Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

పవనిజం, పవనోవా పవనోవిచ్‌ - ఈ కథేంటి?

Pawanism, Pawanova Pavanovich

పవన్‌ కళ్యాణ్‌పై అభిమానులకున్న అభిమానం సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ అభిమానానికి గుర్తుగా పెట్టుకున్న పేరే 'పవనిజం'. అయితే ఇప్పుడు కొత్తగా ఈ పవనోవిచ్‌ ఏంటి? ఇటీవలే కలిగిన పవన్‌ కళ్యాణ్‌ - అన్నా లెజినోవాకు పుట్టిన బాబుకి 'మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌' అని నామకరణం చేశాడు పవన్‌ కళ్యాణ్‌. ఈ పేరులోని పవనోవిచ్‌ గురించే ఇప్పుడు చర్చ. అసలు పవన్‌ కళ్యాణ్‌ అసలు పేరు కొణిదెల కళ్యాణ్‌బాబు. చిరంజీవి ఆంజనేయ స్వామి భక్తుడు. చిరంజీవి అసలు పేరు కొణిదెల శివ శంకర వరప్రసాద్‌. అయితే సినిమాల్లోకి వచ్చాక, హనుమాన్‌పై ఉన్న భక్తి కారణంగా తన పేరు చిరంజీవి అని మార్చుకున్నాడు. అలాగే హనుమాన్‌ భక్తుడు కాబట్టే, కళ్యాణ్‌ బాబు పేరుకి ముందు పవన్‌ అని చేర్చాడు సినిమాల్లోకి వచ్చిన తర్వాతే. అలా పవన్‌ కళ్యాణ్‌ అనే పేరు స్థిరపడింది.

అలా పవన్‌ కళ్యాణ్‌, చిరంజీవి పేర్ల వెనక ఆంజనేయస్వామి భక్తి ఉంది. అయితే పవన్‌ కళ్యాణ్‌ తన సంతానానికి పెట్టిన పేర్లు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. పవన్‌ కళ్యాణ్‌ - రేణూ దేశాయ్‌ పిల్లల పేర్లు ఆధ్య, అకీరానందన్‌లలో, అకీరా పేరుకు ప్రాధాన్యత ఉంది. ది గ్రేట్‌ జపనీస్‌ డైరెక్టర్‌ అకీరా కురసోవా అంటే పవన్‌కి చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే కొడుక్కి అకీరానందన్‌ అని పేరు పెట్టుకున్నాడు. కాగా తాజాగా పవన్‌ కళ్యాణ్‌ - అన్నా లెజినోవాకు పుట్టిన కొడుక్కి మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌ అని పేరు పెట్టుకున్నాడు. ఈ పేరులో అన్నయ్య చిరంజీవి పేరు కలిసి రావడం విశేషం. కాగా లెజినోవాకు ఇంకో కూతురుంది. ఆమె పేరు పోలెనా అంజనా పవనోవా. ఈ పేరులో పవన్‌ తల్లి అంజనా దేవి పేరు మిళితమై ఉంది. అదీ పవన్‌ పేర్ల వెనక కథ. ఇదిలా ఉండగా పవన్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ నిమిత్తం యూరప్‌లో ఉన్నాడు. అనూ ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka