Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

జయజయదేవం - - డా. ఎస్. జయదేవ్ బాబు

..

రాజు: గుడి తలుపులు తాళం వేసుండగా, అమ్మవారి మెడలోని రత్నాల హారం మాయమైంది ఎలా?
మంత్రి: ఎవరో దొంగలు తాళం కప్ప పగలగొట్టి ప్రవేశించారు ప్రభో!దాని తాళం చెవి భద్రంగా నా జేబులో వుంది!
రాజు: ఆ పగలగొట్టిన తాళం కప్ప తెప్పించు నీ జేబులో వున్న తాళం చెవి ఇవ్వు!
(మరుసటిరోజు)
రాజు: భటులారా, ఈ మంత్రిని స్థంభానికి కట్టి , వంద కొరడాదెబ్బలు కొట్టి నిజం కక్కించండి!
రాణీ: మంత్రి గారిని శిక్షించడం దేనికి ప్రభూ?
రాజు: మంత్రి జేబులోని తాళం చెవి, పగలగొట్టబడిన తాళం కప్పకి సంబంధించింది కాదని పరీక్ష మూలంగా  తేలింది!!

.....................................................

ఒక తధాస్తు దేవత! ఈ రోజు ఒక్కసారి కూడ ' తధాస్తు ' పలకలేదు!
మరో తధాస్తు దేవత! ఎందుచేత? 
ఒక తధాస్తు దేవత ! ఎవరో తుంటరి మానవుడు, తధాస్తు దేవతలు పలికే 'తధాస్తు'  ఫలించకుండు గాక అన్నాడు! నోర్మూసుకుని వచ్చేసాను!



.....................................................

వంగ యువరాజు: నీ ప్రేయసి బంగారు వన్నె కాంతులీనుతుందా? నమలేకున్నాను... ఎలా?
కళింగ యువరాజు: బురద నీటిలో ఆమె ప్రతిబింబం కనిపిస్తుంది..!!


.....................................................
 


కవిపుంగవుడు: మహారాజా, రణరంగానికి మీ వెంట నేనూ మా శిష్య బృందం వస్తాము! అనుమతించండి... మీకు విజయం తధ్యము!!
రాజావారు: మీకు యుద్ధము చెయ్యడము రాదు కదా? మీ వల్ల ఏం ప్రయోజనం??
కవిపుంగవుడు: మేం , రణరంగం లో కవితలు చదువుతాము రాజా!!
రాజావారు: ఓహో! ఐతే విజయం తధ్యము! రండి మా వెంట!!

.....................................................


పెద్ద నంది: నీ కొమ్ముల మొనలకి , భక్తులు, ఎడమ చేతి బొటన వేలునూ, చూపుడు వేలునూ ఆనించి, శివదర్శనం చేస్తారటగా? నువ్వు అదృష్టవంతుడివి!
చిన్న నంది: నీకా అదృష్టం ఎందుకు లేదు?
పెద్ద నంది: నేను తంజాఊరు బృహదీశ్వరాలయ నందిని కదా?


.....................................................

లంకా రాక్షసుడి పెళ్ళాం: తృటిలో లంకా నగరం అంతా దగ్ధమై పోయింది. కొంపలో, పప్పూ, బియం కూడా కాలి నుసి అయ్యాయి!
లంకా రాక్షసుడు: ఏలిక వారి తెలివి తక్కువ పని వల్ల , ఆ వానరుడి తోకకు నిప్పంటించారు... ఈ ముప్పు జరిగింది,, ఫ్చ్!
లంకా రాక్షసుడి పెళ్ళాం: ఏలిక వారి అంత:పురం దగ్ధం కాలేదా?
లంకా రాక్షసుడు: అవబోతోంది! దానితో పాటు ఏలిక వారు కూడా,,, ష్,,,ష్,,ఈ మాట బైటకి పొక్కేవ్ జాగర్త!!
(గమనిక : ఈ రాక్షసులు విభీషణుల వారి వర్గం!)

.....................................................

తెలివి రాక్షసుడు: ఇది మాయా తివాసి. దీని మీద కూర్చుని ఈ మంత్రం చదివితే, గాలిలో తేలిపోతుంది! 
మొద్దు రాక్షసుడు:  (తివాసీ ఎక్కు మంత్రం చదువుతాడు). ఇక నా ఇష్టమొచ్చిన చోటికి ఎగిరిపోతాను.. వస్తా.. సెలవ్!!
తెలివి రాక్షసుడు: కిందికి దిగడానికి ఇంకో మంత్రం చదవాలి! చచ్చావ్ పో!!

.....................................................
 

  తెలుగు పండితుడి భార్య: ఏవండోయ్ , భూమి కదులుతున్నది!
తెలుగు పండితుడు: ఇది భూకంపం! ఆదిశేషుడు భూమిని తన భుజాల మీద మోస్తున్నాడు కదా? భూమిని ఒక భుజం నుంచి మరో భుజానికి మార్చినప్పుడు, భూకంపం సంభవిస్తుంది!
తెలుగుపండితుడి భార్య: ఆదిశేషుడు పాము కదా? ఆయనకి భుజాలెక్కడివండీ?
తెలుగుపండితుడు: ఆయన భుజంగము! భుజాలు లేకపోవడమేమిటీ, నీ తలకాయ్?


.....................................................

 రాజు: సిం హాసనానికి అమర్చిన చత్రం ఏదీ? కనిపించలేదే?
మంత్రి: (రాజు గారి చెవి వైపుకి వంగి, రహస్యహంగా) రాణి గారు కట్టుకున్న చీరకి అది "మ్యాచింగ్"  గా లేదని, దాన్ని పీకేయమన్నారు, రాజా!!


.....................................................
 


 వినాయకుడు: మూషికా, నా పాదాలకి రక్షలున్నాయో లేవో చూసి చెప్పు!
మూషికుడు : మీ బొజ్జని కాస్త వెనక్కి లాక్కోండి స్వామీ, మీకే కనిపిస్తాయి!!  

 

మరిన్ని శీర్షికలు
sirasri  question