Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
life with game

ఈ సంచికలో >> సినిమా >>

'అర్జున్‌రెడ్డి'తో ఆమె దశ అలా తిరిగేసిందోచ్‌

shalini pande turns career

'అర్జున్‌రెడ్డి' లాంటి సినిమాల్లో నటిస్తే, హీరోయిన్‌గా కెరీర్‌ ఇక అక్కడితో ఆగిపోయినట్లేనని చాలామంది ఆ సినిమా విడుదలకు ముందు హీరోయిన్‌ షాలిని పాండేపై అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఎవరూ ఊహించని విజయం సాధించింది 'అర్జున్‌రెడ్డి'. హీరో విజయ్‌ దేవరకొండతో సమానంగా హీరోయిన్‌ షాలిని పాండేకి ఈ సినిమా గుర్తింపు తెచ్చిపెట్టింది. దాంతో ఇప్పుడీ భామ క్లౌడ్‌ నైన్‌లో తేలిపోతోంది. తమళ సినిమా '100 పర్సంట్‌ కాదల్‌'లో హీరోయిన్‌గా ఎంపికైన షాలిని పాండేకి, మలయాళం నుంచీ ఆఫర్లు వస్తున్నాయి. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా రూపొందుతోన్న సినిమాలో షాలిని పాండే హీరోయిన్‌గా ఎంపికైందని సమాచారం.

మలయాళ, తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇంకో వైపున టాలీవుడ్‌ నుంచీ యంగ్‌ హీరోలు షాలిని కోసం పోటీ పడుతున్నారట. కెరీర్‌లో ఇన్ని అవకాశాల్ని తాను ఊహించలేదంటున్న షాలిని పాండే, 'అర్జున్‌రెడ్డి' విడుదలకు ముందు చాలామంది తనను భయపెట్టేశారనీ సినిమా మీద నమ్మకంతో ధైర్యంగా చేశాననీ, అదే ఇప్పుడు తనను హీరోయిన్‌గా నిలబెట్టిందని హర్షం వ్యక్తం చేస్తోంది. 'అర్జున్‌రెడ్డి' కన్నా గొప్ప విజయాలు తన కెరీర్‌లో వచ్చినా ఎప్పటికీ ది బెస్ట్‌ ఫిలిం మాత్రం 'అర్జున్‌రెడ్డి' మాత్రమే అవుతుందని చెప్పింది షాలిని పాండే. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam