Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadaina prapancham

గత సంచిక లోని  నాదైన ప్రపంచం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి... http://www.gotelugu.com/issue240/658/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/

 

(గత సంచిక తరువాయి)... హాల్లో కూర్చున్న ఆకాష్‌ ఒకసారి చుట్టూ కలయ చూశాడు. తన దృష్టిలో సామాన్యమైన ఇల్లు . కాని కీర్తనకు మాత్రం నీడనిచ్చిన వట వృక్షం లాంటిది.

హాల్లో షోకేసులో కనిపిస్తున్న ప్రణీత్‌ ఫోటో చూడగానే అది వరకు ఎన్నడూ ఎరుగని భావం మనసుని చుట్టు ముట్టింది. తరచి చూస్తే తెలుస్తోంది, అది ఈర్ష్య అని. ఇంత వరకూ తన జీవితంలో ఎదుటి వారు తనని చూసి ఈర్ష్య పడటం తప్ప తను ఎవర్ని చూసి ఈర్ష్య పడ లేదు.  అలాంటిది ఈ రోజు కీర్తనకి అంత శ్రేయోభిలాషిగా మారిన ప్రణీత్‌ని చూసి ఈర్ష్యతో మనసు భగ్గుమంటోంది.

ఆ ఫోటో వంకే తదేకంగా చూస్తుండిపోయాడు. తనకి అందిన రిపోర్ట్స్‌ గుర్తొచ్చాయి. కీర్తన విషయంలో తను చెప్పిన అబద్దాలన్నీ నిజాలు చేసి చూపించాడు ప్రణీత్‌. అందుకే ఆమె తనని, ఇంటిని కాదనుకొని ఇతని దగ్గరకు వచ్చేసింది.

వీళ్ళిద్దరూ ఇక్కడ కలిసి వుండటం ఏ దురుద్దేశమూ లేక పోవచ్చు. కాని గ్రేట్‌ ఇండస్ట్రియలిస్ట్‌ ఆకాష్‌ ఉడ్‌బీ ఇంకొకరితో కలిసి వుండటం తాను భరించ లేని విషయం. పందెమూ వద్దూ, ఏదీ వద్దూ. నీ ఇష్టానుసారం బాగానే అంతా జరుగుతుందని గట్టిగా చెప్పేద్దామన్న ఆవేశం వస్తోంది. అంతలోనే అశోక్‌ మాటలు ఆపేస్తున్నాయి.

కిచెన్‌లో నుంచి వస్తున్న కీర్తనను చూసి అతని ఆలోచనలు ఆగి పోయాయి. తదేకంగా ఆమె వంకే చూశాడు. ఎప్పటి లాగే ఒళ్ళంతా కప్పుకున్నట్లు కాటన్‌ చుడిదార్‌లో వుంది కీర్తన.

ఎందుకో ఇది వరకటి లా ఆమెకు ఫ్యాషన్స్‌ తెలీదన్న చులకన భావం కలగ లేదు. ఎదుటి వారిలో తమ డ్రస్సింగ్‌ అసభ్య భావాలను రేకెత్తించ కూడదన్న అవగాహన కనిపించింది. తన లోని ఈ మార్పు తనకే స్పష్టంగా కనిపించింది.

‘‘డ్రస్‌ చాలా బాగుంది....’’ మనస్పూర్తిగా మెచ్చుకున్నాడు ఆకాష్‌.

రెప్పలు  టప టప ఆర్పింది కీర్తన. అతను అంత చనువుగా అంటాడని వూహించ లేదు. ఇప్పుడు తమిద్దరి మధ్య అంత ఇంటిమసీ లేదని ఆమె అభిప్రాయం.

మౌనంగా వుండి పోయింది. హఠాత్తుగా  ఆమెని గుండెలకి హత్తుకోవాలనిపించింది ఆకాష్‌కి.

ఎందుకో అర్ధం కాలేదు. ఈ గొడవలు ఇవేమీ వద్దు. ప్రేమని మించింది ఏముంటుంది? అని గట్టిగా సన్నిహితంగా మెలిగినా ఆమె పెద్దగా అభ్యంతరం చెప్పేది కాదు. అప్పుడు ఆమె మనసంతా తనే!

అయితే తమిద్దరి మధ్యా వాలీ బాల్‌ కామన్‌ పాయింట్‌ కావడం మూలంగానే ఆమె తనని ప్రేమించడం తను భరించ లేక పోతున్నాడు. దాన్ని మార్చుకోడానికే తను ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆమెకి అది అర్ధం కాదు.

‘‘బుజ్జీ....!’’ ఆప్యాయంగా పిలిచాడు.

అతని ప్రేమ పూర్వకమైన పిలుపుకి మనసు కరిగి పోయింది....ఇదేంటి? ఎంతో స్టెబర్న్‌ అనుకున్న తను ఇలా అయి పోతోంది? తన జీవితంలో అతి ముఖ్యమైన లక్ష్యాన్ని హేళన చేసిన మనిషి విషయంలో తనకి ప్రేమ ఏంటి? అతన్ని చూసి, అతని మాటలు వినీ తనెందుకు లొంగి పోవాలి?

బింకంగా కూర్చుంది. మొహంలో బేల తనం స్పష్టంగా కన్పిస్తుండగా తన మీద కోపాన్ని ప్రదర్శించాలి కదా అన్నట్లు కూర్చున్న కీర్తనని చూసి మనసాపుకో లేక పోయాడు ఆకాష్‌.

‘‘నన్ను నిజంగా ప్రేమించ లేదా?’’ నెమ్మదిగా అడిగాడు. తలెత్తి చూసింది. ఎదురుగా ప్రేమతో నిండిన అతని మొహం.

అలాగే చూస్తుండి పోయింది.

‘‘చెప్పు’’ రెట్టించాడు ఆకాష్‌.

మాట్లాడ లేదు కీర్తన.....

అతను లేచి మెల్లగా దగ్గరకి వస్తున్నాడు.

అయి పోయింది..... ఇక తన మనసంతా బలహీనతకి లోనయి పోయింది.

ఇతన్ని వారించడం తన వల్ల కాదు. మెల్లగా వచ్చి కూర్చున్నాడు.

తనకి పరిచితమైన బాడీ స్ప్రే పరిమళం చుట్టు ముట్టింది. తల వాల్చేసింది.

ఆకాష్‌ ఆమె చేతిని తన చేతి లోకి తీసుకున్నాడు. కంపిస్తున్న ఆమె వేళ్ళని పరిశీలనగా చూసి పెదాలాన్చి చిన్నగా చుంబించాడు.
సున్నితంగా చేతిని విడిపించు కొని లేవ బోయింది. మణి కట్టు దగ్గర చేతిని పట్టుకుని ఆపేశాడు.

బిక్క మొహం వేసి చూసింది. ఆమె భయం అర్ధమై అతని మొహంలో చిన్న నవ్వు వెలిగింది. గాభరాగా తల తిప్పేసుకుంది.

‘‘ఆ రోజు బీచ్‌లో వున్నట్లుగా వుండాలని వుంది.’’ ఫ్రాంక్‌గా చెప్పేసాడు.

తెల్లబోయి విని దూరంగా జరగ బోయింది. ఆపేసి మరింత దగ్గరగా లాక్కున్నాడు.

‘‘మనిద్దరి మధ్యా ఎవరు ప్రవేశించాలని చూసినా నేను సహించను. నిన్ను నా నుంచీ దూరం చెయ్యాలనుకునే వాళ్ళని నేను తేలిగ్గా వదిలి పెట్టను.’’ పరోక్షంగా ప్రణీత్‌ గురించి హెచ్చరికగా పలికాడు.

అతని మనసేంటో అర్ధమయింది కీర్తనకి. ప్రణీత్‌ గురించి ఆకాష్‌ జెలసీ ఫీలవుతున్నాడు. వెంటనే కితకితలు పెట్టినట్లుగా మొహం లోకి నవ్వు వచ్చేసింది కీర్తనకి.

ఆకాష్‌కి ఎదురుగా బాసిం పట్టు వేసుకుని కూర్చుని....

‘‘యూ నో! ప్రణీత్‌ ఈజ్‌ ఎ నైస్‌ గై .... నేనంటే చాలా కేరింగ్‌. అంతే కాదు నా గేమ్‌ గురించి చాలా ఇంట్రెస్ట్‌ చూపిస్తాడు. నా లైఫ్‌లో అతనికి చాలా ఇంపార్టెంట్‌ ప్లేస్‌ వుంది.’’ కీర్తన ఎగ్జయిటింగ్‌గా చెప్పుకు పోతూనే వుంది.

చూస్తుండగానే అతని మొహంలో భావాలు మారి పోయాయి. మొహం కఠినంగా తయారయింది. కళ్ళు ఎరుపెక్కి పోయాయి. కుడి చేత్తో ఆమె బుగ్గల్ని నొక్కి పట్టాడు. మాట ఆగింది. అతని వంక భయంగా చూసి చెప్పటం ఆపింది.

పగిలిన పండు నుండి తొంగి చూసే దానిమ్మ గింజల్లా తెల్లగా , చిగుళ్ళు గులాబీ రంగులో మెరుస్తున్నాయి. బుగ్గల్ని నొక్కి పట్టడం మూలన్గా పెదాలు విడి వడి ఆహ్వానిస్తున్నాయి.

చేతిని అలాగే వుంచి ముందుకి జరిగాడు. పెద్దవైన కళ్ళలో కనిపిస్తున్న భయం కూడా ప్రొవొకేటింగానే వుంది.

అతని పెదాలు ఆమె పెదాల్ని తాక బోతుంటే గబుక్కున తల తిప్పుకో బోయింది. ముందే వూహించినట్లుగా అతను రెండు చేతులతో ఆమె చెంపల్ని పట్టుకుని పెదాల మీద దాడి ప్రారంభించాడు.

మృదువైన ఆమె కింది పెదవి స్పర్శకి అతని లోని వాంఛలన్నీ నిద్ర లేచాయి. నాలుకతో ఆమె పై పెదవిపై ప్రేమాక్షరాలు లిఖించాడు. వివశురాలయి పోయింది కీర్తన. అతన్ని వారించ లేని అశక్తతతో పడి పోయింది.

తన లక్ష్యం, పందెం అన్నీ మర్చి పోతున్నట్లుగా వుంది. ఇతనిలో ఇంత ఆకర్షణ శక్తి వుందని తను గ్రహించ లేదు.

ఇది కేవలం ఆకర్షణేనా.... ఆకర్షణే అయి వుంటే అతను మోసం చేసాడని తెలిసి తన జీవితాన్నే కోల్పోయినట్లు తను బాధ పడదు.
అంటే ఇది ప్రేమే...? ప్రేమించిన మనిషి స్పర్శ ముందు అన్నీ దిగదుడుపేననిపిస్తోంది. ఇలాగే ఇతని చేతుల్లోనే మరణించినా చాలనిపిస్తోంది.
అప్రయత్నంగా ఆమె చేతులు  అతని వీపుల చుట్టూ పడ్డాయి. అది గమనించి అతను మరింత అడ్వాన్సయి పోయాడు.

లేచి నిలబడి ఆమెని రెండు చేతుల తోనూ అవలీలగా ఎత్తుకున్నాడు. మెయిన్‌ డోర్‌ తలుపు వేసి బెడ్రూం లోకి వెళ్ళి ఆమెని పదిలన్గా పడుకో బెట్టాడు.

స్ప్రింగ్‌ లా లేచి కూర్చుంది కీర్తన. కాంక్షతో ఎర్ర బడిన అతని కళ్ళు చూసి బిడియంగా ముడుచుకు పోయింది. చుడీ దార్‌ని కొంచెం పైకి లేపి నడుం వంపు మీద చెయ్యేశాడు. ఉఛ్చ్వాస భారంగా మారడంతో హృదయం మరింత విశాలమయింది.

అక్కడ పడింది అతని చూపు.

‘‘నీతో చాలా కష్టం’’ సడెన్‌గా అన్నాడు ఆకాష్‌. హస్కీగా ఉందతని వాయిస్‌.

ఉలిక్కి పడి చూసింది. ఆమె చూపులో ప్రశ్నని గమనించి....

‘‘శరీరం అంతా, ఇంత అందం పరుచుకుని వుండగా ఎక్కడ నుంచి మొదలుపెట్టాలో అర్ధం కావడం లేదు.’’ ఆమె చుడీదార్‌ బటన్స్‌ విప్పుతూ అన్నాడు.

‘‘వద్దు!?’’ సిగ్గుతో ముడుచుకు పోతూ అంది. అతను వినే స్టేజ్‌లో లేడు.

ఆమె డ్రస్‌ని తొగించగానే స్పోర్ట్స్‌ బ్రా నుంచి కన్పిస్తున్న ఉబికిన స్తన ద్వయం అతని మతిని పోగొట్టింది.

‘‘నువ్వు వాలీబాల్‌ ఆడేప్పుడు కూడా ఎందుకు ఎక్స్‌పోజింగ్‌గా వుండవో ఇప్పుడు అర్ధమయింది.’’ బ్రా మీద చెయ్యేస్తూ అన్నాడు.
మొహం అంతా అరుణిమ పులుముకుంది. అతని ఛాతీమీద చెయ్యి వేసి నెట్టేస్తూ....‘‘ప్లీజ్‌ వద్దు....అలా మాట్లాడొద్దు.’’ ముందుకు వంగి పోయి అంది.

అతను ఎంత హై సొసైటీలో పెరిగినా స్త్రీ స్పర్శ అతనికీ కొత్తే! మొదటి సారిగా అతని మనసుకి దగ్గరగా వచ్చిన అమ్మాయి కీర్తన.
అందుకే ఆమె శరీరం మీద కూడా హక్కున్నట్లుగా అనిపిస్తుంది. మనసంతా ప్రేమతో నిండినపుడు తనువు పెనవేసుకోవడం అపూర్వమైన అనుభూతి.

దానిని మనసారా ఆస్వాదిస్తున్నాడు ఆకాష్‌. కానీ కీర్తనకి తన పరిస్థితే అయోమయంగా వుంది. ఇందాకటి వరకూ ఆకాష్‌ అంటే తనకి ద్వేషం అనీ, అతను కనిపిస్తే కసి తీరా తిట్టాలనీ వుండేది.

కానీ ఇపుడేంటీ, ఇలా....అతని సమక్షంలో మనశ్శరీరాలు రెండూ లొంగి పోతున్నాయి.

‘‘ఆడ వాళ్ళ ఒళ్ళు ఇంత స్మూత్‌గా వుంటుందని తెలీదు.’’ ఆమె హృదయం మీద పరుచుకున్న వెన్నెల తెల్ల దనాన్ని స్పృశిస్తూ ఆశ్చర్యంగా అన్నాడు.

సృష్టి లోని అద్భుత సౌందర్యాన్ని చూసినపుడు కలిగే ఆశ్చర్యం అతని కళ్ళలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

అందంగా ఒంపులు తిరిగి మరీ సుకుమారం కాకుండా, దృఢంగా వున్న ఆమె పొట్టని మృదువుగా నిమురుతూ....‘‘మార్వలెస్‌!’’ అన్నాడు.
సిగ్గుతో ఎర్ర బడి పోయింది ఆమె మొహం. ఓరగా అతని మొహం చూసింది. ఎంత మందికో కల రాకుమారుడితను. ఇప్పుడు తన సౌందర్యాన్ని ప్రశంసిస్తూ తన సన్నిధిలో వున్నాడనుకోగానే కించిత్‌ గర్వం కలిగింది.

చెదిరిన జుట్టు మొహం మీద పడ్తుండగా వయసు ధాటికి కందిన మొహం, షర్టు గుండీలు విడివడటం మూలంగా విశాలంగా కనిపిస్తున్న ఛాతీతో వున్న ఆకాష్‌ ఆమె వయసుని రెచ్చగొడుతున్నాడు.

హఠాత్తుగా తలెత్తి చూసిన ఆకాష్‌ తననే పరిశీలనగా చూస్తున్న కీర్తనని చూసి కొంటెగా నవ్వాడు.

గబుక్కున తల తిప్పుకుంది.

‘‘నేను బావున్నానా?’’ అడిగాడు.

‘‘నేనేం చూడ లేదు.’’ విసురుగా అంది.

‘‘మొహమాట పడకులే. నిజం చెప్పు. నన్నుచూసి టెంప్ట్‌ అయి పోతున్నావు కదూ!’’ చిలిపి తనం అతని గొంతు నిండా చిందులేస్తోంది.

(సశేషం)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
premiste emavutundi?