Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

'బిగ్‌బాస్‌' ఎన్టీఆర్‌ కాకపోతే ఇంకెవరు?

Ntr cross trp rate with  big boss

త్రిపాత్రాభినయంలో తెరకెక్కుతోన్న సినిమా 'జై లవకుశ'. ఈ సినిమాలో మూడు గెటప్స్‌లో కనిపిస్తున్నారు ఎన్టీఆర్‌. మూడు రకాల పాత్రల్లో నటించడం అంటే చిన్న విషయం కాదు. అందులోనూ ఒకటి నెగిటివ్‌ టచ్‌ ఉన్న పాత్ర. ఇలా మూడు రకాల ఎక్స్‌ప్రెషన్స్‌నీ, ఎమోషన్స్‌నీ ఒకేసారి ఒకే సినిమా కోసం పండిస్తున్నాడు ఎన్టీఆర్‌ .ఇది కాక బుల్లితెరపై ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'బిగ్‌బాస్‌' ప్రోగ్రాం కోసం మరో పాత్రని పోషిస్తున్నారు. 'బిగ్‌బాస్‌'లో ఆయన పాత్రకి, స్టేజ్‌పై ఎన్టీఆర్‌ చేస్తున్న సందడికి వస్తున్న రెస్పాన్స్‌ మామూలుగా లేదు. మొదట్లో డల్‌గా ప్రారంభమైన ఈ షో రెండు మూడు వారాల తర్వాత ఫుల్‌ జోష్‌నందుకుంది. వారాంతాల్లో ఎన్టీఆర్‌ విశ్వరూపం అదుర్స్‌ అనిపిస్తోంది. గత అరవై రోజులుగా 'బిగ్‌బాస్‌' బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తోంది.

ప్రతీరోజూ ఎంటర్‌టైన్‌ చేస్తోంది. బట్‌ ఇక బిగ్‌బాస్‌ సీజన్‌ ముగిసిపోనుంది. కేవలం 10 రోజులు మాత్రమే మిగిలి ఉంది ఈ సీజన్‌ ముగియడానికి. త్వరలోనే సెకండ్‌ సీజన్‌ కూడా స్టార్ట్‌ కానుందట. ఈ సీజన్‌లో హోస్ట్‌గా ఎవరుంటారనేదే కదా మీ సందేహం. కానీ రెండో సీజన్‌కీ హోస్ట్‌గా ఎన్టీఆరే వ్యవహరించనున్నారట. ఆయన తప్ప వేరే ఆప్షన్‌ లేదు బిగ్‌బాస్‌ నిర్వాహకులకు. అంత బాగా చేశాడు ఎన్టీఆర్‌ ఈ షో. ఇంకెవరూ ఈ స్థాయిలో రక్తి కట్టించలేరేమో. అందుకే టీఆర్‌పీ రేటింగ్స్‌ పరంగా ఇంతకు ముందు వరకూ ఉన్న రికార్డుల్ని కొల్లగొట్టేశాడు ఎన్టీఆర్‌ 'బిగ్‌బాస్‌'తో. 

మరిన్ని సినిమా కబుర్లు
spider record in tamilnadu