Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

రాజుగారి గది 2 చిత్రసమీక్ష

rajugari gadi 2 movie review

చిత్రం: రాజుగారి గది-2
తారాగణం: నాగార్జున, సమంత, సీరత్‌కపూర్‌, నరేష్‌, వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌, అశ్విన్‌, షకలక శంకర్‌, అవినాష్‌ తదితరులు.
సంగీతం: తమన్‌
సినిమాటోగ్రఫీ: ఆర్‌. దివాకరన్‌
దర్శకత్వం: ఓంకార్‌
నిర్మాత: ప్రసాద్‌ వి పొట్లూరి
నిర్మాణం: పివిపి సినిమా - మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
విడుదల తేదీ: 13 అక్టోబర్‌ 2017


క్లుప్తంగా చెప్పాలంటే :
అశ్విన్‌ (అశ్విన్‌), కిషోర్‌ (వెన్నెల కిషోర్‌), ప్రవీణ్‌ (ప్రవీణ్‌) స్నేహితులు. రాజుగారి రిసార్ట్‌ని కొనుగోలు చేస్తారు ఈ ముగ్గురూ. అయితే రిసార్ట్‌లో ఓ దెయ్యం వారిని భయపెడ్తుంటుంది. ఏం చేయాలి? అని ఆలోచిస్తూ, చర్చి ఫాదర్‌ నరేష్‌ని సంప్రదిస్తే, మెంటలిస్ట్‌ రుద్ర (నాగార్జున)ని కలవమనే సూచన వారికి లభిస్తుంది. రుద్రని రంగంలోకి దించుతారు. కళ్ళలో చూస్తూ, మనసులో ఏముందో చెప్పగల రుద్ర, తొలుత సుహానిస (సీరత్‌కపూర్‌)ని అనుమానిస్తాడు. ఆ తర్వాత అమృత (సమంత) ఆత్మ, ప్రతీకారం కోరుకుంటోందని గుర్తిస్తాడు. అమృత ఎవరు? రాజుగారి రిసార్ట్‌కీ ఆమెకీ సంబంధమేంటి? అమృత ప్రతీకారం ఎవరి మీద? తదితర ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది.


మొత్తంగా చెప్పాలంటే:
మెంటలిస్ట్‌ పాత్రలో నాగార్జున ఒదిగిపోయారు. చాలా ఇష్టపడి చేసిన పాత్ర అని పలు సందర్భాల్లో నాగార్జున చెప్పడం వెనుక వాస్తవం ఈ సినిమాలో కన్పిస్తుంది. హావభాఆలతో, తనదైన డైలాగ్‌ మాడ్యులేషన్‌తో రుద్ర పాత్రకు ప్రాణం పోశారాయన. నాగ్‌ అప్పీయరెన్స్‌ ఈ సినిమాకి కొండంత బలాన్నిస్తుందనడం నిస్సందేహం. లా చదువుకున్న అమ్మాయి పాత్రలో సమంత చాలా బాగా చేసింది. ఇంతవరకు చేయని కొత్త పాత్రల్లో నాగార్జున, సమంత చాలా చాలా బాగా చేశారు. చాలా ఇష్టపడి చేసినట్లుగా అనిపిస్తుంది.

మిగతా పాత్రల్లో సీరత్‌పూర్‌ గ్లామరస్‌గా కనిపించింది. ఓవర్‌ డోస్‌ గ్లామర్‌ ప్రదర్శించినా, నటన పరంగా ఆమె కూడా ఆకట్టుకుంటుంది. అశ్విన్‌, వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌, షకలక శంకర్‌ నవ్వులు పూయిస్తారు.

ఈ తరహా కథల్ని కాస్త అటూ ఇటూగా తెలుగు తెరపై చాలానే చూసేశాం. కొన్ని సినిమాల షేడ్స్‌ ఇందులో కన్పిస్తాయి. అయినప్పటికీ దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ కొత్తగా అన్పిస్తుంది. పాత్రల్ని తీర్చిదిద్దిన వైనం. సన్నివేశాల్ని నడిపిన వైనం ఆకట్టుకుంటుంది. డైలాగ్స్‌ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగా కుదిరింది. మ్యూజిక్‌ బాగుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి అదనపు బలం. నిర్మాణపు విలువల పరంగా ఎక్కడా రాజీ పడని వైనం కనిపిస్తుంది. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమాకి ప్లస్‌ అయ్యాయి.

ఫస్టాఫ్‌ ఒకింత సరదాగానే సాగిపోతుంది. అయినప్పటికీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పరంగా ఇంకాస్త డోస్‌ పెంచితే బాగుండేదనిపిస్తుంది. థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో బాగానే అనిపిస్తుంది. సెకెండాఫ్‌కి వచ్చేసరికి ఎమోషనల్‌ కంటెంట్‌ ఎక్కువవుతుంది. దాంతో కథలో వేగం తగ్గినట్లనిపించినా ఆ ఎమోషనల్‌ కంటెంట్‌తో ఆడియన్స్‌ బాగానే కనెక్ట్‌ అవుతారు. ఓవరాల్‌గా ఓ మంచి ప్రయత్నమైతే దర్శకుడి నుంచి జరిగినందుకు అభినందించాలి. హర్రర్‌ జోనర్‌ అనే ప్రచారం జరిగినా, కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమానే. ఎంటర్‌టైన్‌మెంట్‌ పరంగా ఇంకాస్త ఫోకస్‌ పెట్టి ఉంటే అదనపు బోనస్‌ అయి ఉండేది.


ఒక్క మాటలో చెప్పాలంటే : రాజుగారిగది - ఎమోషనల్‌ టచ్‌ ఉన్న థ్రిల్లర్‌

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka