Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

స్పైడర్ చిత్రసమీక్ష

spider movie review

చిత్రం: స్పైడర్‌ 
తారాగణం: మహేష్‌బాబు, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, ఎస్‌.జె.సూర్య, భరత్‌ తదితరులు 
సంగీతం: హారిస్‌ జైరాజ్‌ 
సినిమాటోగ్రఫీ: సంతోష్‌ శివన్‌ 
దర్శకత్వం: ఏఆర్‌.మురుగదాస్‌ 
నిర్మాత: ఎన్‌.వి.ప్రసాద్‌, ఠాగూర్‌ మధు 
విడుదల తేదీ: 27 సెప్టెంబర్‌ 2017

క్లుప్తంగా చెప్పాలంటే

ఇంటెలిజెన్స్‌ ఆఫీస్‌లో పని చేసే ఉద్యోగి శివ (మహేష్‌ బాబు), ఫోన్‌ కాల్స్‌ ట్యాప్‌ చేస్తూ అనుమానాస్పదంగా అనిపించిన వాటి వివరాలను పై అధికారులకు చేరవేస్తుంటాడు. అయితే వాటిలో ఎవరైనా నిస్సహాయంగా ఏడ్చినా, హెల్ప్‌ కావాలని ఆశించినా స్పందించేలా సొంతంగా ఓ సాఫ్ట్‌వేర్‌ని కనిపెట్టి తన ల్యాప్‌ట్యాప్‌కి అనుసంధానం చేస్తాడు. అలాంటి వారికి వెంటనే స్పందించి సహాయం చేస్తుంటాడు శివ. ఆ క్రమంలోనే పైశాచికంగా హత్యలు చేస్తున్న ఓ సైకో కిల్లర్‌ భైరవ (ఎస్‌.జె.సూర్య) గురించి తెలుస్తుంది శివకి. ఇంతకీ ఆ భైరవ ఎవరు? ఎందుకు అంత దారుణంగా హత్యలు చేస్తుంటాడు? అత్యంత ప్రమాదకరమైన అతన్ని శివ అంతమొందించాడా? లేదా? అనేది తెర పైనే చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే

మహేష్‌ కటౌట్‌కి తగ్గట్లుగా ఇంటెలిజెన్స్‌ ఉద్యోగి పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. కథకి తగ్గట్లుగా తన స్టైలిష్‌, అండ్‌ ఇంటెన్సివ్‌ శైలితో ఆకట్టుకున్నాడు. దర్శకుడి ఆలోచనకు తగ్గట్లుగా తనని తాను మలచుకున్నాడు. ఇంతవరకూ మహేష్‌ పోషించిన పాత్రల కన్నా విభిన్నమైన పాత్ర చిత్రీకరణ ఈ సినిమాలో శివ పాత్ర. ఆ పాత్రకి మురుగదాస్‌ మహేష్‌నే ఎందుకు ఎంచుకున్నాడో అర్ధమవుతుంది సినిమా చూస్తే. అంత చక్కగా తన పాత్రకి న్యాయం చేశాడు మహేష్‌. చాలా స్టైలిష్‌, అండ్‌ రొమాంటిక్‌ లుక్‌లో ఆయన గెటప్‌ సూపర్బ్‌ అనిపించింది. 
రకుల్‌ పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేనప్పటికీ తన ఎక్స్‌పీరియన్స్‌తో, యాక్టింగ్‌ టాలెంట్‌తో ఉన్నంతలో బాగా నటించింది. అలాగే యాజ్‌ యూజ్‌వల్‌ అందంగా కనిపించింది. మహేష్‌ - రకుల్‌ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్‌ అయ్యింది. సాంగ్స్‌లో చాలా స్టైలిష్‌గా కనిపించింది. జోష్‌ఫుల్‌గా, యాక్టివ్‌గా రకుల్‌ కనిపించింది.

విలన్‌గా నటించిన ఎస్‌.జె.సూర్య పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. విలన్‌ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే, హీరో పాత్ర అంతగా ఎలివేట్‌ అవుతుందని నమ్మే డైరెక్టర్స్‌లో మురుగదాస్‌ మొదటి స్థానంలో ఉంటారు. అందుకే ఆ పాత్రకి ఎస్‌.జె.సూర్యని ఎంచుకోవడంలోనే ఆ పాత్ర ప్రాధాన్యత ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. క్రూరమైన సైకో కిల్లర్‌ పాత్రలో సూర్య జీవించేశాడు. మరో యంగ్‌ హీరో భరత్‌ పాత్ర కూడా బాగుంటుంది. రక్తి కట్టించే సన్నివేశాల్లో భరత్‌ బాగా నటించాడు.

కథ, కథనం పరంగా దర్శకుడు మురుగదాస్‌ తనకున్న అనుభవంతో కొత్తదనం చూపించే ప్రయత్నం చేశాడు. డైలాగ్స్‌ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కొన్ని సీన్స్‌ చాలా ఉత్కంఠగా అనిపిస్తాయి. మరి కొన్ని సీన్స్‌ తేలిపోతాయి. హారిస్‌ జైరాజ్‌ మ్యూజిక్‌ కొత్తగా ఉంది. విజువల్‌గా చాలా స్టైలిష్‌గా అనిపించాయి. సంతోష్‌ శివన్‌ కెమెరా పనితనం బాగుంది. చాలా రిచ్‌గా కనిపించాయి లొకేషన్స్‌. విజువల్‌ ఎఫెక్ట్స్‌ కథా బలానికి తగ్గట్లుగానే సహజంగా అనిపించాయి. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి. ఎడిటింగ్‌ అక్కడక్కడా అవసరం అనిపిస్తుంది.

మంచి పాయింట్‌ని బేస్‌ చేసుకుని సినిమా తెరకెక్కించినప్పటికీ, సెకెండాఫ్‌కి వచ్చేసరికి కథలో వేగం తగ్గుతుంది. మెసేజ్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు తీసినా, కమర్షియల్‌ టచ్‌ అద్దడం మురుగదాస్‌ ప్రత్యేకత. సన్నివేశాల్లో ఉత్కంఠ ఆయన మరో ప్రత్యేకత. అయితే ముందు ఏం జరిగిపోతుందో తెలిసిపోవడం క్రమక్రమంగా ప్రేక్షుడు రిలీఫ్‌ అయ్యేలా చేస్తుంది. అదే ఈ సినిమాకి మైనస్‌ పాయింట్‌గా చెప్పుకోవాలి. విజువల్స్‌ ఓకే అనిపించినా, ఇంకా చాలా ఎక్స్‌పెక్ట్‌ చేస్తాడు సగటు ప్రేక్షకుడు. మురుగదాస్‌ - మహేష్‌ కాంబినేషన్‌పై ఉన్న క్రేజ్‌కి తగ్గట్టుగా అయితే సినిమా రూపొందలేదనిపిస్తుంది. కొన్ని సీన్స్‌ బాగా ఎలివేట్‌ అయితే, కొన్ని సీన్స్‌ ఆడియన్స్‌ని రిలాక్స్‌ చేసేస్తాయి. కొత్త బ్యాక్‌డ్రాప్‌, కొత్త తరహా కథతో ముందుకు రావడం అభినందనీయమే అయినా కమర్షియల్‌ ఔట్‌పుట్‌ పరంగా కొంత నిరాశపరిచే అవకాశముంది.

ఒక్క మాటలో చెప్పాలంటే

స్పైడర్‌ - జస్ట్‌ ఓకే

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
mahanubhavudu movie review