Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Nagarjuna's action in Varma direction

ఈ సంచికలో >> సినిమా >>

'అదిరింది' ఈ సారి పక్కాగా వచ్చేస్తోంది

adirindi movie ready to released

విజయ్‌ హీరోగా తెరకెక్కిన సినిమా 'మెర్సల్‌'. తెలుగులో 'అదిరింది' పేరుతో విడుదల కావాల్సి ఉంది. కానీ విడుదల పోస్ట్‌ పోన్‌ అవుతూ వస్తోంది. ఒరిజినల్‌తో సమానంగా ఈ సినిమా తెలుగులోనూ విడుదల కావాల్సి ఉంది. కానీ అనూహ్యంగా విడుదల ఆగుతూ వస్తోంది. తమిళంలో విడుదలైన తర్వాతి వారం, విడుదల అన్నారు. కానీ కుదరలేదు. ఆ తర్వాతి వారం పక్కా అన్నారు. అదే అక్టోబర్‌ 27. ఆ రోజు 'అదిరింది' విడుదల కోసం అన్ని ఏర్పాట్లు చేసుకోగా, రాత్రికి రాత్రే విడుదల ఆపమంటూ ప్రకటన వచ్చింది.

అలా ఈ సినిమాకి తెలుగులో ఆటంకాలు ఎదురయ్యాయి. అయితే ఈ సారి మాత్రం పక్కా అంటున్నారు. తేనాండల్‌ నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని తాజాగా ధృవీకరించింది. ఈ నెల 9న 'అదిరింది' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో విజయ్‌ అభిమానులు ఈ సినిమా కోసం ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు. కాగా తమిళంలో ఈ సినిమా సాధించిన వసూళ్లు అన్నీ ఇన్నీ కావు. రికార్డు స్థాయిలో వసూళ్లను కొల్లగొట్టింది ఈ సినిమా. తమిళ సినీ చరిత్రలో ఇంతవరకూ హయ్యెస్ట్‌ వసూళ్లు సాధించిన సినిమాగా ఈ సినిమా నిలిచింది. కాగా ఇక తెలుగులో విడుదల కావడమే ఆలస్యం. ఈ సినిమా కాన్సెప్ట్‌ గురించి ఆల్రెడీ తెలుసు కాబట్టి, అందరికీ అత్యుత్సాహంగానే ఉంది ఈ సినిమా చూడాలని. యంగ్‌ డైరెక్టర్‌ అట్లీ ఈ సినిమాని తెరకెక్కించారు. తన జీవితంలో జరిగిన కొన్ని యదార్ధ పరిణామాలను ఇన్స్‌పిరేషన్‌గా తీసుకుని దానికి కమర్షియల్‌ టచ్‌ ఇచ్చి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. విజయ్‌ త్రిపాత్రాభినయంలో నటించాడు. కాజల్‌ అగర్వాల్‌, సమంత, నిత్యామీనన్‌ హీరోయిన్లుగా నటించారు. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam