వచ్చిన సూచనలను పాటించుట సూచన. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారపరమైన విషయాల్లో మీరు ఆశించిన విధంగా నూతన పనులను చేపట్టుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో ఆశించిన మేర గుర్తిపును పొందుతారు.

 

 


కన్యా రాశి : ఈవారం మొత్తం మీద నూతన ఆలోచనలకు శ్రీకారం చుడుతారు. వేగంగా కన్నా స్పష్టమైన ఆలోచన బలమైంది గురుతిరిగి ముందుకు వెళ్ళండి. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. కొన్ని కొన్ని విషయాల్లో కాలం సమాధానం చెబుతుంది. బంధువులను లేదా ఆత్మీయులను కలుస్తారు. అనుకోని విధంగా దూరప్రదేశప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. మీ మాటతీరు విషయంలో ఒకటికి రెండుసార్లు సరిచూసుకొనే ప్రయత్నం చేయుట మంచిది వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది. తల్లితరుపు బంధువుల నుండి కీలకమైన విషయాలు తెలుస్తాయి. మానసికంగా దృడంగా ఉండుట అవసరం.

 

 


తులా రాశి : ఈవారం మొత్తం మీద మీ ఆలోచన విధానం వలన నస్టపోయే అవకాశం ఉంది. కుటుంబంలో వచ్చే సమస్యలను పెద్దగా చేసుకుంటారు. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడుతాయి. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మీకంటూ ఒక విధానం కలిగి ఉండుట సూచన. పెద్దలతో చర్చలు చేయునపుడు జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. మీ మాటతీరు మూలాన ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది. చర్చలకు అవకాశం ఇవ్వకండి.

 

 

వృశ్చిక రాశి : ఈవారం మొత్తం మీద ఉద్యోగపరమైన విషయాలకు సమయం ఇస్తారు. అధికారులకు అనుగుణంగా నడుచుకోండి. నూతన వాహనాలను కొనుగోలు చేసే విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎవరికైనా డబ్బులను ఇచ్చే విషయంలో తొందరపాటు, సాధ్యమైనంత వరకు శారీరక , మాట సహాయం చేయడం మంచిది ఆర్థిక సహాయం కన్నా. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యపరమైన సమస్యలు వారమో చివర్లో వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త. మిత్రులతో ఊహించని విధంగా వివాదాలు వచ్చే ఆస్కారం కలదు.

 

ధనస్సు రాశి : ఈవారం మొత్తం మీద చేపట్టిన పనులను పూర్తిచేయుటలో ఇబ్బందులు కలుగుతాయి. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలకు సమాధానం చెప్పవల్సి వస్తుంది. గతంలో ఆత్మీయులతో ఉన్న మనస్పర్థలు తొలగుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయునపుడు ఒకింత జాగ్రత్తలు తీసుకోవడం సూచన. దూరప్రదేశ ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. పెద్దలతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త పడటం సూచన. గతంలో చేపట్టిన పనులకు గాను నలుగురిలో మంచి గుర్తింపు లభిస్తుంది. దైవపరమైన విషయాలకు కాస్త సమయం ఇవ్వడం సూచన. పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు. వాహనముల వలన అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది.

 



మకర రాశి : ఈవారం మొత్తం మీద విదేశాల్లో ఉన్న బంధువులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది , వారినుండి రావాల్సిన సహకారం అందుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. మానసికపరమైన విషయాల్లో ఒకింత ఒత్తడికి లోనయ్యే అవకాశం ఉంది. చేపట్టిన పనులను మధ్యలో వదిలేసే ఆస్కారం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన సంప్రదింపులు చేయుటకు అవకాశం కలదు. అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. మిత్రులతో కలిసి చర్చలు చేయుటకు అవకాశం ఉంది.  విందులు అలాగే వినోదాల పట్ల మక్కువను కలిగి ఉంటారు. చిన్న చిన్న విషయాలకే అధికంగా సంతోషమును పొందుతారు.

 


కుంభ రాశి : ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో నూతన అవకాశాల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. నూతన పరిచయాల వలన నూతన ఆలోచనలు ఆరంభం అయ్యే అవకాశం కలదు. కుటుంబపరమైన విషయాల్లో కాస్త అసంతృప్తిని కలిగి ఉంటారు. గతంలో చేపట్టిన పనులకు గాను మీకు గుర్తింపు లభిస్తుంది. విదేశీప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. జీవితభాగస్వామితో చర్చలు చేయకండి. మిత్రులమూలన నూతన అవకాశాలు లభిస్తాయి.ఆర్థికపరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల దిశగా అడుగులు ముందుకు పడుతాయి. ఆత్మీయులను దూరం చేసుకోవడం వలన నష్టపోయే అవకాశం కలదు.

 

 

మీన రాశి :  ఈవారం మొత్తం మీద నిర్ణయాల పట్ల స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. పెద్దలతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. రావాల్సిన సహకారం అందుతుంది. ఉద్యోగంలో ఉత్సాహంగా ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. మిత్రులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. కాకపోతే నూతన పెట్టుబడుల విషయంలో ఏమాత్రం తొందరపాటు పనికిరాదు. అనుభవజ్ఞుల సూచనలు పాటించుట మంచిది. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. విదేశీ ప్రయత్నాలు చేయువారు ఊహించిన ఫలితాలు పొందుతారు.

 

     

మరిన్ని శీర్షికలు
chamatkaram