Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
NTR movie pawan star clap

ఈ సంచికలో >> సినిమా >>

'రంగస్థలమ్‌' ఆ రోజుల్లోకి వెళ్తున్నామ్‌

rangasthalam so defference

 సుకుమార్‌ని మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌గా అనుకోవాలి తెలుగు డైరెక్టర్స్‌లో. కాంప్లికేటెడ్‌ సబ్జెక్ట్స్‌ని ఎంచుకున్నప్పటికీ, ప్రతీ పాయింట్‌నీ చాలా జాగ్రత్తగా డీల్‌ చేస్తాడు సుకుమార్‌. స్వతహాగా లెక్కల మాస్టారు కావడంతో ఆ లెక్కల్ని సినిమా మేకింగ్‌లో బాగా వాడుతుంటాడు సుకుమార్‌. అందుకే సుకుమార్‌ సినిమాలన్నీ చాలా కొత్తగా, డిఫరెంట్‌గా ఉంటాయి. అలాగే 'రంగస్థలమ్‌' సినిమా కూడా చాలా కొత్తగా, డిఫరెంట్‌గా ఉండే సినిమా. అన్నింటికీ మించి ఇదో ప్రయోగాత్మక చిత్రం. ఇప్పటి కమ్యూనికేషన్‌ వ్యవస్థకి పూర్తిగా దూరంగా ఉన్న కాలం నాటి స్టోరీ ఈ చిత్రం. ఎలాంటి కమ్యూనికేషన్‌ లేని ప్రాంతానికి వెళితే, ఈ రోజుల్లో ఎవరైనా తట్టుకోగలరా? కాస్సేపు ఇంటర్నెట్‌లు, మొబైల్‌ ఫోన్స్‌ పని చేయడం మానేస్తే ఆ పరిస్థితిని ఊహించుకోగలమా. చాలా కష్టం. కానీ సుకుమార్‌ మనల్ని ఆ ప్రపంచంలోకి తీస్కెళ్లిపోతున్నాడు

ఈ సినిమా ద్వారా. టెక్నాలజీని, మ్యూనికేషన్‌నీ మర్చిపోయి, పాత కాలంలోకి వెళ్లిపోయి కొత్త అనుభూతిని పొందుతున్నారట ఈ సినిమాలోని నటీనటులు. అదే అనుభూతి ఈ సినిమాతో, చూసే ప్రేక్షకుడికీ కలగనుందట. షూటింగ్‌ అయిపోయాక ఆ మూడ్‌లోంచి బయటికి రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుందట ప్రతీ ఆర్టిస్టుకి. అంతలా ఆర్టిస్టులను కన్విన్స్‌ చేసేశాడు సుకుమార్‌. ఒక్కసారి షూటింగ్‌ లొకేషన్‌లోకి అడుగుపెడితే, ఆ వాతావరణం నుండి బయటికి రావడానికి కొంచెం టైం పడుతోందట ఆర్టిస్టులకి. అంతగా ఆ పరిసరాలను మార్చేశాడు సుకుమార్‌. అంత అద్భుతంగా లొకేషన్స్‌ని డిజైన్‌ చేయిస్తున్నాడు. సహజ సిద్ధమైన లొకేషన్లు, వాటిని తలపించేలా సెట్లు, వీటిన్నింటినీ మించి నటీనటుల నేచురల్‌ యాక్టింగ్‌ టాలెంట్‌ ఇవన్నీ 'రంగస్థలమ్‌' సినిమాని తెలుగు సినిమాకే ఓ ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టనున్నాయట. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam