Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
ladies be carefull

ఈ సంచికలో >> యువతరం >>

బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ ఎలాగంటే!

how to learn battery management

ఇదివరకటి రోజుల్లో బ్యాటరీ అంటే అర్థం వేరు, ఇప్పుడు దాని అర్థం, అవసరం వేరు. మార్కెట్‌లోకి వెళ్ళి ఓ బ్యాటరీని కొనుక్కుని వచ్చి, దాన్ని రేడియోలోనో టార్చిలైట్‌లోనో పెట్టి, కొన్నాళ్ళపాటు వాడి, బ్యాటరీ పనైపోగానే బయట పారెయ్యడమే. ఇప్పుడలా కాదు, రీచార్జబుల్‌ బ్యాటరీలు అందుబాటులోకి వచ్చాయి. కాలం మారింది, మొబైల్‌ ఫోన్ల యుగం. స్మార్ట్‌ ఫోన్ల ప్రపంచమిది. స్మార్ట్‌ ఫోన్‌ అయినా, ల్యాప్‌ టాప్‌ అయినా బ్యాటరీ లేనిదే పని జరగదు. కాబట్టి, బ్యాటరీ కెపాసిటీ ఏది ఎక్కువ? అని చూసుకుని మరీ ఆయా డివైజెస్‌ని కొనుగోలు చేస్తున్నాం. ఎంత కెపాసిటీ ఉన్న బ్యాటరీ అయినా, దాని సామర్థ్యాన్ని పూర్తిగా తెలుసుకుని, దానికి తగ్గట్టుగా వినియోగించుకోవడంలోనే ఆ బ్యాటరీ పనిచేసే విధానం ఆధారపడి ఉంటుంది. మళ్ళీ ఛార్జింగ్‌ పెట్టే అవసరం లేకుండా స్మార్ట్‌ ఫోన్‌ లేదా ల్యాప్‌టాప్‌ పనిచెయ్యాలని కోరుకోనివారు ఎవరైనా ఉంటారా? ఉండరు. కానీ, అది సాధ్యం కాదు. అందుకే బ్యాటరీని తెలివిగా వినియోగించుకోవాలి, దాని సామర్థ్యం తగ్గిపోకుండా వాడుకోవాలి. 
తిండి లేకపోయినా ఫర్లేదుగానీ స్మార్ట్‌ ఫోన్‌ లేకపోతే కుదరడంలేదిప్పుడు. కొంతమందికైతే స్మార్ట్‌ ఫోన్‌ లేకుండా కాలకృత్యాలు కూడా కష్టమే అయిపోతున్నాయి. మరి ఆ స్మార్ట్‌ ఫోన్‌ సమర్థవంతంగా పనిచేయాలంటే బ్యాటరీ బాగోగులు తప్పనిసరి కదా! దాన్నే బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ అంటాం. వినియోగించే సమయాన్ని బట్టి, దాని సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. అవసరం లేనప్పుడు పవర్‌ సేవర్‌ మోడ్‌లో మొబైల్‌ఫోన్లని వినియోగిస్తే చాలావరకు బ్యాటరీ సామర్థ్యం చెడిపోకుండా చూసుకోవచ్చు.

స్మార్ట్‌ ఫోన్‌ నిండా యాప్స్‌ని నింపేస్తే, బ్యాటరీ సామర్థ్యం దెబ్బ తింటుంది. చీటికీమాటికీ ఛార్జ్‌ చేసుకుంటూ పోయినా, బ్యాటరీ సంగతి త్వరగా ముగిసిపోతుంది. 95 పర్సంట్‌ వరకూ బ్యాటరీని ఛార్జ్‌ చేసుకుని, ఆ తర్వాత 30 శాతం వరకూ వినియోగించుకోవడం మంచిది. డెడ్‌ స్టోరేజీ వరకూ బ్యాటరీని వాడటం మీ బ్యాటరీకే కాదు, డివైజ్‌కీ, అలాగే మీ ఆరోగ్యానికీ ముప్పుతెచ్చే అవకాశముంటుంది. స్మార్ట్‌ ఫోన్లకు సంబంధించి పవర్‌ బ్యాంక్‌లను అందుబాటులో ఉంచుకోవడం బాగా ఉపకరిస్తుంది. కొన్ని ఫోన్లకు వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ అందుబాటులో ఉంది గనుక, దాన్ని వినియోగించడమూ సత్ఫలితాలనిస్తుంది. 

ల్యాప్‌టాప్‌ బ్యాటరీల విషయానికొస్తే, ఏడాది తర్వాత వాటి పనితీరు మందగించే అవకాశాలెక్కువ. సరిగ్గా బ్యాటరీని నిర్వహించగలిగితే మాత్రం రెండు మూడేళ్ళ వరకూ బ్యాటరీ లైఫ్‌కి ఇబ్బంది ఉండదు. విరివిగా వాడని వారు, రెండు మూడు రోజులకి ఓసారి అయినా బ్యాటరీ స్టేటస్‌ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఛార్జింగ్‌ నిల్‌ అయిపోతే, ఛార్జ్‌ చేయడం, ఆ ల్యాప్‌టాప్‌ని వినియోగించడం చేయాలి. వీలైతే డివైజ్‌ నుంచి బ్యాటరీని తొలగించి సేఫ్‌గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు బ్యాటరీ మేనేజ్‌మెంట్‌లోకి వస్తాయి. అత్యవసర సమయాల్లో డబ్బు కంటే బ్యాటరీ బ్యాకప్‌ విలువైనదిగా కన్పిస్తుంది గనుక, బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. 

వాడకంలో ఉన్నా ఏలకపోయిరాన ఛార్జిగ్‌ జాగ్రష్ట్ర్తగా చూసుకవాలి. సపోర్టింగా వపర్‌ బ్యాంనలు అందుకాబలో ఉన్నాయి పవర్‌ స్యోటర్‌ చేసుకోవచ్చు. ఎక్కడికైనా బయటివకి వచెలిలనప్పుడు పవర్‌ ఛార్‌నజ చేసుకరోవచ్చు దాంటోందిచ, అవసరం లేనప్పుడు స్మార్ట్‌ ఫోన్‌ ఆఫ్‌ మూడ్‌లో, ప్రీస్కన్‌ బ్రైట్‌నెస్‌ తగ్గించుకోవడం ద్వారా కూడా బ్యాటరీ సేవ్‌ అవుతంది. ఛార్జింగ్‌ కోసం వరిజనల్‌ ఛార్జర్స్‌ఏ వాడాలి. కొన్నింటికి వైర్‌సలెస్‌ ఆచర్స్‌ వస్తునాయనయి ల్యాప్‌ టాప్‌ వినియోగానికిపైకతే ఒకవేళ రెగ్యులర్‌గ వాడే వకాశాం లేకపోతే ఆన్‌ చేసి స్టాటస్‌చెక్‌ చేసుకోవాలి. ఎప్పుడే వంద శతం ఉండాల్సిన పనే లేదు. తంఒభై పర్సెంట్‌ ఉంటే చాలాఉ .ఫుల్‌ ఛార్జ్‌ అయ్యాక పవర్‌ మోడ్‌లో రన్‌ చపేయమడ్దు. 40 30 కంటే డౌన్‌ అయితే డెడ్‌ స్టోజ్‌ దాకా ఆగకుండా ఛార&ఇజట్‌ పెట్టకోవాలి.

మరిన్ని యువతరం