Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Ntr cross trp rate with  big boss

ఈ సంచికలో >> సినిమా >>

తమిళనాడలో 'స్పైడర్‌' రికార్డు

spider record in tamilnadu

మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతోన్న సినిమా 'స్పైడర్‌' రిలీజ్‌కి సిద్ధమైంది. మురుగదాస్‌ దర్శకుడు కావడంతో తమిళ సినీ పరిశ్రమతో పాటు, తెలుగులోనూ ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. తమిళనాడులో అత్యధిక ధియేటర్స్‌లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారట. తెలుగులో ఎలాగూ హయ్యెస్ట్‌ కౌంట్‌ ఉంటుంది. సూపర్‌ స్టార్‌ సినిమా కదా. ఇక ఓవర్సీస్‌లోనూ మహేష్‌బాబుకి క్రేజ్‌ ఎక్కువే. ఇకపోతే ఇదో బైలింగ్వల్‌ మూవీ. తమిళ వెర్షన్‌లోనూ మహేష్‌బాబు సొంత డబ్బింగ్‌తో ఆకట్టుకోనున్నారు.

తొలిసారిగా మహేష్‌ తమిళంలో నటిస్తున్న చిత్రమిది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది ఈ సినిమాలో. ఈ ఇద్దరి జంట తొలిసారి సందడి చేస్తున్న సినిమా కూడా ఇదే. ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ సూపర్‌గా ఉందని స్టిల్స్‌ చూస్తుంటే తెలుస్తోంది. స్పై కాప్‌గా నటిస్తున్నాడు మహేష్‌ ఈ సినిమాలో. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న సినిమా కావడంతో తమిళ ఫ్లేవర్‌నీ సమపాళ్లలో ఉంచారు ఈ సినిమాకి. తమిళ డైరెక్టర్‌ కమ్‌ హీరో ఎస్‌.జె.సూర్య ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మురుగదాస్‌ సినిమాల్లో ఎప్పటిలాగే ఉండే ఓ సామాజిక అంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. మహేష్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. దసరా కానుకగా ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ఈ నెల 27న 'స్పైడర్‌' ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరిన్ని సినిమా కబుర్లు
akhil with two heroins