Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
ntr emotional talks

ఈ సంచికలో >> సినిమా >>

'బిగ్‌బాస్‌' అంటే ఎన్టీఆర్‌ మాత్రమే!

big boss successful journey completed

బుల్లితెరపై కనీ వినీ ఎరుగని రీతిలో ప్రారంభమైన బిగ్‌ రియాల్టీ షో 'బిగ్‌బాస్‌'. భారీ అంచనాలతో ప్రారంభమైన ఈ రియాల్టీ షో 70 రోజులు సక్సెస్‌ఫుల్‌గా జర్నీని ముగించుకుంది. 14 మంది సెలబ్రిటీస్‌తో స్టార్ట్‌ అయ్యి, రెండు వైల్డ్‌ కార్ట్‌ ఎంట్రీలు మొత్తం 16 మంది హౌస్‌మేట్స్‌తో ఈ షో విజయవంతంగా ప్రసారం అయ్యింది. వారానికో ఎలిమినేషన్‌తో ఫైనల్‌కొచ్చేసరికి 'బిగ్‌బాస్‌' విజేతగా నటుడు శివబాలాజీని 'బిగ్‌బాస్‌' ట్రోపీ వరించింది. ఎంతో ఎమోషనల్‌, ఇంకెంతో ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఊహించని మలుపులతో సాగిన 'బిగ్‌బాస్‌' షో బుల్లితెర ప్రేక్షకుల్ని వింత లోకంలోకి తీసుకెళ్లింది.

బిగ్‌బాస్‌ షోకి హోస్ట్‌గా వ్యవహరించిన అసలు సిసలు బిగ్‌బాస్‌ ఎన్టీఆర్‌తో ప్రేక్షకులకు వీడిపోని అనుబంధం ఏర్పడింది. సినిమాలో హీరోగా ఎన్టీఆర్‌ అంటే ఉన్న అభిమానం డబ్బులు పెట్టి ధియేటర్‌కి వెళ్తే వస్తుంది. కానీ 'బిగ్‌బాస్‌' షో ద్వారా మన నట్టింట్లోకే ఎన్టీఆర్‌ వచ్చేశాడు. వారానికి రెండు సార్లే వచ్చినా కానీ ఆ రెండు రోజుల్లో ఎన్టీఆర్‌ పలకరించే ఆప్యాయపు పలకరింపులు, ఆయన పంచే ఎంటర్‌టైన్‌మెంట్‌ అంతా రియల్‌గా జనానికి కనెక్ట్‌ అయ్యింది. అందుకే ఈ షో అయిపోయింది అంటే నమ్మశక్యం కావట్లేదు ఆడియన్స్‌కి. ఎన్టీఆర్‌ కూడా షో చివరిలో అదే ఫీలింగ్‌తో భావోద్వేగానికి లోనయ్యారు. తనలోని రియల్‌ టాలెంట్‌ని బయటికి తెచ్చేందుకు ఈ 'బిగ్‌బాస్‌' షో చాలా ఉపయోగపడిందని ఎన్టీఆర్‌ అన్నారు. టీఆర్‌పీ రేటింగ్స్‌లోనూ 'బిగ్‌బాస్‌' ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా రికార్డులు నమోదు చేసింది. అందుకే అసలు సిసలు 'బిగ్‌బాస్‌ అంటే ఎన్టీఆర్‌' అంతే! 

మరిన్ని సినిమా కబుర్లు
nagachaitanya , samanta wedding is  on october 6th