Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
spider movie review

ఈ సంచికలో >> సినిమా >>

మహానుభావుడు చిత్రసమీక్ష

mahanubhavudu movie review

చిత్రం: మహానుభావుడు 
తారాగణం: శర్వానంద్‌, మెహరీన్‌ కౌర్‌ పిర్జాదా, వెన్నెల కిషోర్‌, నాజర్‌, రఘుబాబు, భద్రం తదితరులు. 
సంగీతం: ఎస్‌ఎస్‌ థమన్‌ 
సినిమాటోగ్రఫీ: నిజార్‌ షఫి 
దర్శకత్వం: మారుతి 
నిర్మాతలు: వంశీ, ప్రమోద్‌ 
నిర్మాణం: యువి క్రియేషన్స్‌ 
విడుదల తేదీ: 29 సెప్టెంబర్‌ 2017 

క్లుప్తంగా చెప్పాలంటే 
ఆనంద్‌ (శర్వానంద్‌)కి ఓసీడీ అనే డిజార్డర్‌ ఉంటుంది. దాని ప్రభావంతోనే ఆనంద్‌ అతిశుభ్రత కోసం పరితపిస్తుంటాడు. తుడిచిందే మళ్ళీ మళ్ళీ తుడవడం, షేక్‌ హ్యాండ్‌ ఎవరికైనా ఇవ్వాలంటే ఒకటికి వందసార్లు ఆలోచించడం ఇలాంటివన్నీ ఆ అతి జాగ్రత్త లక్షణాలే. ఈ అతిశుభ్రత ఆనంద్‌కి, మేఘన (మెహరీన్‌) పరిచయమవుతుంది. ఆమెకీ శుభ్రత అంటే ఒకింత ఎక్కువ ఇష్టమే. అలా ఇద్దరి అభిరుచులూ కలుస్తాయి. ఇద్దరి మధ్యా ప్రేమ పుట్టుకొస్తుంది. అయితే ప్రేమకి ఓ కండిషన్‌ పెడ్తుంది మేఘన. తన తండ్రిని ఒప్పించాలన్నదే ఆ కండిషన్‌. ఈ పరీక్షలో ఆనంద్‌ విజయం సాధించాడా? అతి శుభ్రత ఆనంద్‌, మేఘన తండ్రి (నాజర్‌)కి నచ్చాడా? లేదా? తెరపై చూడాల్సిందే. 

మొత్తంగా చెప్పాలంటే 
శర్వానంద్‌ మంచి నటుడు. ఏ పాత్రలో అయినా ఒదిగిపోతాడు. బరువైన పాత్రల్లో ఎంత బాగా ఇమిడిపోతాడో, చలాకీగా కన్పించే పాత్రల్లోనూ అంతే. ఈ సినిమాలోనూ శర్వానంద్‌ ఆనంద్‌ పాత్రలో జీవించేశాడు. కామెడీ టైమింగ్‌తో మెప్పించాడు. డిఫరెంట్‌ బాడీ లాంగ్వేజ్‌తో, క్లాస్‌ లుక్‌తో శర్వా అదుర్స్‌ అన్పిస్తాడు. 

మెహరీన్‌ చాలా క్యూట్‌గా వుంటుంది. ఈ సినిమాలో ఇంకా క్యూట్‌గా అనిపించింది. నేచురల్‌ హాట్‌ అప్పీల్‌ మెహ్రీన్‌ సొంతం. సినిమాకి అవసరమైనంత మేర పెర్ఫామెన్స్‌తో మెప్పించింది. మంచి మార్కులే పడ్తాయి మెహ్రీన్‌ నటనకి. తెరపై శర్వా - మెహ్రీన్‌ కాంబినేషన్‌ బాగా సెట్‌ అయ్యింది. ఇద్దరి మధ్యా ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ బాగా కుదిరింది. 

కామెడీ నేపథ్యంలో సాగే సినిమా కావడం, వెన్నెల కిషోర్‌కి మంచి పాత్ర దక్కడంతో తన టాలెంట్‌ అంతా ప్రదర్శించేశాడు. మిగతా పాత్రల్లోనూ ఆయా నటీనటులు చాలావరకు ఎంటర్‌టైన్‌ చేయడాఇకి ప్రయత్నించారు. నాజర్‌ అనుభవం సినిమాకి ప్లస్‌ అయ్యింది. 

కథ పరంగా కొత్తదనం ఆశించలేం. ఎంటర్‌టైన్‌మెంట్‌ నేపథ్యంలో తెరకెక్కించిన సినిమా ఇది. కథనం వేగంగా సాగడం సినిమాకి ప్లస్‌ పాయింట్‌. ఎంటర్‌టైన్‌మెంట్‌తోనే ఆ వేగం వచ్చింది. డైలాగ్స్‌ నవ్విస్తాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. పాటలు ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా అంతే. ఎడిటింగ్‌ ఒకటి రెండు సందర్భాల్లో అవసరం అనిపిస్తుంది. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి. ఎక్కడా నిర్మాణంలో రాజీ పడని వైనం ప్రతి ఫ్రేమ్‌లోనూ కన్పిస్తుంది. 

హీరో ఓసీడీ అనే డిజార్టర్‌తో బాధపడటం అనే సరదా పాయింట్‌ చుట్టూనే దర్శకుడు కథ అల్లుకున్నాడు. తన బలం ఎంటర్‌టైన్‌మెంట్‌ కావడంతో పూర్తిగా దాని మీదనే బేస్‌ అయ్యాడు దర్శకుడు. ఎంటర్‌టైనింగ్‌ సీన్స్‌ రాసుకుంటూ సినిమాని వేగంగా నడిపించేయగలిగాడు. శర్వానంద్‌ నటన, మెహ్రీన్‌ గ్లామర్‌, కమెడియన్ల తోడ్పాటు - ఇవన్నీ దర్శకుడికి కలిసొచ్చాయి. చిన్న సినిమాలతో పెద్ద విజయం అందుకోవడమెలాగో దర్శకుడు మారుతికి బాగా తెలుసు. ఆ వ్యూహం ఇక్కడా వర్కవుట్‌ అయ్యిందనే చెప్పాల్సి ఉంటుంది. ఫస్టాఫ్‌, సెకెండాఫ్‌ అంతా ఎంటర్‌టైనింగ్‌గా సాగిపోతుండడంతో, ఈ దసరా పండక్కి ఓ మంచి సరదా సినిమా చూశామన్న ఫీలింగ్‌ ఆడియన్స్‌కి కలగడం ఖాయం. ఫ్యామిలీ చూడదగ్గ సినిమా, పూర్తిస్థాయి వినోదం ఈ సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌. ఓవరాల్‌గా ఓ మంచి విజయాన్ని ఈ 'మహానుభావుడు' అందుకునేలానే ఉన్నాడు. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
వినోదం పండించడంలో మహానుభావుడే 
అంకెల్లో చెప్పాలంటే: 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
varma selection very special