Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
prize-for-best-comment

ఈ సంచికలో >> శీర్షికలు >>

8 -12-2017 నుండి 14-12-2017 వారఫలాలు - - డా. టి. శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తం మీద చేపట్టిన పనులను పూర్తిచేయుటకు స్పష్టమైన ప్రణాళిక కలిగి ఉండుట మంచిది. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది, సంతానపరంగా ముఖ్యమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట సూచన. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. స్త్రీ పరమైన విషయాల్లో ఏమాత్రం జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. విదేశీప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది.

 

 వృషభ రాశి : ఈవారం మొత్తం మీద సంతానంకు అధికసమయం ఇచ్చే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. సోదరులతో నూతన చర్చలకు అవకాశం ఉంది. సాధ్యమైనంత మేర వారి ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతారు, అధికారుల నుండి రావాల్సిన సహకారం లభిస్తుంది. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. జీవితభాగస్వామితో విభేదాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు, తగిన జాగ్రత్తలు తీసుకోండి.

 

 


మిథున రాశి : ఈవారం మొత్తం మీద నూతన ఉద్యోగాల కోసం చేసిన ప్రయత్నాలు కలిసి వస్తాయి, అవకాశాలను అందిపుచ్చుకొనే ప్రయత్నం చేయండి. మీ మాటతీరు మూలాన నూతన సమస్యలు ఏర్పడే ఆస్కారం ఉంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులు లభిస్తాయి. సంతానం వలన పెద్దలనుండి ప్రశంశలు పొందుటకు ఆస్కారం ఉంది. గతంలో తీసుకున్న రుణాల వలన ఇబ్బందులు పెరుగుతాయి. కాస్త ప్రణాలిక కలిగిఉండుట వలన మేలుజరుగుతుంది. జీవితభాగస్వామి వలన పనిభారం పెరుగుతుంది.

 

 

కర్కాటక రాశి : ఈవారం మొత్తం మీద నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే ఆస్కారం కలదు. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకోండి. రావాల్సిన ఆర్థికపరమైన సహకారాలు సమయానికి అందుతాయి. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి, నూతన ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. సోదరులతో నూతన చర్చలకు అవకాశం ఉంది. సాధ్యమైనంత మేర అనవసరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండుట సూచన. సంతానపరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు.

 

 

 

 సింహ రాశి : ఈవారం మొత్తం మీద నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు. చేపట్టిన పనుల విషయంలో స్పష్టత అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే ఆస్కారం ఉంది. గతంలో రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. సోదరుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. కుటుంబపరమైన విషయాల్లో ముఖ్యమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్ళుటకు అవకాశం ఉంది. మిత్రులతో కలిసి సమయం గడుపుతారు. విదేశాల్లో ఉన్న ఆత్మీయుల నుండి సహకారం లభిస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది.

 

కన్యా రాశి : ఈవారం మొత్తం మీద మిత్రులతో లేక ఆత్మీయులతో సమయాన్ని గడుపుటకు ఆస్కారం ఉంది. చేపట్టిన పనులను కాస్త నిదానంగా పూర్తిచేసే ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం కలదు. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుటకు అవకాశం ఉంది. నూతన వాహనాలు లేక విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. బంధువుల నుండి వచ్చిన విషయాలు మిమ్మల్ని సందిగ్ధంలో పడవేసే అవకాశం ఉంది. సాధ్యమైనంత మేర అందరిని కలుపుకొని వెళ్ళుట మంచిది.

 


తులా రాశి : ఈవారం మొత్తం మీద ఆరంభంలో నూతన సమస్యలు వచ్చే అవకాశం ఉంది, ఆలోచనలను కలిగి ఉండుట మంచిది. మీ నిర్ణయాలకు మీరే భాద్యులు అని సమయం గడిచిన ద్వారా తెలుసుకొనే అవకాశం ఉంది. సాధ్యమైనంత మేర నష్టాన్ని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం. మీ మాటతీరుమూలాన నూతన సమస్యలు పెరిగే ఆస్కారం ఉంది. జీవితభాగస్వామితో మరింతగా సమస్యలు పెరిగే అవకాశం ఉంది జాగ్రత్త. తల్లితరుపు బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో మరింత శ్రద్ద కలిగిఉండుట సూచన. గతంలో తీసుకున్న నిర్ణయాలు సరిచూసుకొనే ప్రయత్నం చేయాలి.

 

వృశ్చిక రాశి : ఈవారం మొత్తం మీద చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేసే ఆస్కారం ఉంది. స్త్రీ పరమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. వాహనాల వలన ఇబ్బందులు అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది, సాధ్యమైనంత మేర తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. సోదరులతో చేపట్టిన చర్చలు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. దైవపరమైన విషయాలకు సమయం ఇస్తారు. పెద్దలనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది

 

 

ధనస్సు రాశి ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంశలు పొందుతారు. ఉద్యోగంలో పనిభారం పెరుగుటకు అవకాశం ఉంది. తోటివారిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. దూరప్రదేశంలో ఉన్న వ్యక్తుల నుండి లేక బాంధవుల నుండి నూతన విషయాలు అలాగే సహకారం పొందుతారు. విలువైన వస్తువులను కొనుగులు చేయకపోవడం మంచిది. వాటిని నష్టపోయే ఆస్కారం కలదు. గతంలో రావలిసిన ధనం సమయానికి చేతికి అందుతుంది. కొన్ని కొన్ని సందర్భాలలో మీమాటతీరు కొంతమందికి నచ్చకపోవచ్చును.

 

మకర రాశి :   ఈవారం మొత్తం మీద చర్చాపరమైన విషయాలకు అధికసమయం ఇచ్చే అవకాశం ఉంది. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో స్పష్టమైన ప్రణాళిక కలిగి ఉండుట సూచన. గతంలో చేపట్టిన పనులకు సమాధానంచెప్పవల్సి వస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో అశ్రద్ధ కూడదు, తగిన జాగ్రతలు తీసుకోవడం సూచన. సాధ్యమైనంత మేర సమయానికి భోజనం చేయుట మంచిది. జీవితభాగస్వామి నుండి అలాగే కుటుంబసభ్యుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో అధికారులతో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం కలదు.

 

 

కుంభ రాశి : ఈవారం మొత్తం మీద మిత్రులనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో అధికారుల నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. రుణపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచనమానసికంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది , బంధువుల నుండి ఇబ్బందులు తప్పక పోవచ్చును. అనుకోకుండా చేసే ప్రయాణాలు పెద్దగా ఉపయోగ పడకపోవచ్చును. నూతన పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. సమయాన్ని వృధాచేసే అవకాశం ఉంది , జాగ్రత్త. జీవితభాగస్వామి ఆలోచనలు మిమ్మల్ని ఆలోచనలో పడవేస్తాయి,సర్దుబాటు అవసరం.

 

 

 

మీన రాశి : ఈవారం మొత్తం మీద మీ ఆలోచనల్ను పెద్దలకు తెలియజేస్తారు. చేపట్టిన పనులను కొంతమేర పూర్తిచేసే అవకాశం ఉంది. కొన్ని కొన్ని విషయాల్లో కాస్త అసంతృప్తిని పొందుతారు. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకొనే ప్రయత్నం విఫలం అవుతుంది. సాధ్యమైనంత మేర చర్చలకు దూరంగా ఉండుట సూచన. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. కుటుంబంలో శుభకార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. బంధువుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది.

మరిన్ని శీర్షికలు
sarasadarahasam