Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Veg Pulao in Rice Cooker!

ఈ సంచికలో >> శీర్షికలు >>

లేటెస్ట్ ఫ్యాషన్ - ..

latest fashion

ఫ్యాష‌న్ రోజుకో కొత్త సృష్టి. ఎంత వెరైటీగా ఉంటే అంత ఫ్యాష‌న్ గా ఉన్న‌ట్లు. ఒక‌ప్పుడు అమ్మాయిలు.. ఇంద్ర‌ధ‌న‌స్సులా ఎన్ని రంగులుంటే.. అన్ని రంగుల బ‌ట్టలు వేసుకుని మురిసిపోయేవారు. కానీ.. ఇప్పుడు ఆ సీన్ మారింది. ఆ ఫ్యాష‌న్ కి ఓ పేరు వ‌చ్చి చేరింది. లోకం పోకడ మారుతోంది... యువతే కాదు పిల్లలు, పెద్దలూ స్టెలిష్‌గా కన్పించాలని కోరుకుంటున్నారు..

వస్త్రధారణలో వైవిధ్యం కావాలనుకుంటున్నారు...ట్రెండ్‌కు తగ్గట్టూ దుస్తుల తయారీ సంస్థలు నయా డిజైన్లను ఆవిష్కరిస్తున్నాయి. ఇది ఫ్యాషన్ రంగానికి లాభాల పంట పండిస్తుంటే.. యువ డిజైనర్లకు చేతినిండా పని దొరుకుతోంది.. ఫ్యాషన్ వేర్ కంపెనీల్లో నిరుద్యోగులకు కొలువులు లభిస్తున్నాయి. 

కొందరు సొంతంగా బొటిక్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు. రెడీమేడ్ దుస్తుల్లో ఉండే అసౌకర్యం, చిన్న చిన్న లోపాలు భరించలేని వాళ్లు ఇప్పుడు నేరుగా డిజైనర్లతోనే కావాల్సిన దుస్తులు రూపొందించుకుంటున్నారు. రెడీమేడ్ షాపుల్లో ఉండే కామన్ ఫీచర్సే కాకుండా కష్టమైజ్డ్ ఫీచర్స్‌తో ఇష్టాలకు తగ్గట్లుగా దుస్తులు కుట్టించుకుంటున్నారు.

మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్లుగా రెడీమేడ్ దుస్తుల వ్యాపార సంస్థలూ కామన్ ఫీచర్స్‌తో కాకుండా విన్నూత తరహాలో దుస్తుల్ని డిజైన్ చేయిస్తున్నాయి. డిజైనర్ వేర్, ఎథినిక్ వేర్, వెడ్డింగ్ కలెక్షన్స్‌తో విశాలమైన షోరూంల్లో అందమైన డిజైనర్ వేర్‌ని ప్రదర్శిస్తున్న ఈ కంపెనీలు స్థానికుల అభిరుచులు తెలుసుకుని ఉత్పత్తుల్ని రూపొందించట్లేదు. స్థానికులకే ఫ్యాషన్ డిజైనర్ ఉద్యోగాలిచ్చి ఈ దుస్తులు రూపొందిస్తున్నాయి. మనవాళ్లు పండుగలు, 
వివాహ సందర్భాల్లో ఎక్కువగా 

సంప్రదాయం ఉట్టిపడే దుస్తులనే ఇష్ట పడతారు.  వీటిని కార్పొరేట్ సంస్థలు రెడీమేడ్‌గా తయారు చేసినా, ఇవి మనకోసమే రూపొందించారా? అన్నట్లుగా ఉంటా యి. అదే.. మోనోక్రోమాటిక్. అంటే ఒకే రంగులో ఉండే వ‌స్త్రాల‌ను ఎంచుకోవ‌డం.అయితే.. ఇందులోనూ వేరియేష‌న్స్ చూపొచ్చు. అవేంటంటే..

మామూలుగా గ్రీన్ క‌ల‌ర్ లెహంగా తీసుకుంటే.. దీనికి మ్యాచింగ్ లోనూ కాస్తా ముదురు రంగులో టాప్ ని ప్రిఫెర్ చేయొచ్చు. అంటే.. బాట‌మ్ లైట్ క‌ల‌ర్ లో ఉంటే అదే క‌ల‌ర్ లో కాస్తా థిక్ క‌ల‌ర్ ని టాప్ కి ప్రిఫ‌ర్ చేయొచ్చు. ఇక దుప‌ట్టాను మాత్రం లేత రంగులో ఎంచుకుంటేనే బావుంటుంది.

వీటిమీదికి మ్యాచింగ్ యాక్సెస‌రీస్ కొస్తే.. సిల్వ‌ర్ క‌ల‌ర్ లేదా యాంటిక్ క‌ల‌ర్ వి ఎంచుకోవాలి. చీర‌ల‌కు కూడా ఇదే ఫాలో అవ్వండి.. ఇంకెందుకు ఆల‌స్యం. ఇలా పాటించండి.. అలా అంద‌రీ దృష్టిని ఆక‌ర్షించండి.  

మరిన్ని శీర్షికలు