Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chi.la.sow  in rahul and sushant

ఈ సంచికలో >> సినిమా >>

'లైఫ్‌ విత్‌ గేమ్‌' ఆడేందుకు రెడీనా!

life with game

ప్రయోగాత్మక చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తున్న తరుణంలో డైరెక్టర్‌ పరుచూరి మురళి ఓ కొత్త సినిమాకి శ్రీకారం చుట్టారు. 'ఆటగాళ్లు' అనే టైటిల్‌ని ఈ సినిమాకి పెట్టడం వెనక ఆంతర్యం ఏంటో సినిమా చూస్తే తెలుస్తుందట. సీనియర్‌ నటుడు జగపతిబాబు, యంగ్‌హీరో నారా రోహిత్‌ ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులు. హీరోలంటే హీరోలే, విలన్స్‌ అంటే విలన్స్‌ అన్నట్లుగా వీరి క్యారెక్టర్స్‌ ఉండబోతున్నాయట. అంటే ఎంత డిఫరెంట్‌ క్యారెక్టరైజేషనో అర్ధం చేసుకోవచ్చు. జీవితంతో ఆటాడుకుంటే ఎలా ఉంటుందో ఈ సినిమా ద్వారా కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్‌. విలక్షణ నటుడు జగపతిబాబు, విలక్షణ కథలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ నారా రోహిత్‌. ఈ ఇద్దరూ కలిసి యుద్ధం చేస్తే ఎలా ఉండబోతుంది. అదే మా సినిమా అంటున్నారు 'ఆటగాళ్లు' టీమ్‌. ఇదో ప్రయోగాత్మక చిత్రం.

అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకునేలా ఉంటుందట. అయితే ఈ సినిమాకి వీరిద్దరే హీరోలు అంటే పొరపాటే. ఇంకో ఇద్దరున్నారట. వాళ్లెవరో ప్రస్తుతానికి సస్పెన్స్‌ అంటోంది చిత్ర యూనిట్‌. గతంలో హ్యాండ్సమ్‌ హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్‌ మనసు దోచుకున్న జగపతిబాబు ఈ జనరేషన్‌ హీరోస్‌కి తండ్రిగానూ, విలన్‌గానూ ఇతర క్యారెక్టర్‌ ఆర్టిస్టు పాత్రల్లో తనదైన ముద్ర వేశారు. ఈ మధ్య 'పటేల్‌ సర్‌' సినిమాతో లేటు వయసులో సిక్స్‌ ప్యాక్‌ హీరోగానూ సత్తా చాటారు. అయితే వీటన్నింటికీ విభిన్నమైన క్యారెక్టర్‌లో సరికొత్త జగపతిబాబుని 'ఆటగాళ్లు' సినిమా ద్వారా చూడబోతున్నామని ఆయన అన్నారు. ఇక నారా రోహిత్‌ సంగతి సరే సరి. సినిమా సినిమాకీ విలక్షణతను వెతుక్కుంటూ ఉంటాడాయన. చూద్దాం ఈ డిఫరెంట్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ డిఫరెంట్‌ మూవీ ఎలా ఉండబోతోందో!

మరిన్ని సినిమా కబుర్లు
shalini pande turns career