Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sira movie  is univarsal movie

ఈ సంచికలో >> సినిమా >>

ముచ్చటగా మూడేళ్ల సినీ నందులు ఇవిగో

three years nandi awards

సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమకు ప్రోత్సాహకంగా, ప్రభుతం తరపున గౌరవ పురస్కారంగా నందీ అవార్డులు ఇచ్చేవారు. అలా నందీ అవార్డుల్ని టాలీవుడ్‌ ఆస్కార్స్‌గా భావించేవారు. ఎంతో గౌరవంగా,ప్రతిష్ఠాత్మకంగా భావించేవారు నంది పురస్కారాన్ని. అయితే ఇప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్‌ విడిపోయాక, ఈ నందీ అవార్డుల చుట్టూ అనుమానపు మేఘాలు అలముకున్నాయి. కానీ ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం ఈ అవార్డుల్ని కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఆ క్రమంలోనే ఈ అవార్డుల కోసం ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే 2014 నుండి 2016 వరకూ మూడేళ్లకూ కలిపి పలు సినిమాలను, నటీ నటులను నంది అవార్డులకు ఎంపిక చేసింది. వీటిలో 2014 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా బాలయ్య నటించిన 'లెజెండ్‌' ఎంపికైంది.

ఉత్తమ నటుడు బాలయ్యగా, ఉత్తమ డైరెక్టర్‌ బోయపాటి శీనును ఎంచుకున్నారు. ఉత్తమ హీరోయిన్‌గా 'గీతాంజలి' సినిమాకి అంజలిని వరించింది నంది అవార్డు. కాగా 2015 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా 'బాహుబలి ది బిగినింగ్‌', ఉత్తమ కథానాయకుడు మహేష్‌బాబు, ఉత్తమ దర్శకుడిగా రాజమౌళిని ఎంపిక చేశారు. కాగా ఈ ఏడాది ఉత్తమ హీరోయిన్‌ అవార్డు అనుష్కని వరించింది 'సైజ్‌జీరో' సినిమాకి గానూ. ఇక 2016 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా 'పెళ్లిచూపులు' సినిమా ఎంపికైంది. ఉత్తమ హీరోయిన్‌ రీతూ వర్మ, ఉత్తమ కథానాయకుడు ఎన్టీఆర్‌గా ఎంపికయ్యారు. ఇకపోతే కొన్ని స్పెషల్‌ అవార్డులు కూడా ఉన్నాయి ఇందులో. వాటిలో ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారాన్ని వరుసగా విశ్వ నటుడు కమల్‌ హాసన్‌, రాఘవేంద్రరావు, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ దక్కించుకున్నారు. ఇక మరో స్పెషల్‌ అవార్డు అయిన రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డుని వరుసగా కృష్ణంరాజు, ఈశ్వర్‌, చిరంజీవి దక్కించుకున్నారు. 

మరిన్ని సినిమా కబుర్లు
akkineni family bysy