Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
mehereen so cute

ఈ సంచికలో >> సినిమా >>

అక్కినేని ఫైట్‌ - మామVs కోడలు

akkineni fight

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమా 'రాజుగారి గది - 2'. ఈ సినిమా ట్రైలర్‌ లేటెస్టుగా విడుదలైంది. ట్రైలర్‌లో దయ్యం గురించి డిస్కర్షన్‌ జరుగుతోంది. ఆ దయ్యం సమంత అని కూడా తెలిసిపోయింది. అయితే ట్రైలర్‌లో ఆ సస్పెన్స్‌ రివీల్‌ చేయకుండా ఉంటే బాగుండేది. ఈ సినిమాలో సమంత ఓ కీలక పాత్రలో నటిస్తోందనీ తెలుసు కానీ, అది దయ్యం పాత్రని ఇంతవరకూ తెలీదు. ట్రైలర్‌ వచ్చాక ఆ విషయం అర్ధమైపోయింది. అయితే సైకియాట్రిస్ట్‌ పాత్రలో నటిస్తున్న నాగార్జున దయ్యాన్ని వదిలించే పని పట్టాలి. అంటే సమంతకీ, నాగార్జునకీ మధ్య జరిగే పోరు ఈ సినిమా స్టోరీ అనుకోవాలి.

సమంత - నాగార్జున గతంలో 'మనం' చిత్రంలో నటించారు. తల్లీ కొడుకు పాత్రల్లో పోటీ పడి నటించారు ఆ సినిమాలో వీరిద్దరూ. అంటే ఫైట్‌ బాగానే ఉంది. ఈ ఫైట్‌లో దయ్యంగా సమంతని గెలిపిస్తాడా? లేక ఓ సైకియాట్రిస్ట్‌గా నాగ్‌ గెలుస్తాడో తెలియాలంటే తెర పైనే చూడాలి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా వచ్చే నెల 6న అక్కినేని వారింటి కోడలు కాబోతోంది సమంత. గోవాలో సమంత, నాగ చైతన్యల వివాహం ఘనంగా జరగనుంది. హిందూ, క్రిస్టియన్‌ సాంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరగనుంది. 

మరిన్ని సినిమా కబుర్లు
spider relese on 27th september