Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Balayya Jaisimha first look poster released

ఈ సంచికలో >> సినిమా >>

సన్నీకి మియా ఖలీఫా పోటీ ఇవ్వగలదా

Mia Khalifa entered indian film industry

సన్నీలియోన్‌, మియా ఖలీఫా ఇద్దరూ పోర్న్‌ సినీ రంగం నుండే వచ్చారు. ఇద్దరికీ పోర్న్‌ సినీ రంగంలో మంచి 'అనుభవం' ఉంది. ఇప్పుడు అక్కడ నుండి ఇండియన్‌ సినిమాపై పడ్డారు. సన్నీలియోన్‌ ఆల్రెడీ ప్రూవ్‌ చేసుకుంది. ఇండియన్‌ సినిమాపై ఆల్రెడీ స్టార్‌డమ్‌ సంపాదించుకుంది. మియా ఖలీఫా ఇప్పుడు ఎంట్రీ ఇస్తోంది. సన్నీతో పోలిస్తే ఈమెకి మరికొంచెం అనుభం ఎక్కువే. ఆ అనుభవంతోనే ఇండియన్‌ సినిమాపై కూడా తన తడాఖా ఏంటో చూపించాలనుకుంటోంది. బాలీవుడ్‌ సినీ రంగం నుండి ఎంట్రీ ఇచ్చి సన్నీ లియోన్‌ ఈ స్థాయిలో స్టార్‌ డమ్‌ సంపాదించుకుంటే, న్యూ కమ్మర్‌ మియా ఖలీఫా ఓ మలయాళ సినిమా ద్వారా పరిచయం అవుతోంది. ఉమర్‌ లూలూ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో మియా ఖలీఫా బీభత్సమైన ఎంట్రీ ఇవ్వబోతోంది.

కాగా ఒక్క మలయాళ సినిమాలే కాదు, తెలుగు సినిమాల్లోనూ నటిస్తానంటోంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్‌తో పాటు, రెండు తెలుగు సినిమాల్లో నటించింది సన్నీ లియోన్‌. మంచు మనోజ్‌ హీరోగా తెరకెక్కిన 'కరెంట్‌ తీగ'లో కొన్ని సీన్స్‌తో పాటు ఓ ఐటెం సాంగ్‌లోనూ నటించింది. తాజాగా రాజశేఖర్‌ హీరోగా వస్తోన్న 'గరుడవేగ' సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ చేసింది. ఇకపైనా సౌత్‌ సినిమాలపై గట్టిగా ఫోకస్‌ చేస్తానంటోంది ఈ ముద్దుగుమ్మ. అలాగే మియా ఖలీఫా కూడా వస్తూ వస్తూనే ఇండియన్‌ సినిమాల్లో నటించే అవకాశమొచ్చినందుకు చాలా సంతోషంగా ఉందంటోంది. యాక్టింగ్‌లో తానేంటో నిరూపించుకుంటానంటోంది. ఇక ఫాలోయింగ్‌ విషయానికి వస్తే, సన్నీతో పోలిస్తే మియాకే ఎక్కువ ఫాలోయింగ్‌ ఉంది మరి. ప్రస్తుతం మలయాళ సినిమాతోనే ఎంట్రీ ఇస్తోంది కానీ, ముందు ముందు ఈ ముద్దుగుమ్మ ఇంకెన్ని భాషలు చుట్టేస్తుందో చూడాలిక. 

మరిన్ని సినిమా కబుర్లు
Nagarjuna's action in Varma direction